కవితా స్రవంతి

దేవతగా మారిన మనిషి “అమ్మ”

కవితా స్రవంతి
  - భమిడిపాటి స్వరాజ్య నాగరాజా రావు అమ్మకుకూడా కొరుకుడుపడని కోపం ఉంటుంది, అది అప్పుడప్పుడూ తన విశ్వరూపాన్ని చూపుతూనే ఉంటుంది, కానీ,తరుచూ శాంతం దాన్ని అధిగమిస్తూ ఉంటుంది. అమ్మకుకూడా లోలోపల దహించే ద్వేషం ఉంటుంది, అది అప్పుడప్పుడూ పడగవిప్పి నాట్యమాడుతూనే ఉంటుంది, కానీ, తరుచూ ప్రేమ దానిని అధిగమిస్తూ ఉంటుంది. అమ్మకు కూడా దుర్గుణాలు కొన్ని ఉంటాయి, అవి అప్పుడప్పుడూ తమ ఉనికిని చాటుతూనే ఉంటాయి, కానీ,తరుచూ సుగుణాలు వాటిని అధిగమిస్తూ ఉంటాయి. అమ్మకి కూడా పక్షపాత బుద్ధి ఉంటుంది, అది అప్పుడప్పుడూ తన పవర్ ఫుల్ పాత్రను పోషిస్తూనే ఉంటుంది, కానీ,తరుచూ సమత్వబుద్ధి దానిని అధిగమిస్తూ ఉంటుంది. ఆవేశం,కావేశం అమ్మకు కూడా తప్పనిసరిగా కలుగుతుంటాయి, అవి అమ్మను వశపరుచుకోవాలని ఉవ్విళ్ళుఊరుతూనే ఉంటాయి, కానీ, తరుచూ ఆవేశాన్ని ఆత్మీయత, కావేశాన్ని ఆర్ద్రత అధిగమిస్తూ ఉంటాయి. అవివేకం,అసహనం అమ్మను కూడా త

గొలుసు కవిత

కవితా స్రవంతి
అయ్యయ్యో ! శివ శివా! - (సూత్రంః శివ నిందాస్తుతి. మొదటి రెండు వాక్యాలు నిందాస్తుతి, మూడవ వాక్యం స్తుతితో శివతత్వాన్ని ఆవిష్కరించే ప్రయత్నం. మహాశివరాత్రి తరుణంలో మనబడి భాషాప్రేమికులు అల్లిన మారేడు దళ మాలిక.  ఆలోచనః వేణు ఓరుగంటి )   ఎద్దునెక్కుతావు, పులితోలు తొడుగుతావు భూతదయ నీకెక్కడయ్యా భూతేశా? శివ శివా! పంచభూతాలూ నువ్వేకదా ఓ పరమేశా! (వేణు ఓరుగంటి)   బూడిద రాస్తావు, పుర్రెల హారం చుడతావు! నీదేమి అందమయా గౌరీశా? హరహరా! నీలో సగమైనది జగన్మోహనం ఓ అర్ధనారీశా! (భాస్కర్ రాయవరం)   త్రిశూలం పట్టుకుంటావు, శ్మశానంలో ఉంటావు, నువ్వంటే భయంతో చావాలి కానీ, హరోం హర! చచ్చినాకా నీదగ్గరకే చేరాలని  తపస్సు!  మృత్యుంజయా! (వేణు ఓరుగంటి)   బొమ్మతల కొట్టేవు, బొమ్మకు తలపెట్టేవు ఇదేమి తిక్కనో తెలీదు కానీ, తిక్కశంకరయ్యా! చక్కటి కథలురాసిచ్చే బొ

గతం నుంచి…

కవితా స్రవంతి
  - ఎస్.ఎస్.వి.రమణరావు గతం నుంచి మంచే తీసుకుందాం ధైర్యంకళ్ళతోటి భయం చూద్దాం నిజం తెలిసి తెలివి కూర్చుకుందాం 'నేడు'లోనే మనం జీవిద్దాం 'నేడు'లోనే మనం జీవిద్దాం నిన్న అంటే ఆలోచన నేడు అంటే చే సే పని రేపు అంటే తెలిసిందా నేడులోనే ఉందీ అది నేడులోనే ఉందీ అది // గతం// అమెరికన్ని రష్యన్ని ఇండియన్ని చైనీస్ ని ఒకే షోలో నిలబెడదాం ప్రశ్నలన్నీ అడిగేద్దాం ప్రశ్నలన్నీ అడిగేద్దాం క్రిస్టియన్నీ ముస్లిమ్ నీ హిందువునీ బుద్ధిస్ట్ నీ ఒకే షోలో నిలబెడదాం ప్రశ్నలన్నీ అడిగేద్దాం ప్రశ్నలన్నీ అడిగేద్దాం ప్రశ్నలన్నీ అడిగేద్దాం జవాబులన్నీ దులిపేద్దాం మెదడులన్నీ సరిచేద్దాం మనస్సులన్నీ మార్చేద్దాం మనస్సులన్నీ మార్చేద్దాం //గతం// ఉన్నదొకటే ఆలోచన లేనిదొకటే వివేచన ధైర్యమంటే కాదు యుద్ధం స్నేహమంటే ఎందుకూ భయం? స్నేహమంటే ఎందుకూ భయం? // ప్రశ్న//

తల్లివేరు

కవితా స్రవంతి
- డా. తంగిరాల. మీరా సుబ్రహ్మణ్యం పడమటి తీరాన్ని చేరిన పక్షులు తొడుక్కున్న ముఖాలే తమవనుకున్నాయి . పాప్ లు,రాక్ లు,పిజ్జాలు,కోక్ లు పక్కింటి రుచులు మరిగాయి . సాయంకాలం మాల్ లో పొట్టి నిక్కర్ల పోరీలు అందాల కనువిందులు . సిస్కో లో పని చేసినా, సరుకులే అమ్మినా డాలరు డాలరే! కడుపులో లేనిది కావలించు కుంటే రాదని , నలుపు నలుపే గానీ తెలుపు కాదని , పనిమంతుడి వైనా ,పొరుగునే వున్నా ,పరాయి వాడివే నని , తత్వం బోధపడే సరికి చత్వారం వస్తుంది. అప్పుడు మొదలవుతుంది అసలైన వెతుకులాట . నేనెవరినని మూలాల కోసం తనక లాట . జండా పండుగలు,జాగరణలు ,పల్లకీ సేవలు,పాద పూజలు , భామా కలాపాలు,బతుకమ్మ పాటలు అస్థిత్వ ఆరాటాలు . రెండు పడవల రెండో తరానికి ఆవకాయ అన్నప్రాసనం ఉదయం క్వాయిర్ క్లాసు,సాయంత్రం సామజ వరగమన మన బడి గుణింతాలు, రొబొటిక్స్ ప్రాజెక్ట్ లు అటు స్వేఛ్ఛా ప్రపంచపు పిలుపులు, ఇటు తల్లి వేరు తలపులు

నా జీవితం ఎక్కడికెళ్ళింది?

కవితా స్రవంతి
- సుమ (సుమన నూతలపాటి) జడి వానల వాగుల్లోన పడవలతో చిరుగాలిలో గాలిపటాల సరిగమతొ జీవితాంతం సరిపడాల్సిన చదులతో చిరునవ్వులతో ఆపెయలేని నవ్వులతో... నా బాల్యం యెక్కడికెళ్ళింది? నన్నొదిలి యెన్నాళ్ళైయ్యింది? ఆశలతో బారులు తీరిన ఆకాశం పరువాలతో పరిగెత్తించేే పరవశం ఏ కొండని ఢీ కొట్టాలనీ ఆవేశం? నవ జీవన నాడులు పాడే ఆ నాదం నా యవ్వనమెక్కడికెళ్ళింది? నన్నొదిలి యెన్నాళ్ళైయ్యింది? నవ వధువై అడుగు పెట్టిన జీవితం నా తోడై నిలిచిన వ్యక్తి సాంగత్యం నను గన్న వాళ్ళు చూపిన ఆదర్శం నే గన్న వాళ్ళు నేర్పిన ఆరాటం నా కాపురం యెక్కడికెళ్ళింది? నన్నొదిలి యెన్నాళ్ళైయ్యింది? నా బిడ్డల రెక్కల బలంలో నా గర్వం నే నేర్పిన పాఠాలన్నిటి ప్రతిబింబం చిట్టి పాపల కేరింతలతో కైవల్యం మానవత్వపు విలువలు పెంచే పోరాటం నడి వయసు యెక్కడికెళ్ళింది? నన్నొదిలి యెన్నాళ్ళైయ్యింది? నా అడుగులు తడబడి పోడం సాధ్యమా? మేధస్సు మరుపున పడటం

శ్రీ

కవితా స్రవంతి
శ్రీ - అరుంధతి పండుగ శుభదినమూ నేడేఆమని ఆగనం నేడే ||పండుగ|| కమ్మని కోయిలా పాడవే తీయగావసంత హేలలకూ నీదే తొలిపిలుపుగానీరాగ మధురిమా ఏ దేవివరవమో ఆ మావి చివురిదీ ఏ జన్మల తపమో ||ఆ మావి|| ఆహా నీ గానము నేర్పుమాఊహకు అందని నీ మాధుర్యం చూపుమానీవెరుగని రాగమా నువు పలుకని భావమాస్వరమాధురి లాహిరిలో అలుపెరుగని యోగమా ||స్వర|| ||పండుగ||

అరుదెంచింది ఉగాది

కవితా స్రవంతి
- డా. తంగిరాల మీరాసుబ్రహ్మణ్యం నిన్నటి దాకా నిస్సంగ యోగినిలా నిలబడిన ప్లమ్ చెట్టు ఉన్నట్టుండి తెల్లని పూవుల అంగీ తొడుక్కుంది. మోడువారిన కొమ్మల మేపుల్ మొక్క మోసులు వేసి పచ్చని ఆకుల పమిట వేసింది. పురాతన పాంధుడు అనూరుడి రథం లో అవిశ్రాంతం గా తిరుగుతూ పుడమి కాంతను చురుకు చూపులతో పలుకరిస్తున్నాడు. వెచ్చని శరీరాలను కప్పుకుని చలి కాచుకున్న జాకెట్లు కచ్చగా చూస్తున్నాయి క్లోజెట్ లో చేరి. వసంతం వస్తోందని కబురందిన రాదారి తరువులు ఒళ్ళంతా రంగులు అలదుకుని స్వాగతించడానికి సిద్ధపడ్డాయి . మారుతున్న ఋతువులే మనిషికి ప్రకృతి చెప్పే పాఠములు కదా! ఆరు రుచులను ఆస్వాదించ మంటూ ఆరుదెంచింది ఉగాది

గొలుసు కవిత – రైలు ప్రయాణం

కవితా స్రవంతి
- (మనబడి స్వచ్చంద సేవకుల బృందం - భాస్కర్ రాయవరం, మల్లిక్ దివాకర్ల, కిశోర్ నారె, శైలజ కొట్ర, సుజన పాలూరి) రైలు ప్రయాణం అంటేనే అదో వింత సరదా మనసులోన పొంగిపొరలే జ్ఞాపకాల వరద! రిజర్వేషన్ ఆఫీసులో మొదలుకదా ఆ సరదా అది ఉంటే ప్రయాణమే హాయి కదా సోదరా! సెలవంటూ సరదాగా సాగనంపు బంధువులు వెళ్ళవద్దు ఉండమంటు కన్నీళ్లతో బంధాలు ఉండలేని వెళ్ళలేని మనసు ఊగులాటలు ఇంత రైలు ప్రయాణాన అంతులేని అనుభూతులు అన్నీ మరచి చుట్టూ చూస్తే ఎన్ని తమాషాలు! కిటికీ పక్కన సీటుకోసం పిల్లల కుస్తీపట్లు, ఎంత వింత అంత స్పీడు వెనక్కెెళ్ళే చెట్లు ఊయలూపు పయనంలో ఇట్టే కునికిపాట్లు! నేల తుడుస్తూ డబ్బులు అడిగే పిల్లల జాలి చూపులు గుండెను పిండే గొంతుకతోటి కబోది పాడే గీతాలు అందరుచేరి లాగించేసే చాయ్, సమోసాలు ఎదురు సీట్లో సీతను చూసి బాబాయ్ వేసే ఈలలు అది గమనించిన వాళ్ళ నాన్న కొరకొర చూసే చూపులు! అప్పటిదాకా తెలియన

తెలుగే వెలుగు

కవితా స్రవంతి
- సింహాద్రి (జ్యోతిర్మయి) ప్రపంచ మాతృభాషా దినోత్సవ శుభాకాంక్షలు! (మనబడి బంధువు వ్రాసిన అద్భుత సాహిత్య ప్రక్రియ. అక్షరమాలతో తెలుగు వెలుగును చిందే తేటగీతులు) 1.తే. గీ. అ మ్మ జోలపాటకు సమమైన తెలుగు ఆ వు పాల కమ్మదనము లమరు తెలుగు ఇ టలి భాషతో సమమని ఎనయు తెలుగు ఈ డులేని మాధుర్యపు ఇంపు తెలుగు. 2.తే. గీ. ఉ గ్గు పాలతో అబ్బెడి ఊసు‌ తెలుగు ఊ హకు తొలిపలుకు నేర్పు ఒజ్జ తెలుగు ఋ ణము దీర్పలేము జనని ఇడిన తెలుగు ఋా తొ‌ మొదలగు పదముల నిడని తెలుగు. 3.తే. గీ. ఎ న్న భాషల లోకెల్ల మిన్న తెలుగు ఏ టి గలగల వినిపించు తేట తెలుగు ఐ క మత్యాన ప్రాంతీయ ఆస్తి తెలుగు ఒ. రుల భాషకు అచ్చుల ఊత తెలుగు 4.తే.గీ. ఓ పు చుండె నిర్లక్ష్యము చూప తెలుగు ఔ ర సహనాన భూదేవి, అమ్మ తెలుగు అం త మవనీకు భవితపై ఆశ తెలుగు అః వలదు నాకనకు మన ఆత్మ తెలుగు. 5.తే. గీ. క. వన సామ్రాజ్య విభవమ్ము గన్న తెలుగు