కవితా స్రవంతి

ఆ అడుగు

కవితా స్రవంతి
- డా . మీసాల అప్పలయ్య ఆ అడుగు నీ జాడనే చెరిపేసింది నీ రేఖా చిత్రాన్నిచించేసి నీ నీడపై ఉమ్మేసి నీ తలంపును కూడా పిసర్లగా కోసి గొనె సంచికెత్తి మౌన వాసనలను విసర్జించే గబ్బిలాల నూయిని గోరి చేసింది అది నీ బ్రతుకు డెడ్ ఎండ్ కు టికెట్ రాసి ఇచ్చింది కన్నెత్తి కూడా చూడని కాలధర్మాన్ని నీ ముంగిటిలోకి విసిరి నిన్ను రెచ్చ్చగొట్టిన ఉచ్చు అయింది నీవు నిలబడ్డానికి చోటునిచ్చిన జీవనాడి కూడా నీ చెయిదం తోనే కుత్తుక తెగి కార్చిచ్చు అంతః కేంద్రంలో నిర్జీవ రేణువయింది ముకుళిత హస్తాలుగా ఆదమరచి నీచుట్టూ నిలబడ్డ నీ బలగం నీ చేతల సైనైడ్ తో కుప్పకూలిన గోడయింది నీవు నిలబిడ్డ నేల నీ మరణపు రొంపయింది నీ సమాధి పై రాయి అయింది చీకటిగోడల మధ్య వెక్కివెక్కి ఏడ్చిన నిందయి పిడిగుద్దులు ఓర్చుకొన్న పచ్చిపుండయింది పెను తుఫాన్లకు ఒరిగి విరిగిన కొంపయి చిరిగిన ఎముకల గూడయి అరచేతులమధ్య బరువుగా ఒద

*ఎండ పద్యం*

కవితా స్రవంతి
~ తగుళ్ళ గోపాల్ ఈ ఎండలకు వాగుల గొంతెండి మనిషి ముందు నోరు జాపినయి. మేఘాల రెక్కలు తెగి గాలిలో ఈకల్లా తిరుగుతున్నయి. భూతల్లి కాళ్ళు కాలి అరికాళ్ళు పగుళ్ళొచ్చినయి. కొండతల రెండు ముక్కలై రక్తమంతా గాలిలో ఆవిరైతుంది. పిట్టలు పిట్టల్లాగే రాలిపోతున్నయి పచ్చికట్టెల నడుములన్ని పటపట ఇరిగిపడుతున్నవి. చావే మేలని పాములన్ని తాగడానికి ఇంత విషాన్ని అడుగుతున్నవి ఎండ తగ్గె మార్గం చెప్పమని కుక్క ఒక్కటే ఒగిరిస్తుంది. నిలబడటానికి నీడలేని మేకలు, గొర్లు మిట్ట మధ్యాహ్నం కాలుతున్న రాళ్ళైనయి. ఆదివాసి తల్లి తోలుసంచి పట్టుకొని నగరం నడిమధ్యన స్థూపమైంది. చెట్లమెడ కోసిన మనిషి మాత్రం ఏమీ తెల్వనట్టు కిలకిల నవ్వుకుంట ఏసీలో కూర్చోని ‘డిస్కవరీ ఛానల్ చూస్తుండు’

*ఏక్ తార!*

కవితా స్రవంతి
~వెన్నెల సత్యం గాయపడిన రాత్రి వేకువను లేపనంగా రాసుకుంటోంది. అమరవీరుల ఆత్మలు స్థూపంలోనే వణికిపోతున్నాయి రణరంగంలా మారిన ట్యాంక్ బండ్ మీద తథాగతుడికి మరోసారి జ్ఞానోదయమయ్యింది. ఉద్యమకారుల రక్తంతో తడిసిన ఇనుపకంచెలు కార్మికుల రుధిరాన్ని నాలుకతో జుర్రుకుంటున్నాయి. దేహాలపై నాట్యమాడటానికి అలవాటు పడ్డ లాఠీలు నిరసన కారుల ఎముకల్ని పెఠీల్మని విరిచేస్తున్నాయి. హక్కుల పిడికిళ్ళు ఆత్మహత్యలు చేసుకుంటుంటే ప్రశ్నలెపుడో ఈ నేల మీదనించి పరారయ్యాయి. మాటల తూటాలు పేల్చిన గొంతుల్లో తుపాకి తూటాలు దిగుతున్నాయి. రుధిరంతో ఎరుపెక్కిన తంగేడు పూలన్నీ తలలు దించుకున్నాయి ఉద్యమ కవిత్వమై ఉసిగొల్పిన కలాలు ఉడుకు రక్తాన్ని ధారపోయించిన గళాలు గంపకింది కోడిపెట్టలై పాలకుల పంచలో గుడ్లు పెడుతున్నాయి. ఉద్యమాల పురిటిగడ్డ ఊపిరి తీసుకోడానిక

ఇలా చేసి చూడు

కవితా స్రవంతి
- పారనంది శాంతకుమారి వాదాన్ని వదిలేసి చూడు వేదం నీ వెంటే ఉంటుంది. కామాన్ని విడిచిపెట్టి చూడు రామం నీ జంటే ఉంటుంది. లోభాన్ని వదిలిపెట్టి చూడు లాభం నీఇంటే ఉంటుంది. క్రోధం వదిలిపెట్టి చూడు. నాదం నీలోనే నెలకొంటుంది. మదాన్ని విడిచిపెట్టి చూడు మోదం నీ మదిలోనే కొలువుంటుంది మాత్సర్యాని వదిలిపెట్టి చూడు తాత్సారం చేయకుండా మమకారం నీదవుతుంది. మోహాన్ని మొట్టు మొట్టి చూడు మాయా దాహం నిన్నోదిలి పోతుంది. రోషాన్ని వదిలి పెట్టి చూడు రోగం నీ దరికి చేరకుంటుంది. కక్షనొదిలిపెట్టి చూడు రక్ష నీన్నొదిలి పోనంటుంది. అబద్ధాల నోదిలిపెట్టి చూడు విశుద్ధం నీ వెంటే ఉంటుంది.

పాపం మనిషి!

కవితా స్రవంతి
- భమిడిపాటి స్వరాజ్య నాగరాజా రావు నింగిని కొలుస్తాడు నేలని తొలుస్తాడు మనసునిమలచలేడు. గ్రహాన్ని చేరుతాడు నక్షత్రాన్ని కోరుతాడు అనుగ్రహాన్నిపొందలేడు. తెలివితో బొంకుతాడు, తేటగా ఉండలేడు. ఆశకు లొంగుతాడు, ఆశయానికి కట్టుబడలేడు. మహిని జయిస్తాడు, మనసును జయించలేడు. గ్రహంలో ఏముందో తెలుసుకుంటాడు, గృహంలో ఏముందో తెలియలేడు. నక్షత్రాన్ని తెలియాలనుకుంటాడు, స్వక్షేత్రాన్ని తెలుసుకోలేడు. చందమామ అందాన్ని పొగుడుతాడు, సొంత భామ అనుబంధాని పొందలేడు. ప్రకృతి ని జయించాలని అనుకుంటాడు, తన ప్రవృత్తిని జయించాలనుకోడు. పై పైకి వెళ్ళాలనుకుంటాడు, లోలోకి పోవాలనుకోడు.

తెలుగు భాష చేదా?

కవితా స్రవంతి
- ఎస్.ఎస్.వి. రమణరావు రండి రండి రండి రండి కదలి రండి రండి తరలి రండి ఇది తెలుగు మహా'దండి' భాషమీద దాడి కన్నతల్లి మీద దాడి భాష మీద కుట్ర మన ఆస్తి దోచే కుట్ర తెలుగు భాష అంత చేదా? పుట్టిన మట్టి అంత రోతా? // రండి// ఇది "హింసనచణ ధ్వంసరచన ధ్వంసనచణ హింసరచన" అర్థం కాలేదా? చొక్కాల రంగులు వేరైనా చెడ్డీల రంగులొకటే తెలుగుభాష పై దాడిలో పార్టీలన్ని ఒకటే గోముఖ వ్యాఘ్రాలన్నీ ముసుగులన్నీ తీసేశాయ్ కోరలన్నీ బార సాచి వికటంగా నవ్వుతున్నాయి ఫేను తిప్పే గాలిలో విషవాయువులే వీస్తున్నాయి పంక్చరైన సైకిల్ టైరులోంచి అపాన వాయువులే వస్తున్నాయి // రండి// భూదోపిడి సరిపోలే చెరువు కబ్జా సరిపోలే కూలగొట్టింది సరిపోలే విడగొట్టింది సరిపోలే పంచభూత దోపిడి పూర్తి సంస్కృతి దోపిడి షురూ // రండి// (ఈ కవితగానం కింద ఆడియోలో వినండి)

*మనిషి జాడ*

కవితా స్రవంతి
~ సాగర్ల సత్తయ్య కసాయిల పడగ నీడన కాలం వెళ్లదీయడమంటే అనుక్షణం బతుకుతూ చావడమే మృత్యువు ఏ రూపాన మనల్ని కాటేస్తుందో ఉహలకందని విషయమిపుడు మనిషిని పశుత్వం నిలువెల్లా ఆవహించినప్పుడు చంపటం చావడం ఓ క్రీడ తండ్రిని కొడుకు చంపడం అన్నను తమ్ముడు చంపడం తల్లిని బిడ్డ చంపడం భర్తను భార్య చంపడం భార్యను భర్త చంపడం తన మాట వినలేదని అధికారినే తగలబెట్టడం వినీ వినీ మనసు మొద్దుబారుతోంది కరెన్సీ కల్చర్ స్వార్ధంతో సహవాసం చేస్తూ మనిషితనాన్ని సమాధి చేస్తుంది మానవ విలువలను వెతకడమంటే ఎండమావిలో నీటిని వెతకడమివాళ ఆర్థిక సంబంధాలే మనల్ని శాసిస్తున్నపుడు మానవ సంబంధాలెక్కడివి మన పిచ్చి గాని మృగ్యమవుతున్న మనిషి జాడను వెదకిపట్టగలిగే పాతాళ గరిగె కోసం అన్వేషిస్తున్నా...

*పరవశం*

కవితా స్రవంతి
~ శాంతి కృష్ణ సమీపాన నువ్వుంటే ఎందుకింత పరవశం గాలులన్నీ గంధాలై కమ్మినంత పరవశం విరిసెనులే పెదవులపై గులాబీల నవ్వులే ఎదలోపల ఏమున్నదో తెలియనంత పరవశం అక్షరాలు రెక్కలొచ్చి మబ్బులపై ఎగిరెనులె, కవితలన్ని వర్షమల్లె కురిసినంత పరవశం నన్ను నేను చూసుకునే అద్దంలో నువ్వేలె అందులోనె నాకెంతో చెప్పనంత పరవశం వరమల్లే వలచినావు మనసంతా ‘శాంతి’గా బతుకంతా నీలోనే ఒదిగినంత పరవశం!!

అమ్మ

కవితా స్రవంతి
- రూపారాణి బుస్సా పేగు తెంచి నొప్పి భరియించి ప్రాణంబు శ్వాస నిచ్చి పలుకు నేర్పి లెస్స మనిషి జేసి గుణము మలచము జేసిన అన్నెమేది మిన్న అమ్మ కన్న జనుమనిచ్చి భువిని చవిజూపితివి తల్లి సంస్కృతినొసగితివి సకలమిచ్చి హితము పెంచి మనము అడవరించితివిగాద అన్నెమేది మిన్న అమ్మ కన్న నాదు అనరు నీదు నాభీలముగ మోసి తీడి దిద్ది నాదు దిటము పెంచి నాదు సుఖము నందు నందము పొందుతు అన్నెమేది మిన్న అమ్మ కన్న

నీ సన్నిధి

కవితా స్రవంతి
-వెన్నెల సత్యం అనుక్షణమూ చకోరమై తపిస్తాను నీకోసం!! నా విరహమె గజళ్ళుగా రచిస్తాను నీకోసం!! నీ సన్నిధి లేనప్పుడు ఈస్వర్గం నాకెందుకు నవ్వుతూనె నరకాన్ని వరిస్తాను నీకోసం!! నీతో నేను గడిపినదీ ఓ గుప్పెడు క్షణాలే జ్ఞాపకాల సంద్రాన్నే మధిస్తాను నీకోసం!! ఊపిరివై నావెంటే నిలిచావా ఓ చెలియా ఏడేడూ లోకాలను జయిస్తాను నీకోసం!! ఎదగుడిలో దేవతవై నీవున్నది ఓ 'సత్యం' నా ప్రాణం తృణప్రాయం త్యజిస్తాను నీకోసం!!