సారస్వతం

ఆధునిక కవిత్వంలో అనుభూతి వాదం

సారస్వతం
పాండవులు అరణ్యవాసానికి వెళ్ళేటప్పుడు కుంతీదేవి ద్రౌపదిని చూసి సహదేవుని విషయమై “కాదు(బ సిబిడ్డ వీ(డొకటి గాదవునా నేఱు(గండు ముందరె య్యెడ నొక పాటేఱుంగ(డెద యెంతయు(గోమల మెప్పుడైన నే( గుడువ(గ బిల్తు(గాని తనకుం గల యా(కటి ప్రొద్దేఱుంగ(డీ కొడుకిటు పోకకున్ మనము గుందెడు ని గని యూఱడిల్లెడున్" ఈ పద్యంలో తనకు సహదేవుని పట్లగల వాత్సల్యాతిశయాన్ని హృదయద్రవీకరణంగా ద్రౌపదికి కుంతీదేవి తెలపటం కన్పిస్తుంది. భాగవతాన్ని రచించిన పోతన్నగారి కవిత్వం అంతా రసార్ణవమే. "నల్లనివా(డు పద్మనయనంబుల వా(డు కృపారసంబు పై( జల్లెడు వా(డుమౌళి పరిసర్పిత పింఛమువా(డు నవ్వురా జిల్లెడు మోమువా(డొక(డు చెల్వల మానధనంబు దెచ్చెనో మల్లియలార! మీ పొదలమాటున లే(డు గదమ్మ! చెప్పరే" ఈ పద్యం మనోహరమైన అనుభూతులతో నిండిన పద్యం. ఈ మహాకావ్యాలన్నీ అనుభూతికి ఉదాహరణలే అయినా, స్థాలీపులాక న్యాయంగా నేను ఈ ఉదాహరణలను ఇస్తున్నాను. ప్రబంధయుగంలో ప్రథమ ప్రఖ

అన్నమయ్య శృంగార నీరాజనం

సారస్వతం
అష్టవిధ నాయికలు – విప్రలబ్ధ - టేకుమళ్ళ వెంకటప్పయ్య అన్నమయ్య కీర్తించిన విప్రలబ్ధ శృంగార కీర్తన తెలుసుకునే ముందు విప్రలబ్ధ నాయిక గురించి కొంత తెలుసుకుందాం. “క్వచిత్సంకేత మావేద్య దయితే నాథవఞ్చితా| స్మరార్తా విప్రలబ్ధేతి కలావిద్భిః ప్రకీర్త్యతే||” అని విద్యానాథుని ప్రతాపరుద్రీయములో చెప్పాడు. "ఒకానొక సంకేతస్థలమునకు రమ్మనిన ప్రియుడు, ఆ సంకేతమునకు తాను రాకుండుటచే వంచింపబడి, స్మరార్తయైన నాయిక విప్రలబ్ధ యని కలావిదులందురు" అని అర్థము. భానుదత్తుడు రసమంజరిలో "సంకేతనికేతనే ప్రియమనవలోక్యసమాకులహృదయా విప్రలబ్ధా| అస్యాశ్చేష్టా నిర్వేద నిశ్వాస సంతాపాలాప భయ సఖీజనోపాలంభ చింతాశ్రుపాత మూర్ఛాదయః|" – అన్నాడు. ‘సంకేతనికేతనమున ప్రియుని గానక వ్యాకులమతి యగునది విప్రలబ్ధ. తత్ఫలితముగా నీమె నిర్వేదము, నిశ్వాసము, సంతాపము, ప్రలాపము, భయము, చెలులను, పరిసరములను నిందించుట, చింతించుట, ఏడ్చుట, మూర్ఛిల్లుట – అను చేష్టలను చేయు

ప్రారబ్ధ కర్మలు

సారస్వతం
-శారదాప్రసాద్(టీవీయస్.శాస్త్రి) ​ముందుగా కర్మ అంటే ఏమిటో తెలుసుకుందాం!కర్మ అంటే 'విధి' కాదు. karma is not fate!ఈ రెండిటికీ చాలా తేడా ఉంది. కర్మ అనేది ఒక పని.అది మనంతట మనం కల్పించుకున్నదే!అది మంచిది కావచ్చు లేదా చెడ్డది కావచ్చు! అంటే కర్మ వేరు, కర్మ ఫలం వేరు. కర్మ అంటే మనం ఉదయం లేచిన దగ్గరనుండి రాత్రి పడుకునే వరకు మనం చేసే పనులన్నీ కర్మలే.కర్మ సిద్ధాంతం గురించి చెప్పేటప్పుడు గత జన్మ ఒకటుందని,మరణించిన తర్వాత మరొక జన్మ ఉంటుందని నమ్మి తీరాల్సిందే!అయితే,నేను దీన్ని గురించి ఇంకా డోలాయమాన పరిస్థితిలోనే ఉన్నాను.ఇంకా నాకు ఒక నిశ్చితమైన అభిప్రాయం ఏర్పడలేదు.అందుకే నా కొన్ని వ్యాసాల్లో భిన్నమైన అభిప్రాయాలు కనపడుతుంటాయి. అర్ధం చేసుకున్నవారు accept చేస్తారు. అర్ధం చేసుకోనివారు నిలకడలేని మనిషిగా నన్ను భావిస్తుంటారు. నిజానికి నేను కోరుకునేది కూడా ఈ నిలకడలేని స్థితినే! మనం వృక్షాలలాగో, కొండలలాగో ఒకేచోట

రండి! కాళన్నను ఆవాహన చేసుకుందాం!!

సారస్వతం
 - సంగిశెట్టి శ్రీనివాస్‍   1937లో 23 యేండ్ల వయసులో నిజామాబాద్‍ ఆంధ్ర మహాసభల్లో పాల్గొన్నది మొదలు 2002లో చనిపోయే వరకూ మొత్తం ఆరున్నర దశాబ్దాల పాటు నిరంతరం ప్రజాక్షేత్రంలో న్యాయం వైపు, పీడితుల వైపు నిలబడ్డ గొంతుక, ధిక్కార పతాక కాళోజి నారాయణరావు. చిన్నా, పెద్దా తేడా లేకుండా తెలుగు ప్రజలందరి గుండెల్లో కాళన్నగా నిలిచిపోయిండు. ఆర్యసమాజీయుడిగా, ఉద్యమకారుడిగా, హక్కుల కార్యకర్తగా, నిజాం ఫ్యూడల్‍ పాలనపై నిరసన తెలిపి జైలుకెళ్ళిన ప్రజాస్వామ్యవాదిగా, కవిగా, కథకుడిగా, అనువాదకుడిగా, పేదల అడ్వకేట్‍గా, ఎమ్మెల్సీగా ఎప్పటికప్పుడు తన, పర అనే తేడా లేకుండా తప్పెవరు చేసిన తిప్పి కొట్టిండు. తోటి వారి బాధను తన బాధగా పలవరించిండు. కన్నీళ్ళ పర్యంతమయ్యిండు. మొత్తం తెలుగువారి ఇంటి మనిషిగా, తెలంగాణ ప్రజలకు ఆత్మీయుడిగా, ఆత్మగా బతికిన కాళోజి నారాయణరావు శతజయంతి సందర్భమిది. అనితర సాధ్యమైన ఆయన ఆచరణను ఆవాహన చేసుకోవా

అన్నమయ్య శృంగార నీరాజనం

సారస్వతం
అష్టవిధ నాయికలు - వాసక సజ్జిక - టేకుమళ్ళ వెంకటప్పయ్య "ప్రియాగమనవేళాయాం మణ్డయన్తీ ముహుర్ముహుః|/కేళీగృహం తథాత్మానం సా స్యాద్వాసకసజ్జికా||" అని విద్యానాథుడు తన ‘ప్రతాపరుద్రీయము’లో వాసకసజ్జిక యొక్క లక్షణాలను చెప్తాడు. వాసకం అంటే ఇల్లు, వస్త్రం, పరిమళం వెదజల్లే మూలిక / వేరు, సజ్జిక అంటే సిద్దంగా ఉండడం అందుకే వాసక సజ్జికకు ఆ పేరు. ఈ తరహా నాయిక ప్రియుడు లేక పతిరాక కోసం ఎదురుచూపులు చూస్తూ, ఏ క్షణమైనా రావచ్చునని తనను, తన పడకగదిని సుమనోహర, పరిమళ, సుగంధ భరితంగా అలంకరించుకొని తన పతికి కనువిందు చేయటానికి సిద్ధంగా ఉండే నాయిక. రకరకాల మణులు పొదిగిన బంగారు ప్రమిదల్లో సువాసన గల తైలం పోసి దివ్వెలను వెలిగించి, లేత తమలపాకులు, పోకచెక్కలు, పచ్చకర్పూరం, కుకుమపువ్వు, యాలకులు, లవంగాలు ఒక అందమైన పళ్ళెంలో సిద్ధం చేసుకుని ప్రియునికోసం యెదురు చూసే నాయిక. ఈమె అందంగా తయారై ప్రియుని రాకకోసం తద్వారా లభించే ఆనందాల కోసం న

దాశరధి 92వ జయంతి(1925-1987)

సారస్వతం
" నా తెలంగాణా కోటి రతనాల వీణ" – తాటిపాముల మృత్యుంజయుడు ఎవరు కాకతి! ఎవరు రుద్రమ! ఎవరు రాయలు! ఎవరు సింగన! అంతా నేనే! అన్నీ నేనే! అలుగు నేనే! పులుగు నేనే! వెలుగు నేనే! తెలుగు నేనే! పూర్తి పేరు: దాశరధి కృష్ణమాచార్యులు తల్లిదండ్రులు: వేంకటమ్మ, వేంకటాచార్యులు జననం: 22 జులై 1925 - ఖమ్మం జిల్లా (అప్పడు వరంగల్ జిల్లా) చిన గూడూర్ గ్రామం మరణం: నవంబరు 5, 1987 చదువు: బి.ఎ., ఉస్మానియా విశ్వవిద్యాలయం, హైదరాబాద్ ఉద్యోగాలు: ఉపాధ్యాయుడు, పంచాయతీ ఇన్ స్పెక్టరు‌, ఆకాశవాణి ప్రయోక్త రచనలు: గాలిబ్ గీతాలు, మహాంద్రోదయం, తిమిరంతోసమరం, అగ్నిధార, రుద్రవీణ, కవితాపుష్పకం, ఆలోచనాలోచనాలు‌‌, రుద్రవీణ, అమృతాభిషేకం సినిమా పాటలు: ఆరుద్ర ,ఆత్రేయ ,సినారె వంటి సమకాలికులతో పనిచేస్తూ 2000 పైగా పాటలు రాసారు. బిరుదులు, సత్కారాలు: 'కవితాపుష్పకం‌' కు ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అవార్డు,'తిమిరంతో సమ

ఉపనిషత్తులు

సారస్వతం
శారదాప్రసాద్ (టీవీయస్.శాస్త్రి) ​వేదాల యొక్క చివరి భాగాలను అంటే అంతములయిన (వేద+అంతములు)వేదాంతాలకు ఉపనిషత్తులని పేరు. ఉపనిషత్తులు మనమంతా దివ్యాత్మ స్వరూపులమని చెబుతున్నాయి .మరణించే ఈ శరీరంలో అమృతత్త్వమైనది ఒకటి ఉంది. అదే ఆత్మతత్త్వం. మానవుడు ఇంద్రియాలు తమంతట తామే పని చేస్తున్నాయని అనుకుంటాడు . కానీ, అంతర్గతంగా లోపల ఉన్న శక్తితత్త్వమే దివ్య చైతన్యమనీ మానవునికి తెలియదు. లోపలున్న ఆత్మ మనకంటికి కంటిగా, చెవులకు చెవిగా, మనస్సుకు మనస్సుగా ఉన్నదని కేనోపనిషత్‌ ఉద్ఘోషిస్తుంది. శరీరంలోని ఒక అవయవం ఇంకొక అవయవాన్ని బాధించడం అసహజమైన చర్య. ఆ విధంగానే ఈ ప్రపంచంలో ప్రతి ప్రాణి భగవంతుని అవయవాలు.ఈ ఆత్మ చెవికి చెవి, మనసుకు మనసు, వాక్కునకు వాక్కు మరియు ప్రాణానికి ప్రాణము, కన్నుకు కన్ను అని ఆ పరబ్రహ్మ తత్వాన్ని అపూర్వ౦గా తెలిపినది కేనోపనిషత్. అడవులలో గురుశిష్యుల మధ్యన జరిగిన చర్చలనే ‘ఉపనిషత్తులు’ అంటారు. ఈ ఉప

భక్తి వ్యసనంగా మారకూడదు!

సారస్వతం
(కార్టూన్ సౌజన్యం --మిత్రుడు శ్రీ రామకృష్ణ గారు) -శారదాప్రసాద్(టీవీయస్.శాస్త్రి) ​నాకొక మిత్రుడున్నాడు.నా కన్నా వయసులో చాలా చిన్నవాడే!24 గంటలూ భక్తి టీవీ చూస్తుంటాడు.అన్ని భక్తి కార్యక్రమాలకు వెళ్లుతాడు. వివిధ యాత్రాస్ధలాలు చూస్తుంటాడు. కుటుంబం కోసం కన్నా ఎక్కువ కాలాన్ని భక్తి కార్యక్రమాలకు కేటాయిస్తాడు. అడ్డూ, అదుపు లేకుండా ధనాన్ని భక్తి కార్యక్రమాలకోసమే విపరీతంగా ఖర్చు చేస్తాడు.ఎన్నో గ్రంధాలను కొంటాడు.నిజానికి అతనొక మధ్యతరగతి కుటుంబీకుడు. పైకి రావలసిన పిల్లలున్నారు.కుటుంబ బాధ్యతలను సరిగా నిర్వహించలేక పోతున్నాడేమోననిపిస్తుంది!ఒక్కొక్కసారి తాదాత్మ్యం చెంది ,"నాకు శివుడిలో లీనం కావాలనిపిస్తుందని అంటాడు!శివైక్యం చెందని జీవితం వృధా" అని అంటాడు. నిజం చెబితే బాధపడుతారేమో కానీ ఇవన్నీ histrionic లక్షణాలు. సాధారణంగా ఈ లక్షణాలు ఆడవారిలో ఎక్కువగా ఉంటాయి. దేవుడికి హారతి ఇచ్చేటప్పుడు కూడా చాలామంది

అన్నమయ్యకు ఆరాధనా నివాళి 

సారస్వతం
- దీప్తి కోడూరు  భగవంతుని గుణకీర్తనం చేసి తరించిన భక్తులు ఎందరో మన దేశంలో ఉద్భవించారు. వీరినే భక్త కవులంటారు. భక్త కవుల గురించి సుదీర్ఘ వివరణలు చెప్పుకునేకంటే ఒక్క సంఘటనను స్మరిస్తే వారి అంతరంగం స్పష్టమవుతుంది. ఒకనాడు ఒక భక్తురాలు భగవాన్ శ్రీ రమణ మహర్షి వద్ద ఇలా అడిగింది,"నాయనా త్యాగయ్య అన్నమయ్య రామదాసు వీరంతా గానం చేసి తరించారు కదా! అది అందరికీ సాధ్యమవుతుందా?" అని. దానికి మహర్షి చిన్న చిరునవ్వుతో ఇలా జవాబిచ్చారు, "అమ్మా వారంతా గానంతో తరించలేదే, తరించాకే ఆ అనుభవాన్ని గానం చేశారు. " ఒక మహాత్ముని అంతరంగాన్ని ఇంకొక మహాత్ముడు తప్ప సామాన్యులు ఎలా అర్ధం చేసుకోగలరు?!! మీరాబాయి, గోదాదేవి, అక్కమహాదేవి, అన్నమయ్య, త్యాగయ్య, రామదాసు, పురందరదాసు, తులసీదాసు, కబీరుదాసు, నామదేవుడు, రామానందుడు, సూరదాసు, బసవన్న, అల్లమప్రభువు, రవి దాసు, తుకారాం , చైతన్య ప్రభు చెప్పుకుంటూ పోతే మన దేశంలో మహానుభావులు ఉదయించ

అనుభూతి – ప్రాచీన దృక్పథం (5వ- భాగం)

సారస్వతం
– సునీల పావులూరు వ.క్ర. ప్రవృత్తి కోశం అనుభూతి 1 ఇంద్రియచైతన్య ప్రవృత్తి అన్నమయకోశం వాస్తవికానుభూతి 2 భావచైతన్య ప్రవృత్తి మనోమయకోశం కాల్పనికానుభూతి 3 జ్ఞానచైతన్య ప్రవృత్తి విజ్ఞానమయకోశం జ్ఞానానుభూతి 4 జీవచైతన్య ప్రవృత్తి ప్రాణమయకోశం పూర్ణచైతన్యాంశం 5 ఆధ్యాత్మికచైతన్య ప్రవృత్తి ఆనందమయకోశం తాత్త్వికానుభూతి “ఈ అయిదు కోశాలద్వారా పొందే అనుభవం సమాజంలో ఉంది. దానితో సహజీవనం చేయటం సామాజిక జీవితం; ఆ సహజీవనంలో వ్యక్తి సహజ ప్రవృత్తికి శక్తిగా వ్యక్తమౌతాడు. సామాజికానుభూతిని రికార్డుచేసే సాత్త్వికసాధనం మనిషి. రికార్డుచేసి ఊరుకుంటే సామాజికుడు. దాన్నే ఉద్దీపనం చ్బెసి సాహిత్యరూపంగా అభివ్యక్తీకరిస్తే రచయిత. సమాజంలో భుక్తమౌతున్న అనుభ