ఈ మాసం సిలికానాంధ్ర

తెలుగు సాంస్కృతికోత్సవం 2017

ఈ మాసం సిలికానాంధ్ర
అక్టోబర్ 7న న్యూజెర్సీ నగరంలో విజయవంతంగా జరిగిన తెలుగు సాంస్కృతికోత్సవం పై ఒక ప్రేక్షకుడి అనుభూతి: నూట నలభై అక్షరాల్లో సంభాషణలు; మూడు నిమిషాల కంటే ఎక్కువగ దేని పైన దృష్టి పెట్టడం కష్టంగా వున్న ఈ రోజుల్లో; WhatsApp ఫార్వర్డ్లు; ఫేస్ బుక్ లైక్ ల మధ్య, అతి వేగంగా గడిచి పోతున్న కాలం ఇది. నిలకడగా వుండి, ఏ ఆర్భాటం లేకుండ, ఏ సెన్సేషన్ లేకుండ కేవలం మన సంస్కృతి,సాంప్రదాయం మరియు చరిత్ర ను గుర్తించి, గౌరవించాలన్న ఒకే ఒక ఉద్ధేశంతో ఒక కార్యక్రమం చెయ్యాలనుకోవడం గొప్ప ఆలోచన. ఆలోచన గొప్పగ వుంటే సరిపోదుకదా. దానిని అంతే గొప్పగా అమలుపర్చాలి. అందులోను, ప్రేక్షకులను ఆకట్టుకునేలా చేయాలి. అసలు ఇది సాధ్యమా? ఇలాంటి సాహసమే నిన్న సిలికాన్ ఆంధ్ర మనబడి వారు చేశారు, చేసి గెలిచారు, గెలిచి మెప్పించారు. ఆరు గంటలకు పైగా జరిగిన ఈ కార్యక్రమంలో, జానపద గేయాలు, నృత్యాలు, మన పండగలైన ఉగాది నుండి ముస్లింలు జరపుకునే మొహ

తెలుగాట-ఇదొక తిరకాటం

ఈ మాసం సిలికానాంధ్ర
దీపావళి పండుగ, అక్టోబర్ 30 నాడు సిలికానాంధ్ర-TV9 సంయుక్త నిర్వహణలో ప్రారంభమైన తెలుగాట-ఇదొక తిరకాటం! కార్యక్రమాన్ని ఇండియాలో ప్రతి ఆదివారం ఉదయం 10:30కు, అమెరికాలో ప్రతి శని, ఆదివారాల్లో 1:30 PM PST/4:30 PM ESTల్లో చూసి మీ అభిప్రాయాలను తెలియజేయండి.