కవితా స్రవంతి

గజల్

కవితా స్రవంతి
- డాక్టర్ భీంపల్లి శ్రీకాంత్కా లమెప్పుడూ సాఫీగా సాగుతుందని అనుకోకు జీవితమెపుడూ సంబరంగా ఉంటుందని అనుకోకు అలలెప్పుడూ ఎగిసిపడుతూ కల్లోలపరుస్తుంటాయి కడలి ఎప్పుడూ ప్రశాంతంగా ఉంటుందని అనుకోకు తుఫానులు అల్పపీడనాలు ముప్పిరిగొని వస్తుంటాయి ప్రకృతి ఎప్పుడూ వసంతంలా ఉంటుందని అనుకోకు గర్జనలతో ఉరుములు మెరుపులు గాండ్రిస్తుంటాయి ఆకాశం ఎప్పుడూ నిర్మలంగా ఉంటుందని అనుకోకు జ్వాలాతోరణాలతో నిప్పురవ్వలు ఎగిసిపడుతుంటాయి పర్వతం ఎప్పుడూ ప్రశాంతంగా ఉంటుందని అనుకోకు వాసంతసమీరాలెపుడూ మధుపవనాలను వీస్తుంటాయి గ్రీష్మఋతువు ఎప్పుడూ ఒకేలా ఉంటుందని అనుకోకు కలలు రోజూ వస్తూ మనసును కలవరపెడుతుంటాయి వాస్తవరుచి ఎప్పుడూ మిగిలే ఉంటుందని అనుకోకు

దానయ్య

కవితా స్రవంతి
-రచన:శ్రీధరరెడ్డి బిల్లా దారిన పోయే దానయ్యా ఒంటిగా సాగే దానయ్యా , బిత్తర చూపుల దానయ్యా , తత్తర పాటుల దానయ్యా ! చుట్టాల్లేరా దానయ్యా ? పక్కాల్లేరా దానయ్యా ? మిత్రుల్లేరా దానయ్యా ? పెళ్ళామేదీ దానయ్యా ? పిల్లలేరీ దానయ్యా ? కన్నోరెవరు దానయ్యా ? ఎవరూ లేరా దానయ్యా ? దేవుడే దిక్కా దానయ్యా ? ఆస్తులెన్ని దానయ్యా ? అంతస్తులెన్ని దానయ్యా? అప్పులెన్ని దానయ్యా ? ఏమీ లేవా దానయ్యా ? “దేహం వీడా, రామయ్యా! ఆత్మను నేను, రామయ్యా! పరమాత్మ కోసం, రామయ్యా! పయనం కట్టా, రామయ్యా!”

పివి మొగ్గలు

కవితా స్రవంతి
- డాక్టర్ భీంపల్లి శ్రీకాంత్ నిరంతర సంస్కరణ నిచ్చెనమెట్లతో తాను ఎదుగుతూ అందరికీ అభివృద్ధిఫలాలను అందించిన అభ్యుదయవాది సంస్కరణలకు చిరునామాగా నిలిచిన పథగామి పివి విద్యాశాఖను మానవవనరుల అభివృద్ధి శాఖగా మార్చి విద్యావ్యవస్థ రూపురేఖలు మార్చిన అభ్యుదయవాది విద్యాశాఖను బలోపేతం చేసిన సంస్కరణలశీలి పివి కలసిరాని కాలంలో సమస్యలతో నిత్యపోరాటం చేసి దేశ విజయపతాకను ఎగురవేసిన అపరచాణక్యుడు ప్రజాస్వామ్య చరితకు అసలైన చిరునామా పివి పటిష్ట భూసంస్కరణ చట్టాలతో భూపంపకాలను చేపట్టి స్వయంగా తనభూములను ధారాదత్తం చేసిన విప్లవవాది భూ సమస్యలను పరిష్కరించిన అపరమేధావి పివి అత్యున్నతమైన దేశ ప్రధానమంత్రి పదవిని అధిష్టించిన మొట్టమొదటి దక్షిణ భారతీయ రాజకీయ దురంధరుడు తెలంగాణ ముద్దుబిడ్డగా చరిత్ర సృష్టించిన ఘనుడు పివి

ఒంటరైన వందేళ్ళ జీవితం

కవితా స్రవంతి
-శైలజామిత్ర ఈ ఏకాంత యుద్ధంలో ఆయువు ఉన్నవాడిదే పైచేయి భయానికి ఏ ముద్దుపేరు పెట్టుకున్నా జరుగుతున్న సంగ్రామం మాత్రం ఒంటరితనానికి పరాకాష్ట స్వార్థం కమ్ముకున్న గుండెల్లోనే అందరినీ కలుపుకోవాలనే ఆకాంక్ష నాది. నేను పదోచ్ఛరణలోనే మనదనే పదాన్ని చేర్చాలనే దీక్ష అత్యాధునిక అరణ్యవాసపు ఫలితం శూన్యం! ఇపుడు శరీరమెవరిదో పోల్చుకోవడం అంత సులభతరం కాదని నిమ్మకున్నా దు:ఖపు గుంటలో పడి రోదించడం జాలి చూపలేని సంతోషం తాలూకు తక్కెడ చప్పుడని సరిపెట్టుకున్నా ఇది గెలిచి ఆనందించలేని ఆరోగ్యస్వామ్యమే.. అంతరాంతరాల్లోకి ఎంత తొంగి చూసుకున్నా పేగుబంధపు ఆవేదనను ఉవ్వెత్తున ఎగసిపడేది మానవత్వపు ముసుగు ఉన్నవాడి ఆంతర్యాన్ని అంతమొందించానే.. బూడిదవున్న గుట్ట శవాలు బాంధవ్యాలను వెక్కిరించేది అంతస్తుల అంతరాలు మిగిల్చినవారి వాస్తవాల్ని ఒక వారగా నిలబెట్టాలనే.. అనేకుల్ని మింగేసిన ఆనవాళ్ళు ఒక్కొక్కటి కనుమ

తాగ నేల?

కవితా స్రవంతి
-తాటిపర్తి బాలకృష్ణా రెడ్డి తాగనేల తలతిరగనేల ఆపై తూగనేల తేనీగలందించు తియ్యని తేనుండగ తేయాకు తెచ్చిన కమ్మని తేనీరుండగా మురిగిన విప్పపూలను మరిగించగొచ్చిన ఈ కంపుని తాగనేల తాగి తూగనేల నురగ కక్కు బీరు కంపు కమ్మగుండు ఐసు ముక్కలపై అమృతం ఊరగాయలలో పరమామృతం కేకు ముక్కలతో మేకప్పు ఫేసు బుక్కులో లైకులు కిక్కు పై... కప్పు పై కెక్కుదాకా పెగ్గు పై పెగ్గు కొట్టి తాగనేల తాగి తూగనేల తనివితీరా పాత మిత్రులను తలచుకొని తూలనాడుటకా పాత ప్రేయసి పేర విరహ గీతాలు ఆలపించుటకా నిజాల నిగ్గు తేలుస్తూ సత్య హరిచంద్ర పద్యాలు పాడుటకా క్రొత్త క్రొత్త భాషలందు కించిత్ సెన్సార్ లేకుండా అనర్గళంగా వుపన్యసించుటకా పురవీధులందు పొర్లు దండంబులెట్టుటకా పరువు మట్టిపాలు చేసి మట్టినంటించుకొని నట్టింట నిలబడి అక్షింతల అనంతరం మజ్జిగ తాగనేల తాగి తూగనేల*

ఇదేం పాడుబుద్ధి నీకు?

కవితా స్రవంతి
-పారనంది శాంత కుమారి. పెద్దలను గౌరవిస్తున్న వాళ్ళను చూసి అదేమంత గొప్ప పనికాదు అంటావు. తల్లితండ్రులను ఆదరిస్తున్నవారిని చూసి అదంతా ప్రకటన కోసం అంటావు. కుటుంబంతో కలిసున్నవారిని చూసి వేరేఉండే ధైర్యంలేకే అలా ఉన్నారంటావు. తల్లితండ్రుల మాటను వింటున్నవారిని చూసి బుద్ధిలేని దద్దమ్మలంటావు. సాంప్రదాయాలను అనుసరిస్తున్నవారిని చూసి ఛాందసులు అంటావు. సమాజసేవ చేస్తున్నవారిని చూసి జీవితాన్ని ఎంజాయ్ చేయటం తెలియదంటావు. ఓర్చుకుంటున్న వారిని చూసి చేతకాని,చేవలేని వారంటావు. భక్తి చేస్తున్నవారిని చూసి బడాయి చూపుతున్నారంటావు. నీకు తెలిసినదే రైట్ అంటావు అవతలివారిదే తప్పంటావు. నోరు పెట్టుకొని సాధిస్తావు అర్ధరహితంగా వాదిస్తావు. నీ నీడను కూడా నమ్మనంటావు ఇలా అని నిన్ను నువ్వే మోసం చేసుకుంటావు. ఇదేం పాడుబుద్ధి నీకు?

ఆలోచించి చూడు

కవితా స్రవంతి
-భమిడిపాటి స్వరాజ్య నాగరాజా రావు. ఆలోచించి చూడు! అనృతపు అవశేషాలు తరిగి, అమృతపు అనుభవాలు కలుగుతాయి. అవలోకించి చూడు! అపార్ధాల పొరలు కరిగి, అనుబంధాల దారులు అగుపడతాయి. ఆక్షేపించి చూడు అకృత్యాల మరులు తొలగి అనునిత్యాల నిజాలు ఆవృతమౌతాయి. ఆమోదించి చూడు ఆవేదనలొదిలి ఆనందాలు ఆవరిస్తాయి. విబేధించి చూడు వికారాల వలలు తెగి వివేకాలు ఉద్భవిస్తాయి. ఆచరించి చూడు అసత్యాల తెరలు తొలగి సత్యాల సొగసులు అగుపడతాయి.

ముసలోడు

కవితా స్రవంతి
- శ్రీధరరెడ్డి బిల్లా పెచ్చులూడి పోయిన ఆ పెంకుటింటి ముందు నవ్వారు మంచంపై నడుము వాల్చిన ముసలోడు! తనను ఒంటరి వాణ్ణి జేసి పోయిన తన ఇంటిదాన్ని మింటి చుక్కల్లో వెతుకుతూ కంటిరెప్ప వేయనేలేదు! గుడ్డిదీపమున్న ఇంట్లో గూళ్ళు కడుతున్న సాలీళ్లు. మూతలేని గిన్నెపై ముసురుకుంటున్న ఈగలు . అన్నం మెతుకులకు అటూఇటూ తిరుగుతున్న బొద్దింకలు ! వచ్చీరాని వంట! ఏం వండుకున్నాడో ?ఏం తిన్నాడో? “తిన్నావా..?” అన్న చిన్నపిలుపు కూడా రాదని తెలిసిన చెవులు మొరాయించి ఎప్పుడో చెవిటివాణ్ని చేశాయి! ఏ జ్ఞాపకం హఠాత్తుగా ఏ కలవరాన్ని మోసుకొచ్చిందో? పక్కనున్న మంచాన్ని ఒక్కసారి తడిమిచూశాడు . ముసల్ది మరణించిందని ఓక్షణం పాటు మరిచాడేమో ఖాళీ మంచం వేళాకోళమాడుతూ వెక్కిరించింది!, కళ్ళకు పొరలు వచ్చి కంటిచూపు మందగించిందేమో పగిలిన అద్దాల కళ్ళజోడు కోసం చేతులు తచ్చాడుతున్నాయి! కుఱ్ఱవాళ్ళు నలుగురు , కళ్ళకు ఏ పొరలు కమ్మెనో కానీ, ఫోన్

కాలం

కవితా స్రవంతి
-తమిరిశ జానకి నూతన సంవత్సర శుభాకాంక్షల వెల్లువతో వేకువ పరిమళభరితం సుతిమెత్తని పూలవానలా స్నేహితాల పలకరింపులు చరవాణిలో క్రమం తప్పని కాలగతి కళకళలాడే పచ్చని ప్రకృతిలా పరవశాన పాడేపాటలా వచ్చి నిలిచింది నా ముందు మరొకవత్సరానికి తెర తీస్తూ ! వెనుకకి తల తిప్పితే ఏదో తెలియని వింత గుబులు గతాన గేలి చేసిన ఒడిదుడుకులు తలదించుకోక తప్పని తప్పులతడకలు అన్నీతరుముకొస్తున్న భ్రాంతి ! ఎదరకి చూపు సారిస్తే ఎరుకలేని ప్రశ్నావళి అంతుచిక్కని చిక్కుముడులై చుట్టూ బిగిసిపోతున్నసమస్యలవలయాలు సవాలుగా తీసుకోక తప్పదు సవాలక్ష ప్రశ్నలైనా సమస్యని విడగొడితే కద సానుకూల పరిస్థితి నెలకొనేది ! ఆగదుగా కాలం ఎవరికోసమూ అంతూదరీ అంతుపట్టక సాగిపోతూనే ఉంటుంది తెలుసుకోలేకపోయాను కాలం విలువ ! కష్టాలకి కుంగి కాలాన్నితిట్టడం సుఖాలకి కళ్ళు నెత్తికెక్కి కాలాన్ని మరవడం అదేకదా అలవాటు చేసిన తప్పులు సరిదిద్దుకోడానికే చాలట్లేదు జీవితం ఇ