కథా భారతి

హనుమాన్ హేవన్

కథా భారతి
డా. తంగిరాల. మీరాసుబ్రహ్మణ్యం శ్రీనగర్ కాలనీ లో పని ముగించుకుని బయటకు వచ్చిన సీతారాం కు బస్ స్టాప్ లో నిలబడిన ఉమాపతి కనబడ్డాడు. అసలు అతను ఉమాపతి అవునా కాదా అని కాసేపు మల్ల గుల్లాలు పడ్డాడు. ఎందుకంటే ఉమాపతి ది నల్లటి నొక్కుల క్రాపు . దూరంనుండి చూస్తే ముక్కు మొగం ఉమాపతి లాగే ఉన్నా బట్ట తల చూసి అనుమాన పడ్డాడు. ఎందుకైనా మంచిదని దగ్గరగా వెళ్ళి చూసి అతగాడు తన స్నేహితుడు ఉమాపతే అని నిర్ధారించుకుని వెనుక నుండి వెళ్ళి వీపు మీద గట్టిగా చరిచాడు. ముందుకు పడ బోయిన ఉమాపతి నిలదొక్కుకుని "ఎవడ్రా ఆది "అంటూ రౌద్రమ్ గా వెనక్కి తిరిగాడు. ముప్పై రెండు పళ్ళు కనబడేలా నవ్వాడు సీతారాం. "ఇదే మరి. ముప్పై అయిదేళ్ళ దాకా పెళ్లి చేసుకోకండా ఉంటే నొక్కుల క్రాపు పోయి బట్ట తల రాదూ ? "స్నేహితుడి భుజాల చుట్టూ చేతులు వేసి ఆప్యాయంగా దగ్గరికి తీసుకున్నాడు సీతారాం. సీతారాం ను చూడగానే ఉమాపతి ముఖం చేట అంత అయ్యింది. ఇంటర్ లో రెండే

పతి పత్ని ఔర్ వహ్

కథా భారతి
-ఆర్. శర్మ దంతుర్తి సాయింత్రం రావాల్సిన మనోహర్ మధ్యాహ్నం ఒంటి గంటకే ఇంటికొచ్చి నిస్త్రాణగా సోఫాలో కూలబడ్డాడు. ఇన్నాళ్ళ టెన్షన్ కి తెరపడి మొత్తానికో లే ఆఫ్ నోటీసు చేతిలో పెట్టి రెండు నెలల జీతంతో వదిలించుకున్నారు తనని మేనేజర్లు. అమ్మాయి ఇప్పుడు కాలేజీలో చేరింది కనక ఇంట్లో ఉండేది తనూ, సంధ్యా మాత్రమే. ఆవిడ డాక్టరు కనక డబ్బులకేమీ ప్రస్తుతానికి ఢోకాలేదు కానీ …. ఆలోచనలు కట్టిపెట్టి, ఫోను తీసి సంధ్యకి ఫోన్ చేసాడు. డాక్టర్ గారు పేషెంట్ ని చూస్తున్నారుట మరో పావుగంటలో ఆవిడే పిలుస్తారని సమాచారం. చేసేదేమీ లేదు కనక ఉద్యోగంలో ఇప్పటివరకూ పోగేసుకున్న కాయితాలూ బాక్సులూ బేస్ మెంట్ లోకి చేరేసేసరికి గంటన్నర; అప్పుడు సంధ్య ఫోన్ చేసింది. ఉద్యోగం పోయినట్టు తెలియగానే ఆవిడే అంది, “పోనీలెండి ఇప్పుడు కాస్త ఇల్లు సర్ది, వంట వండుదురు గాని.” నవ్వేడు మనోహర్. సాయింత్రం మరోసారి మాట్లాడుకోవచ్చు అని నిర్ణయించుకున్నాక ఆవిడ ప

భిన్నత్వంలో ఏకత్వం (Unity in Diversity)

కథా భారతి
రచన: ఇర్షాద్ జేమ్స్ జగన్ పూర్తి పేరు జంబలకిడి జగన్మోహన రావు. జగన్ ఆమెరికా వచ్చి Jag అని పేరు మార్చుకున్నాడు, పిలవటానికి సులువుగా వుండటానికి. జగన్‌కి ముప్పై యేళ్ళుంటాయి. కాని ఇంకా పెళ్ళి కాలేదు. జగన్ ఎప్పుడు ఇండియాకి ఫోన్ చెసినా, వాళ్ళమ్మ, నాన్న, “ఒరేయ్, పెళ్ళెప్పుడు చేసుకుంటావురా?” అని అడుగుతూంటారు. “నాకు పెళ్ళి ఇష్టం లేదమ్మా !!” అంటాడు జగన్. కాని ఈసారి ఇండియాకి ఫోన్ చేసినప్పుడు జగన్ వాళ్ళ నాన్న ఒక కొత్త డైలాగు వేసాడు. “ఒరేయ్, త్వరగా పెళ్ళి చేసుకోరా, మేము ముసలివాళ్ళమైపొతున్నాము”, అన్నాడు జగన్ వాళ్ళ నాన్న. “నేను పెళ్ళి చేసుకుంటే మీరు ముసలివాళ్ళవటం మానేస్తారా?” అని మనసులొ అనుకున్నాడు జగన్. కాని బయటకి మాత్రం, “నాకు పెళ్ళి ఇష్టం లేదు నాన్నా !!” అని పాత డైలాగే వేసాడు జగన్. ఈసారి జగన్ వాళ్ళమ్మ కొత్త డైలాగు వేసింది. “ఒరేయ్, మా సంగతి పక్కన పెట్టు. నువ్వు కూడా ముసలి వాడివయిపోతున్నావు !!” అంది జ

నిస్వార్ధ ప్రార్ధనా ఫలం

కథా భారతి
-ఆదూరి హైమావతి నడకుదురు అనే గ్రామంలో నరసింహం అనే ఒక యువకుడు ఉండే వాడు. తల్లీ తండ్రీ ఎంత చెప్పినా చదువుకోక, ఏపనీ నేర్చుకోక తిని తిరుగుతూ సోంబేరిలా తయారయ్యాడు. తల్లీతండ్రీ మొత్తు కుని వాడికోసమే దిగులు పడి గతించారు.వాడికి ఆకలికి అన్నంపెట్టేవాళ్ళు లేక కడుపుమంటకు ఆగలేక చిన్న చితకా దొంగతనాలు చేయసాగా డు. తోటల్లోపడి దొరికిన కాయా పండూతింటూ ఆకలి తీర్చుకో సాగాడు. ఎవరైనా ఇదేమని అడిగితే వారిమీద తిరగబడి కొడుతూ ,అడ్డదిడ్డంగా తిరుగుతూ కడుపు నింపు కుంటూ చివరకు ఒక దుర్మార్గుడుగా తయారయ్యాడు. వాడితో మాట్లాడనే అంతా భయపడేవారు. ఎవరైనా డబ్బిచ్చి ఏం చేయమన్నాచేస్తూ ,చివరకు హంతకుడై ఎవ్వరికీ దొరక్కుండా తిరగ సాగాడు. నడకుదురు గ్రామం చిట్టడవికి దగ్గరగా ఉండేది .ఆగ్రామం నుంచే అటూ ఇటూ నగరాలకు వెళ్ళాలి. చిట్టడవి దాటను కాలిబాటా, బండ్ల బాట తప్ప మరో మార్గంలేదు.అందువల్ల అంతా చిట్టడవిదాటను భయ పడేవారు.కొందరు స్వార్ధపరులు ప్రత్య

వీసా

కథా భారతి
-ఆర్. శర్మ దంతుర్తి “ఈ సారైనా ఎలాగోలా వీసా సంపాదించవల్సిందే“ “అదంత సులభం అయితే ఇంకేం? వీసా ఆఫీసర్ మూడ్ బట్టి మన అదృష్టం బట్టీను. పోనీ, అది ఎలాగా మన చేతిలో లేదు కానీ, అమ్మని అడుగు ఏం చేయాలో. మనం కాయితాలు సరిగ్గా ఉన్నాయో లేదో చూసుకుందాం. అమ్మ ఏదైనా దేవుడికి మొక్కమంటుందేమో చూడు.” “అమ్మా నువ్వేమంటావ్?” “వస్తున్నా, కాస్త చేయి ఊరుకోలేదిప్పుడు. కాసేపాగు.” “…” “ఇప్పుడు చెప్పు ఏంటి కధ?” “వీసా కి నాలుగోసారి వెళ్తున్నా. మూడు సార్లూ ఏదో వంక పెట్టి వెనక్కి పంపించేసాడు. ఈ సారైనా ఎలాగోలా సంపాదించాలి. ఏం చేద్దాం?” “క్రితం సారి నేను చెప్పినట్టు చేయమంటే పోజు కొట్టారు కదా తండ్రీ కొడుకులు? ఇప్పుడు నా దగ్గిరకొచ్చారా?” “ఏదో తప్పు అయిపోయింది అప్పుడు. ఇప్పుడు ఎలాగైనా వీసా రావాలి. ఏం చేయమంటావ్?” “హైద్రాబాద్ లోనే కదా వీసా ఇచ్చేది?” “ఔను. నువ్వూ వస్తావా వెళ్ళడానికి?” “కాదు కానీ, హైద్రాబాద్ లో వీస

ఆచరణ

కథా భారతి
-ఆదూరి హైమావతి సత్యానందులవారు " సునందూ!" అంటూ తన శిష్యుడ్ని పిలిచారు. "గురుదేవా!" అంటూ సునందు గురువు ఎదుట నిలిచాడు వినయంగా. " సునందూ! నీవు ఒకపని చేయాల్సి ఉంది .. కావేరీ నదికి ఆవల ఉన్న నామిత్రుడు విజయానందులవారి 'ఆనందాశ్రమానికి ' వెళ్ళి , మన తోటలో కాసిన ' చూత ' ఫలాలను , సమర్పించి రావాలి ,వాటిని ఒక వెదురు బుట్టలో నింపి తయారుగా ఉంచాను." అని చెప్పారు. " అలాగే గురుదేవా!" అంటూ తన సమ్మతిని తెలిపాడు సునందు. " సునందూ ! నీవు ఒక్కడివే వెళ్ళిరాగలవా లేక నీకు తోడుగా మరొకర్ని పంపమన్నావా?" అని అడి గారు గురుదేవులు. "గురుదేవా తమ ఆశీస్సులే నాకు తోడు ..తమ సమ్మతి ప్రకారం చేస్తాను." అని వినయంగా గురువు పాదాలంటి నమస్కరించాడు సునందుడు. " సరేమరి . నీవుఒక్కడివే బయల్దేరు , ఎప్పుడు బయల్దేరుతావు?" " వెంటనే గురుదేవా! ఆ వెదురు బుట్ట ఇప్పించండి "అన్నాడు. అది మధ్యాహ్న సమయం .మరికొద్ది క్షణాల్లో భోజనాలు మొదలవు తాయి.శిష

బ్రహ్మ తేజస్సు

కథా భారతి
-అన్నపంతుల జగన్నాధ రావు (ఇది తెలంగాణలో నవాబుల కాలంలో జరిగిన యదార్ధ సంఘటనగా జనశ్రుతిలో వుంది) ఆకలి. మూడక్షరాల మాట. మనిషిని ముప్పుతిప్పలు పెట్టే మాట. జఠరాగ్నిని తట్టుకోవడం కష్టమనిపిస్తోంది నారాయణ సోమయాజికి. అన్నం తిని మూడు రోజులైంది. మూడు రోజుల కిందట సాయంకాలం తిన్న గుప్పెడు అటుకులే ఆఖరి ఆహారం. రెండురోజుల నుండీ మంచినీళ్ళ తోనే కాలం గడుపుతున్నాడు. పొద్దున్న పంటి బిగువున సంధ్యావందనం చేశాడు. అప్పటి నుంచి నిస్త్రాణగా పడుకొనే వున్నాడు మండువాలో. లేచి మంచినీళ్ళు తాగడానికి కూడా సత్తువ లేదు. కానీ కడుపులో అగ్నిహోత్రుడు వూరుకుంటాడా? బలవంతంగా లేచి వంటింట్లోకి వెళ్ళాడు. కాసిన్ని మంచినీళ్ళు తాగడంతో కొద్దిగా ఓపికవచ్చినట్టు అనిపించింది. “అమ్మా, గంగాభవానీ, నా ప్రాణాలు నిలబెడుతున్నావా తల్లీ” అనుకున్నాడు. ఇల్లంతా కలయ జూశాడు. లంకంత యిల్లు. ఒకప్పుడు పిల్లా పాపలతో, వచ్చేపోయే బంధువులతో కళకళలాడుతూ వుండేది. తన దగ

యత్నం

కథా భారతి
- శ్రీమతి మోచర్ల రామలక్ష్మి సద్గురువులు, సాధకులు, యోగులు, త్యాగులు, పండితులు, కవులు ఎందఱో మహానుభావులు. చతుర్వేదాల సారాన్ని ఉపనిషత్తులు, పురాణాలు, కావ్యాలు, సుభాషితాలు, నీతి శతకాలు, సూక్తులు, చాటువులు, సామెతలతో నిబిడీకృతం చేసి మానవాళి అభ్యున్నతికి అందించారు. దేవభాష అయిన సంస్కృత భాషలోని సూక్తులను, సుభాషితాలను, నేటితరం పిల్లలతో, గౌరవనీయులయిన పెద్దలతో, హితులతో, సన్నిహితులతో ముచ్చటించు కావాలనేది నా అభిలాష. సరస్వతీదేవి కృపతో కథావాటికలో సూక్తులు, సుభాషితాలు పొందుపరిచి, చిన్న కథలుగా రూపొందించి పుస్తక పాణి పద పల్లవములకు సమర్పిస్తున్నాను. సంస్కృత అధ్యాపకులు మా గురువర్యులు శ్రీమాన్ మోహనరావుగారి పాదాలకు నమస్కరిస్తూ కథ ఆరంభిస్తున్నాను. సుందరం చక్కనివాడు. చురుకు, తెలివి కలవాడు, బాగా చదువుకుని ఉత్తమశ్రేణిలో పట్టభద్రుడయ్యాడు. తను ఎంతో మేధావినని, ఉద్యోగం తనని వెదుక్కుంటూ వస్తుందని అతనిని కించిత్ గర్వం ఆ

శామీల నభోగము

కథా భారతి
-ఆర్. శర్మ దంతుర్తి మే నెలాఖర్న రోహిణీ కార్తి ఎండలు దంచుతుంటే, తన ఆశ్రమంలో ఏ.సి. గదిలో చుట్టూ శిష్యగణం కూర్చునుండగా మీరోజు న్యూస్ పేపర్ చదువుతున్న యోగీశ్వరుడు ఒకసారి అయిదో పేజీ తిరగేసి ఓ చిన్న న్యూస్ ఐటం చదివాక యధాలాపంగా చిరునవ్వుతో ఆ పేపర్ పక్కన పారేసి ధ్యాన ముద్ర వహించాడు. కిందన నేలమీద కూర్చున్న శిష్యులు వెంట వెంటనే తమలో తాము మాట్లాడుకోవడం ఆపి సర్దుకుని కూర్చున్నారు గురూగారితో పాటు ధ్యానానికి. కంగారుగా గురువుగారి అంతర్గత శిష్యులు ఆయన పక్కన పారేసిన పేపరూ, అవీ తీసి బయటపారేసి చుట్టూ శుభ్రం చేసారు ధ్యానం చేసుకునే గదిలో. పావుగంట మౌనంగా గడిచేక ఇంకా అందరూ ధ్యానంలో ఉండగానే గురువుగారి గంభీరమైన కంఠం వినిపించింది, “వచ్చేనెల నాలుగో తారీఖునుంచి ఆరో తారీఖులోపు మన హైద్రాబాద్, చుట్టుపక్కల ఊళ్ళలో శామీల నభోగం రాబోతోంది. అది నా అంతర్గత శిష్యులకే కాక మొత్తం అందరిమీదా విస్తరించబోతోంది. అదృష్ఠవంతులైన వాళ్ళు

కొడుకు స్థిరపడితే!

కథా భారతి
“హలో!” “హలో! నేను బ్యాంకు మేనేజర్ ను మాట్లాడుతున్నాను, సుధీర్ గారా! మాట్లాడేది?” “నమస్తే సార్! నేను సుధీర్ నే మాట్లాడుతున్నా!” “మీరోసారి బ్రాంచ్ కు రాగలరా?” “అలాగే సార్! మరో అరగంటలో వస్తాను.” ఫోన్ పెట్టేసాడు మేనేజర్. ఈ మధ్యనే బ్రాంచ్ కు కొత్త మేనేజర్ వచ్చారు. నాకు కొత్త మేనేజర్ తో పరిచయం లేదు. కానీ వారు నన్ను ఎందుకు రమ్మన్నారో అర్థం కాక ఆలోచనలో పడిపోయా. మా నాన్న గారు రంగస్వామి గారు, మా ఊరి మాజీ సర్పంచ్. రెండు సంవత్సరాల క్రిందట ప్రమాదంలో చనిపోయారు. నాకు చదువు అబ్బక పోవడంతో ఆరేళ్ళ క్రితం నాలుగు లక్షల పెట్టుబడితో ఎలక్ట్రికల్ షాప్ పెట్టించారు. దేవుడి దయవల్ల, మా నాన్నగారి ఆశీస్సుల వల్ల అంతా బాగానే నడుస్తోంది. వ్యాపారం బాగా నడవడంతో బ్యాంకు వాళ్ళు కూడా పిలచి మరీ లోను ఇచ్చారు. రీపేమెంట్ కూడా బాగానే కడుతున్నాను. కానీ ఇప్పుడు బ్యాంకు మేనేజర్ ఎందుకు పిలిచారో మాత్రం ఎంత ఆలోచించినా అర్థం కాలేదు.