కవితా స్రవంతి

జీవన సాఫల్యం

కవితా స్రవంతి
- కోడం పవన్ కుమార్ శాపం కాదు వ్యాధి అంతకన్నా కాదు అది రెండో బాల్యం క్షణం గడుస్తుంటే వయస్సు పెరుగుతుంటుంది వయస్సు పెరిగేకొద్దీ ముసలితనంతో పాటు పెద్దరికం వస్తుంది భూమ్మీద ఉండటం శాశ్వతం కాదు పుట్టడమే దేహ నిష్క్రమణ కోసం బాల్య కౌమార యౌవ్వనదశలెంత సహజమో వార్ధక్యం అంతే సహజం వయస్సు పెరిగేకొద్దీ సామర్థ్యం తగ్గుతుంది ఆరోగ్యం క్షీణిస్తుంది అంతమాత్రాన కుంగిపోవటం వివేకం కాదు మనఃసామర్థ్యం పదిలపరచుకోవాలి శరీరాన్ని విల్లులా వంచడానికి యోగాసనాలను స్వాగతించాలి మనస్సు మలినపడకుండా ధ్యానం దరిజేర్చుకోవాలి శరీరథర్మంగా దేహం బలహీనపడినా జ్నానార్జన వెలుగుతూనే ఉంటుంది మనస్సు ఆరోగ్యంగా ఉంటే దేహారోగ్యం నిగనిగలాడుతుంటుంది వ్రుద్ధాప్యం మరణానికి దగ్గరి మెట్టు కాదు జీవిత గమనంలో ఓ దశ మాత్రమే గడిచే ప్రతిక్షణాన్ని అమ్రుతంలా పొందాలి జీవితాన్ని పండించుకుని జీవన సాఫల్యం పొందాలి ***

పనికత్తి

కవితా స్రవంతి
- తమిరిశ జానకి గ్యాస్ మీద వంటేనా ఇరవైనాలుగ్గంటలూ నీళ్ళొస్తాయా విమ్ సోపేనా తోమేందుకు బట్టలుతికే మిషనుందా ఆరేసేందుకు నువ్వు నాకు సాయంచేస్తావా ఒకపూటే ఇల్లూడుస్తా వారానికోసారే పోఛా చేస్తా రోజూ చాయ్ నాస్తా ఇస్తావా పండగ పండగకీ కొత్తచీరిస్తావా రెండునెల్లకోసారి పాతచీరిస్తావా ఆదివారాలు సెలవిస్తావా అదికాక నెలకి నాలుగైదురోజులు మానేస్తే నాగాలు కట్టకుండా ఉంటావా పెద్ద టీ.వీ.ఉందా పనికీ పనికీ మధ్య నాకిష్టమైన సీరియలే పెడతావా ఏరోజు ఏసీరియల్లో ఎక్కువ ఏడుపు నాకొచ్చినా ఆరోజు పని పూర్తిగా చెయ్యలేను నువ్వే చేసుకోవాలి మరో చాయ్ ఎగస్ట్రా ఇవ్వాలి ఓ.కే.నా ఆన్నింటికీ ఊ అంటే చెప్పు ఇప్పుడే పన్లోకి ఉరుకుతా కత్తిలా దూసుకుపోతా నీ పని చూసుకుంటా ! ****

కవితా మొగ్గలు

కవితా స్రవంతి
- డాక్టర్ భీంపల్లి శ్రీకాంత్ కవిత్వం మనసును పులకింపచేస్తేనే కదా అక్షరలతలు నలుదిశలా పరిమళించేది కవిత్వం సాహితీ కుసుమాల సౌరభం కవిత్వం తరంగమై ప్రవహిస్తేనే కదా కొత్తదారులను లోకానికి పరిచయం చేసేది కవిత్వం నవరాగాల నవరససమ్మేళనం కవిత్వం సాగరమై పోటెత్తితేనే కదా గుండెలోని బాధల దుఃఖాన్ని ఒంపుకునేది కవిత్వం కనిపించని రహస్యనేత్రం కవిత్వం నదీప్రవాహమై పారితేనే కదా కవితావింజామరలు వికసించి నాట్యమాడేది కవిత్వం నవపల్లవుల మృదంగనాదం కవిత్వం అక్షరసౌరభాలను వెదజల్లితేనే కదా తెలుగు సాహిత్యం కలకాలం నిలిచిపోయేది కవిత్వం వెలుగుపంచే సహస్ర రవికిరణం

కార్మిక కష్టం

కవితా స్రవంతి
- అభిరామ్ ఆదోని తెల్లవారగానే చద్దికట్టుకుని చకచకా నడిచి శ్రమించే స్థలం చేరుకుని చొక్కా తీసి బనీయన్ వేసి బ్రతుకుకు ఆయుష్షుపోస్తూ మెతుకులిచ్చే పనిముట్లకు మొక్కి పార గంపలు పట్టి పుప్పొడిని తలదన్నే ఇసుకను కొలిసి రాసిగా పోసి సిమెంట్ బస్తాలను భుజానమోసి మిశ్రమాన్ని కలిపి గోడమీద గోడను నిలిపి నీటితో తడిపి మేడ నిర్మించి రంగులతోటీ హంగులద్ది ఇన్నాళ్లు స్వేచ్చగా తిరిగిన భవనంపై వైరాగ్యమొచ్చినట్లు పసిపాపలా నవ్వుతూ మరో ప్రాంతానికి కదిలిపోయే కార్మిక వందనాలు నీ శ్రమకు పాదాభివందనాలు

అమ్మకి వందనం

కవితా స్రవంతి
- అన్నసముద్రం శ్రీదేవి దక్షిణ కోరని గురువుకి శాపం తెలియని దేవతకు ఆగ్రహమెరుగని నిగ్రహమూర్తి కి మాతృవందనం లోకం బిడ్డ కు చూపటానికి యుద్ధం చేసిన యోధురాలి కి ఎల్లలు ఎరుగని తల్లి ప్రేమ కి తొలి వందనం మమతను పంచి నడతను నేర్పి తడబడుతుంటే తప్పు ను దిద్దిన తొలి బడి ఐన తల్లి ఒడికిదే అభివందనం వేనవేల వందనాలు కోట్ల ల్లో కృతజ్ఞతలు చంద్రృనికో నూలుపోగు అమ్మా అను పిలుపొకటే అమ్మకి నచ్చిన పలుకు అమ్మ మెచ్చేలా పలుకు

చదువు మొగ్గలు

కవితా స్రవంతి
- - డాక్టర్ భీంపల్లి శ్రీకాంత్ పదిమందికి విద్యాగంధాన్ని పంచితేనే కదా నిరక్షరాస్యత నిర్మూలన సతతం జరిగేది చదువు ఎప్పటికీ వాడని వసంతపరిమళం జ్ఞానకుసుమాలను సదా ఆస్వాదిస్తేనే కదా మనలోని అజ్ఞానాంధకారం తొలిగిపోయేది చదువు మానవవికాసానికి విజయసోపానం మేధోమధనం నిత్యం మదిలో రగిలితేనే కదా ఆనంతమైన విజ్ఞాన అంచులను చుంబించేది చదువు పరిశోధనపూలు పూచే గంధంచెట్టు విద్యార్థులు విద్యావంతులై వికసిస్తేనే కదా అక్షరపూలు మహిలో విద్యాగంధాన్ని వెదజల్లేది చదువు భావితరానికి మార్గం చూపే చుక్కాని ఆనందాలను నిరంతరం అనుభూతిస్తేనే కదా ఉపదేశపు సంస్కారబీజాలు నాటుకుపోయేది చదువు భవిష్యత్తుకు బాటవేసే రహదారి

ఋతు గీతం

కవితా స్రవంతి
-వెన్నెల సత్యం రాత్రి నిద్ర పట్టని మహానగరం రోడ్లన్నీ ఆవలింతలతో జోగుతున్నాయి! బయటికి అడుగు పెడ్తున్న మనుషులంతా టోపీల్తో మంకీ లై పోతున్నారు!! కిటికీ పక్షులు రెక్కలు విదిల్చడానికి ప్రయత్నిస్తూ వణుకుతున్నాయి! చెట్ల ఆకులు లోలోపల భయపడుతూ మంచు ముత్యాలు రాలుస్తున్నాయి!! బకెట్లో నీళ్ళు కరచాలనం చేయబోతే కస్సుమంటూ కరుస్తున్నాయి! చలితో పోరాడలేక దేహంలో రక్త కణాలు గడ్డకడ్టుకు పోతున్నాయి!! ఏ తోడూ లేని ఒంటరి జీవులు పంజా విసిరే చలిపులి మీద తిట్లదండకం వల్లిస్తున్నారు! తోడు దొరికిన అదృష్టవంతులు రాగాల దుప్పట్లో చేరి యుగళ గీతాలు పాడుతున్నారు!! పాల బుగ్గల పాపాయిలు ఋతువుల దోబూచులాటని పసి పాదం తో తన్నేసి వెచ్చని అమ్మ ఒడిలో ఆదమరిచి నిద్రిస్తున్నారు!!! ****

ప్రేమలేఖ

కవితా స్రవంతి
- అరాశ నేనిట సేమమే యచట నీవును సేమముగా దలంచెదన్ మానితివేల జాబులను మానసవీధిన మీ విహారమే గాన రుచించదోగిరము కంటికి నిద్దుర రాదు నన్ను నీ దానిగ జేసికొమ్ము సరదా కయి నన్ విడబోకురా ప్రభో గండు తుమ్మెద నీట కమలమున్ గనుగొని ఝుంఝుమ్మనుచు పాడె చూడరమ్ము జంట పక్షులు కొమ్మనంటి కూర్చొని ప్రేమ కబురులు వినిపించె కదలి రమ్ము తరువును లతయిట పెరిమతో పెనవేసి విరులను వెదజల్లె నరయ రమ్ము అలలతో కదలాడి యవనిని ముద్దాడు కడలిని కనులార గనగరమ్ము పురుషునిన్ జూచి ప్రకృతియే పులకరించె ప్రకృతి గాంచిన పురుషుడే పరవశించె కనులు గనియెడి దృశ్యమే మనసు జేరి కలత రేపిన వైనమే గనుము నేడు కోరను కోటి రూకలను కోరనవెన్నడు మేడ మిద్దెలన్ గోరను పట్టు వస్త్రముల గోరను హేమ విభూషణావళుల్ కోరను విందు భోజనము కోరను నిత్య విహారమెప్పుడున్ కోరెద నొక్కటే యమిత కూరిమి కోరిక దీర్చరమ్మురా తలుపు చప్పుడు వినినంత తరలి జూతు పిలుపు విన నీవెనంచని పల

జీవితం

కవితా స్రవంతి
- అభిరామ్ ఆదోని జీవితమంటేనే కలల సాగర కడలి ఆ కడలి కదలిక పై రెండు మనసులు ఏకమై కష్ట సుఖాల్లో మమేకమై ఒకే మాటల తెడ్డు పట్టి ఒకరికొకరు వెన్నుతట్టి ఆశల అలలకు ఆగకుండా కోరికల కెరటాలకు చిక్కకుండా సంసార పడవను ముందుకు నెట్టినపుడే ఆ వంశ వృక్షంలో మొలకెత్తే అంకురం వెండి గిన్నెలో బంగారమై భద్రంగా ఎదుగుతుంది జీవన పరమార్ధము తెలుస్తుంది