కథా భారతి

​ జొన్న గింజ

కథా భారతి
  ఆర్ శర్మ దంతుర్తి రాజు సభలో కూర్చొనుండగా సేవకుడొచ్చి చెప్పేడు, "ఓ పరదేశి మీకు ఏదో వింత వస్తువు చూపించడానికి వచ్చాడు. లోపలకి తీసుకురమ్మని శెలవా?"   రాజు మంత్రికేసి చూసి, ఆయన సరేనన్నాక చెప్పాడు, "సరే, రమ్మను చూద్దాం."   లోపలకి వచ్చిన పరదేశి, అక్కడే ఉన్న బల్లమీద తన చేతిలోది ఏదో వస్తువు ఉంచాడు. చూడబోతే కోడి గుడ్డు లా ఉంది. గుడ్డు కాదన్నట్టు పైన ఒక చార లాంటిదేదో ఉన్నట్టుంది కూడా. రాజు, మంత్రీ తర్జన భర్జనలు పడి మొత్తానికి అది కోడి గుడ్డు కానీ మరో పక్షి గుడ్డు కానీ కాదని నిర్ధారించుకున్నాక అడిగేరు పరదేశిని, "ఏమిటి విషయం?"   "ఇదేదో మీకు నచ్చుతుందేమో, కొనుక్కుంటారేమో అని అడగడానికి వచ్చాను."   "ఇదేమిటో తెలియకుండా ఎలా కొనడం?"   "ఇదేమిటో నాకూ తెలియదు, దారిలో దొరికితే తెచ్చాను. మీకు నచ్చితే ఏదో ఒక ధర ఇప్పించండి" తాను దారిలో చిన్నపిల్లలు అడ

నీ పద్యావళు లాలకించు చెవులున్ ని న్నాడు వాక్యంబులన్

కథా భారతి
- ఆర్. శర్మ దంతుర్తి కైలాసం లోపలకి వచ్చే నారదుణ్ణి నందీ, విఘ్నేశ్వరుడు సాదరంగా ఆహ్వానించారు. ఆది దంపతులకి నమస్కారం చేసి అడిగాడు నారదుడు, "ఈశ్వరా, పులస్త్య బ్రహ్మ కుమారుడైన వైశ్రవణుడు తెలుసు కదా? ఆయన కుమారుడైన కుబేరుడనేవాడు మీ కోసం ఘోరమైన తపస్సు ప్రారంభించాడు. అతన్ని కరుణించేదెప్పుడో తెలుసుకుందామని ఇలా వచ్చాను." భవుడు చిరునవ్వు నవ్వేడు జగదంబ కేసి చూసి. అమ్మవారు చెప్పింది, "నారదా ఈ తపస్సు ఫలించి కుబేరుడికి కోరికలు తీరినా ఆయన అడిగినది ఎంతో కాలం నిలవదు." నారదుడు ఆశ్చర్యంగా చూసాడు అదేమిటన్నట్టు. పార్వతి వివరణ ఇస్తున్నట్టూ చెప్పింది, "నువ్వే చూద్దువు గాని కదా? కోరికలీడేరడం వల్ల సుఖం వస్తుందనేది ఎంత నిజమో." అంతకన్న చెప్పడానికేమీ లేదన్నట్టు అమ్మవారు ఆగేసరికి భవుడు సమాధిలోకి జారుకున్నాడు. జగజ్జనని కూడా కళ్ళు మూసుకోబోయేంతలో ద్వారం వరకూ వచ్చే నందీశ్వరుడితో త్రిలోకసంచారి నారదుడు “నారాయణ,

నాకు నచ్చిన కథ – ఒక్కనాటి అతిథి

కథా భారతి
కథారచన - ఆచంట శారదాదేవి శీర్షిక నిర్వహణ: తమిరిశ జానకి ఈ కథ నాకెందుకు నచ్చిందంటే శ్రీమతి ఆచంట శారదాదేవి ఆ తరం రచయిత్రులలో మంచి వాసిగల రచయిత్రి. ఆవిడ రాసిన కథ ల ఆణిముత్యాలు. భావుకతని, వర్ణనల్ని జోడించి ఎంత బాగా రాస్తారో కథలావిడ, వాటిలో కొన్ని హారమై 'ఒక్కనాటి అతిథి' కథల సంపుటి రూపంలో మెరిశాయి 1965లో సున్నితమైన మనసుని సుందరంగా లలిత లలితంగా చిత్రీకరించి కనుల ముందు నిలబెట్టిన కథ శారదగారి 'ఒక్కనాటి అతిథి' మనిషి శరీరంలో అతుకుపెట్టలేని భాగం మనసొక్కటే అని నా అభిప్రాయం ఎంత డబ్బు పోసినా కొనుక్కోలేనిది మనసు. ఆ మనసు లోతుల్లోకి తుంగిచూస్తే కథలంటే నాకు చాలా చాలా ఇష్టం. అందుకే 'ఒక్కనాటి అతిథి' కథ ఎంతో ఇష్టం నాకు. ఈ కథలోని కేతకి అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ అప్పుడే విరిసిన పువ్వల్లే అతి నాజూకుగానూ, భావనాలోకంలో విహరిస్తూనే భాధ్యత తెల్సిన భారపు రూపం గానూ కనిపిస్తూ ఉంటుంది నాకు. ప్రతి మనిషి మనసుకీ ఈ రెం

అనగనగా ఓ కథ – ఓ మహిళా దారి ఇదిగో…

కథా భారతి
- కొడవంటి కాశీపతిరావు మేస్టారి కోపం చూడ్డానికి పౌర్ణమినాటి వెన్నెల్లా తెల్లగా చల్లగా ఉన్నా అనుభవానికి వచ్చేసరికి నట్టనడి వేసవిలో మిట్టమధ్యాహ్నపు ఎండలా తీవ్రంగా ఉంటుంది. పైగా "అమ్మాయ్ హోంవర్కు చెయ్యలేదేం? ఓ గంట సేపు ఎండలో నిలబడు... ఊఁ "అంటే ఆ ఎండే వెన్నెల్లా వుంటుంది. అదే... "హోంవర్కు చెయ్యలేదూ... ఊఁ... సరే" అని పెదాలుబిగించి రెప్పెయ్యకుండా ఓసారి చూసి తలపంకించేరంటే అది మరి భరించలేను నేను. నేనే కాదు బహుశా ఎవరూను. అంతకుముందు క్లాసులో ఇంగ్లీషు ఏమేస్టారెలా చెప్పేవారో కూడా తెలియనంత మరపుకొచ్చిందిగాని, ఈ మేస్టారు మాత్రం పాఠంలోకి తిన్నగా వెళ్ళిపోయే వారు కాదు. ఒక్కో స్ట్రక్చరూ తీసుకుని తీగమీద డ్రిల్లు చేయించినట్టు చేయించి, ఒక్కో కంటెంటు వర్డూ తీసుకుని ఒక్కో పిప్పరమెంటు బిళ్ళ నోట్లోవేసి చప్పరించినట్టు చేయించేవారు. ఆపైన ఒక్కసారో, రెండుసార్లో మరి పాఠం చదివించి అరటిపండు వలిచి చెతిలో పెట్