కథా భారతి

పుస్తకం వనితా విత్తం

కథా భారతి
- ఆర్. శర్మ దంతుర్తి పట్టువదలని గ్రాడ్యుయేట్ స్టూడెంట్ విక్రం ఆదిత్య ఎప్పటి లాగానే పాతబట్టలున్న లాండ్రీ బాస్కెట్ తనకున్న పాత కార్లో వేసుకుని మౌనంగా తమ ఊరిలో ఉన్న ఒకే ఒక లాండ్రోమాట్ వైపు జాగ్రత్తగా, స్పీడ్ లిమిట్ లోపునే నడపసాగాడు. ఆఖరికి రేడియో కూడా పెట్టకుండా విక్రం మౌనంగా బండి నడపడం చూసి బాస్కెట్ బట్టల్లో ఉన్న మురికి భేతాళుడు ఇలా అన్నాడు. "విక్రం నువ్వెందుకైతే ఆదివారం అయినా సరే మోరల్ గా, స్పీడ్ లిమిట్ దాటకుండా డ్రైవ్ చేస్తున్నావో నాకు తెలియదు కానీ చాలా మంది ఎన్నారైలు అమెరికాలో ఇటువంటి చిన్న చిన్న మోరల్స్ గురించి అంతగా పట్టించుకోరు. నువ్వు నడిపే ఈ స్పీడ్ లో లాండ్రోమాట్ కి వెళ్ళడానికి చాలాసేపు పడుతుంది కనక నీకు శ్రమ తెలియకుండా ఉండడానికి రాజారావు కథ చెపుతాను, విను." రాజారావు అమెరికా వచ్చేనాటికి ఇక్కడ అమెరికాలో అంతమంది దేశీయులుగానీ, తెలుగువాళ్ళుకానీ ఉండేవారు కాదు. ఎం. ఎస్ లో జేరడానికి వచ్చి

ఎవరు మారాలి?

కథా భారతి
-ఆర్. శర్మ దంతుర్తి నలభై ఐదేళ్ళ సుబ్బారావు ఇంట్లో పెళ్ళాంతో గొడవపడి పార్కులోకి వచ్చాడు ప్రశాంతంగా కూర్చోవడానికి. దూరంగా ఎవరికీ కనబడకుండా కూర్చోవడంలో ఉన్న ఆనందం వేరు. తెలుసున్నవాళ్ళెవరైనా కనబడితే తాను ఒక్కడూ పార్కుకి వచ్చాడంటే ఇంట్లో గొడవ జరిగి ఉంటుందని కనిపెట్టగలిగే ప్రబుధ్ధులు బోల్డుమంది ఉండడం ఒకటైతే, అలా కనిపెట్టకపోయినా ఏవో కబుర్లలో పెట్టి చంపుతారు. కదలకుండా చీకటిపడే దాకా మహా సీరియస్సుగా ఆలోచించేడు సుబ్బారావు ఏం చేయాలో. మర్నాడు పొద్దున్నే ఊరికి వంద మైళ్ళ దూరంగా ఉన్న అడవుల్లో ఈ మధ్యనే తెరిచిన మోడర్న్ యోగా సెంటర్ లో తేలాడు – ఆఫీసుకు శెలవు పెట్టి మరీను. ఈ యోగా సెంటర్లో జేరితే ఆరునెలల్లో దేవుడు కనబడ్డం గేరంటీ. మొదటి అయిదు నెలలూ సెంటర్లో ఉండక్కర్లేదు కానీ ఆరోనెలలో దేవుడు కనబడ్డానికి ముప్పై రోజుల రెసిడెన్షియల్ ప్రోగ్రాముకి తప్పనిసరిగా ఒక్కరే రావాలి, పెళ్ళాం పిల్లలూ, అందర్నీ వెంటబెట్టుకుని వ

మనసులో ఏముందో?

కథా భారతి
ఆర్. శర్మ దంతుర్తి కాలేజీ నుంచి ఇంటికొచ్చిన అనామిక మొహం కడుక్కుని లాప్ టాప్ మీద ఏదో పని చేసుకుంటూంటే అమ్మ కాదంబరి పలకరించింది, “అన్నీ సరిగ్గా ఉన్నట్టేనా?” “ఆ ఏదోలే, ఇప్పుడు మాట్లాడకు. చాలా చిరాగ్గా ఉంది.” మరో గంట గడిచాక మొగుడు దేవానంద్ బాత్రూంలో దూరినప్పుడు అనామిక తీరిగ్గా ఉండడం చూసి అడిగింది కాదంబరి, “ఇప్పుడు చెప్పు ఏమిటి కధ?” అనామిక చిన్నగా ఏడవడం వినిపిస్తే కాదంబరి కంగారుగా అడిగింది, “ఏమైందే? నాతో చెప్పు.” వేరే గదిలోకి రమ్మని అమ్మకి చేత్తో సైగ చేసి అక్కడికెళ్ళాక బాగా ఏడవడం మొదలుపెట్టింది అనామిక. ఏడిచేవాళ్ళని కాసేపు ఆ బాధ అంతా దిగిపోయేదాకా ఏడవనివ్వడం మంచిది కనక కాదంబరి ఊరుకుంది. కాసేపటికి తేరుకున్న అనామిక చెప్పింది, “ఈ రోజు ఆఫీసులో ఆ ప్రోజక్ట్ మేనేజర్ దక్షిణాదివాడు వెంకట్ అనే ఆయన పిలిచాడు నన్ను తన రూములోకి. ఎందుకో అని వెళ్ళాను. ట్రైనింగ్ క్లాసులో కొన్ని మంచి ప్రశ్నలు ఇచ్చాను అందరికీ

పదవీ విరమణ

కథా భారతి
రచన: సోమ సుధేష్ణ నీరజ నవ్వుతూ వెనక్కి తిరిగి “బాగుంది మీ వరస. పిల్లలు లేని ఇంట్లో ముసిలాడు పాకినట్టుంది. మరీ కొంగుకు వేళ్ళాడుతున్నారేమిటి! ” “కొంగు లేదుగా అందుకే నీ షర్ట్ చివర పట్టుకుని వేళ్ళాడుతున్నాను.” నవ్వుతూ ఆ పక్కనే ఉన్న  కుర్చీని బట్టలు ఐరన్ చేస్తున్న నీరజ పక్కకు లాక్కుని కూర్చున్నాడు వివేక్. ‘పదవీ విరమణ తర్వాత మాఆయన మరీ కొంగుకే వెళ్ళాడుతున్నాడు, చిరాగ్గా ఉంది.’ అలవాటైన  లేడీస్ లంచులకు, షాపింగులకు ఫ్రీగా వెళ్ళలేక పోతున్నానని స్నేహితురాలు శోభ గొణగడం గుర్తుకు వచ్చి ‘అలా వెంట తిరుగుతూ ఉంటె నాకిష్టమే’ నవ్వుకుంది నీరజ. ఎలాగు ఉద్యోగ పర్వం అయిపొయింది ఇక వాన ప్రస్త పర్వం మొదలు పెడితే మంచిది అని చెప్పిన  రావుగారి మాట కాదన లేక వివేక్ ఒక రోజు సత్ సంఘుకు వెళ్ళాడు. “మొక్కుబడిగా రెండు శ్లోకాలు చదివామనిపించి, ఆవురావురు మంటూ భోజనం మీద దాడి ఆ తర్వాత ఒహటే  ముచ్చట్లు. ఊళ్ళోని వ

ముష్టివాడు

కథా భారతి
-ఆర్. శర్మ దంతుర్తి అమెరికా నుంచి వచ్చిన స్నేహితుడు రమ్మంటే రామ్మూర్తి ఊరి బయట శివాలయానికి బయల్దేరాడు. ఇదే ఊళ్ళో ఉంటూ ఎన్నాళ్ళనుంచో చూస్తున్న శివాలయంలో రామ్మూర్తికి పెద్దగా చూడ్డానికేమీ లేదు; వెళ్ళడం ఇష్టం లేదు కూడా. గుడి ఆవరణలో ఉండే బిచ్చగాళ్ళూ, కుష్టివాళ్ళనీ చూడ్డం అంటే రామ్మూర్తికి చిరాకు. పైన గుడిలో లోపలకి వెళ్ళాక పూజారి చేత్తో చాచిన కంచంలో ఏదో దక్షిణ వేయాలి. లేకపోతే ఈ పంతులు గారు ఊళ్ళో అందరితోనూ ఫలానా రైస్ మిల్లు రామ్మూర్తిగారు దేవుడికి కూడా దక్షిణ ఇవ్వలేదు అని అందరితో చెప్తాడు. సుబ్రహ్మణ్యం, ఉరఫ్ - సుబ్బుడు తనతో చిన్నప్పుడు కలిసి చదువుకున్నాడు. అసలే అమెరికా అంత దూరం నుంచి వచ్చి పిలిచినవాడు రమ్మంటే వెళ్ళకపోతే బాగోదు కనక బయల్దేరాడు – జేబులో కాసిని చిల్లర డబ్బులు పెట్టుకుని. సుబ్బుడు, రామ్మూర్తీ కలుసుకుని చాలా ఏళ్ళయింది కనక కబుర్లు చెప్పుకుంటూ దారిలో వచ్చేపోయే వాహనాలని దాటుకుంటూ ఆవు

ఆత్మఘోష

కథా భారతి
అన్ని ఛానెల్స్ లోనూ బ్రేకింగ్ న్యూస్ వస్తోంది. విశాల్ ఇండస్ట్రీస్ అధినేత చైర్మన్ భరద్వాజ్ తన ఆఫీస్ బిల్డింగ్ మీదనుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇండస్ట్రీ ప్రపంచంలో భరద్వాజ్ అనే పేరు ఒక సంచలనం. భరద్వాజ్ తండ్రిపేరు విశాల్. తండ్రిపేరుమీదే గ్రూప్ అఫ్ ఇండస్ట్రీస్ వున్నాయి. మొట్టమొదట టెక్సటైల్స్ తో ప్రారంభమైన వ్యాపారం, మూడు పువ్వులు ఆరు కాయలు గా ఎదుగుతూ సిమెంట్, హార్డ్వేర్, టాయ్స్,హోటల్స్ ఇలా విస్తరించి పెద్దదయింది. షుమారు పది సంవత్సరాలలోనే ఇండియాలోనే ఒక ప్రముఖ పారిశ్రామిక సంస్థగా విశాల్ ఇండస్ట్రీస్ ఎదిగింది. తండ్రి తరువాత, భరద్వాజ్ చైర్మన్ పదవి చేపట్టాడు. భరద్వాజ్ చైర్మన్ అయిన తరువాత విశాల్ ఇండస్ట్రీస్ మరింతగా అభివృద్ధి చెందింది. ఉద్యోగస్తుల సంఖ్య యాభై వేలకు పెరిగింది. స్టాక్ మార్కెట్ లో షేర్ విలువ పదింతలు పెరిగింది. అన్నే సవ్యంగానే సాగుతున్నాయి. కానీ ఒకరోజు భరద్వాజ్ హఠాత్తుగా తన ఆఫీస్ బిల్డ

తేడా

కథా భారతి
-ఆర్. శర్మ దంతుర్తి దేశంలో ఎన్నికలు జరుగుతున్నపుడు రెండు ఈశాన్య రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలు పైకి రావడం మొదలైంది. మొత్తం దేశం అంతా ఒకే పార్టీ ఉంటే బాగుంటుందనీ, ఇలా చిన్న ప్రాంతీయ పార్టీలకి వోట్లు వేస్తే దేశం గల్లంతౌతుందనీ అథిష్టానం నుంచి పెద్దలు వ్రాక్కుచ్చారు. అయినే ఎవరూ విన్నట్టు లేదు. ఈ రెండూ రాష్ట్రాల్లోనూ మొత్తానికి ప్రాంతీయపార్టీలే నెగ్గాయి. ఈ పార్టీలు కూడా ఈ మధ్యనే కాలేజీలోంచి పాసయ్యీ, అవకా అవసరాన్ని బట్టి సమ్మెలు చేస్తూ బయటకొచ్చిన కుర్రగాళ్ళవి. అందువల్ల ఏ అభ్యర్ధికీ కూడా ముఫ్ఫై దాటలేదు వయసు. పక్క పక్క రాష్ట్రాలు కనక ఒకే భాష మాటాడకపోయినా, దాదాపు వీళ్ళ భాష వాళ్ళకీ, వాళ్లది వీళ్ళకీ అర్థం అవుతుంది, తిండీ తిప్పలూ ఇద్దరివీ ఒకటే రకానివి. అధిష్టానం వేరే పార్టీ అయినా ఈ రెండు ఈశాన్య రాష్ట్రాలూ వేరేపార్టీతో అధికారంలోకి వచ్చేయి. ఈశాన్యం ఒకటికి బందోపాధ్యాయ్ ముఖ్యమంత్రి అయితే ఈశాన్యం రెండుకి

పదవీ విరమణ

కథా భారతి
రచన: సోమ సుధేష్ణ నీరజ నవ్వుతూ వెనక్కి తిరిగి “బాగుంది మీ వరస. పిల్లలు లేని ఇంట్లో ముసిలాడు పాకినట్టుంది. మరీ కొంగుకు వేళ్ళాడుతున్నారేమిటి! ” “కొంగు లేదుగా అందుకే నీ షర్ట్ చివర పట్టుకుని వేళ్ళాడుతున్నాను.” నవ్వుతూ ఆ పక్కనే ఉన్న కుర్చీని బట్టలు ఐరన్ చేస్తున్న నీరజ పక్కకు లాక్కుని కూర్చున్నాడు వివేక్. ‘పదవీ విరమణ తర్వాత మాఆయన మరీ కొంగుకే వెళ్ళాడుతున్నాడు, చిరాగ్గా ఉంది.’ అలవాటైన లేడీస్ లంచులకు, షాపింగులకు ఫ్రీగా వెళ్ళలేక పోతున్నానని స్నేహితురాలు శోభ గొణగడం గుర్తుకు వచ్చి ‘అలా వెంట తిరుగుతూ ఉంటె నాకిష్టమే’ నవ్వుకుంది నీరజ. ఎలాగు ఉద్యోగ పర్వం అయిపొయింది ఇక వాన ప్రస్త పర్వం మొదలు పెడితే మంచిది అని చెప్పిన రావుగారి మాట కాదన లేక వివేక్ ఒక రోజు సత్ సంఘుకు వెళ్ళాడు. “మొక్కుబడిగా రెండు శ్లోకాలు చదివామనిపించి, ఆవురావురు మంటూ భోజనం మీద దాడి ఆ తర్వాత ఒహటే ముచ్చట్లు. ఊళ్ళోని వాళ్ళని, దేశంలోని వాళ్ళన