సారస్వతం

రామాయణంలో ముఖ్య ఘట్టాలు

సారస్వతం
- డా. పద్మజా వేదాంతం శ్రీమద్రామాయణం ఆదికావ్యం అంటే ప్రపంచంలోనే మొట్టమొదటి గ్రంథం. దీనిని వాల్మీకి మహర్షి సంస్కృతంలో రచించాడు. ఇది శ్రీరాముని జీవిత చరిత్ర లేదా ప్రయాణాన్ని వివరిస్తుంది. ఇందులో ఆరు కాండలు ఉన్నాయి. (1) బాలకాండ (2) అయోధ్యకాండ (3) అరణ్యకాండ (4) కిష్కింధకాండ (5) సుందరకాండ (6) యుద్ధకాండం, (ఏడవది అయిన ఉత్తరకాండ తరువాత చేర్చబడింది.) 1) బాలకాండ- అయోధ్యానగర మహారాజు దశరధుడు. ఆయనకి ముగ్గురు భార్యలు. చాలా కాలం సంతానంన లేక, పుత్రకామేష్టి యాగం చేశాక, ఆయనకు నలుగురు పుత్రులు కలుగుతారు. కౌసల్యకి రాముడు, కౌకేయికి భరతుడు, సుమిత్రకి లక్ష్మణ, శత్రుఘ్నులు జన్మిస్తారు. కులగురువైన వశిష్ట మహర్షి వద్ద వారు విద్యాభ్యాసం చేస్తారు. ఈ రాజకుమారుల జననం, విద్యాభ్యాసం వశిష్టమహర్షి ద్వారా జరుగుతాయి. వీరి వివాహం విశ్వామిత్ర మహర్షి ద్వారా జరుగుతుంది. విశ్వామిత్ర మహర్షి తన యాగ సంరక్షణకై రామలక్ష్మ