శీర్షికలు

పుస్తక సమీక్ష

శీర్షికలు
సత్యమేవ జయతే సమీక్షకుడు - తాటిపాముల మృత్యుంజయుడు; రచయిత - సత్యం మందపాటి మంచి రచన చేయడం అంత సులభమేమి కాదు. మెప్పించే రచనలు చేస్తూ ఒక మంచి రచయితగా పేరొందడమంటే ఆషామాషి వ్యవహారం అసలే కాదు. మందపాటి సత్యంగారు మంచి రచయితల కోవలోకి వస్తారు. నేను అమెరికాలో అడుగుపెట్టి సమయం దొరికించుకొని తెలుగు సాహిత్యంపై మక్కువ పెంచుకొన్న పాతికేళ్ళ నుండి వారి సాహిత్యంతో నాకు పరిచయం ఉంది. వైవిధ్యమైన రచనలు చేయడంలో వారిది అందె వేసిన చెయ్యి. పాఠకులను ఆకట్టుకొనే రచనలు చేయాలంటే రచయిత అందరి మనుసుల్లాగే జీవిస్తూ సమాజాన్ని 'ఓరకంట (Special Eye)' నిరంతరం పరికిస్తూ ఉండాలి. అలా చేస్తే, కథ వస్తువులకు సరిపడే ముడిసరుకు లభ్యమవుతూనే వుంటుంది. ఈ పుస్తకం 'సత్యమేవ జయతే' ముందు మాటలో రచయిత ఉటంకించినట్టు, నిత్యసత్యమైన అనేక విషయాలపై కాసిన్ని హాస్య రచనలు చేయడం జరిగింది. వ్యంగ్యాస్త్రాలను సంధించడం జరిగింది. అప్పుడప్పుడు ఆవేదన వెలిబుచ్చ

వీక్షణం సాహితీ గవాక్షం -64

శీర్షికలు
- డా|| లెనిన్ అన్నే వీక్షణం 64 వ సమావేశం మిల్పిటాస్ లోని స్వాగత్ హోటల్ లో డిసెంబరు 10 వ తేదీన ఆసక్తికరంగా జరిగింది. శ్రీ చిమటా శ్రీనివాస్ అధ్యక్షత వహించిన ఈ సభలో ముందుగా మిసిమి పత్రిక సహ సంపాదకులు, ప్రముఖ చిత్రకళా చారిత్రకులు శ్రీ కాండ్రేగుల నాగేశ్వర్రావు ఆంధ్రుల చిత్ర కళ చరిత్ర గురించి సవివరంగా ప్రసంగించారు. ముఖ్యంగా పాశ్చాత్య యుగంలో రినైసాన్స్ తరువాత పునరుజ్జీవనం పొందిన చిత్రకళ ను గురించి, ప్రపంచ ప్రఖ్యాత చిత్రకారుడు పికాసో గురించి వివరించేరు. ముఖ్యంగా పికాసో భారతీయ చిత్రకళా గొప్పదనాన్ని, అప్పటి ఇల్లస్త్రేటెడ్ వీక్లీ సంపాదకులు ఏ. ఎస్. రామన్ గారికి తెలియజేసిన విధానాన్ని వివరించేరు. ఎవరికీ అంత సులభంగా ఇంటర్వ్యూ ఇవ్వని పికాసో ఏ. ఎస్. రామన్ ను దగ్గరకు పిలిచి మరీ ఇంటర్వ్యూ ఇస్తూ "ఇండియా ఈజ్ ఎ లాండ్ ఆఫ్ వేదాస్, ద బుద్ధా, అండ్ ద కలర్స్ " అని పొగిడారట. పార్లమెంటు భవనంలో అశోక చక్ర నమూనా ని తీ

పద్యం – హృద్యం

శీర్షికలు
నిర్వహణ : పుల్లెల శ్యామసుందర్ ఈ క్రింది "ప్రశ్న"కు పద్యరూపములో జవాబు పంపాలి. మీ జవాబులు విద్యుల్లేఖ ద్వారా (e-mail : padyam_hrdyam@yahoo.com) మాకు 20వ తారీఖు లోపల పంపించండి. ఉత్తమ పూరణలను తరువాయి సంచికలో ప్రచురిస్తాము. ఈ శీర్షికలో ప్రచురించడానికి పాఠకులనుండి పూరణలు మాత్రమే కాకుండా ప్రశ్నలను కూడా ఆహ్వానిస్తున్నాము. ప్రశ్నలు వీలున్నంతలో తేట తెలుగులో ఉండి, సమకాలీనములైతే బాగుంటుందని మా అభిప్రాయము. ఈ మాసం ప్రశ్న: దత్తపది: వంగ, దోస, కాకర, కంద పదములను అన్యార్ధములతో వాడుతూ భారతదేశ స్వాతంత్ర్య సమరానికి సంభందించిన విషయముపై స్వేచ్ఛా ఛందస్సులో పద్యము వ్రాయాలి గతమాసం ప్రశ్న: తాతా యని ప్రేమతోడ తరుణినిఁ బిలిచెన్ ఈ ప్రశ్నకు మాకు అందిన క్రమములో పూరణలు ఇలా వున్నాయి. శ్రీమతి జి సందిత  బెంగుళూరు ప్రీతిన్ పెళ్ళాడన్ కవి నా తాళంవారి తార నటులఁజిలిపిగా నాతండు ముద్దుపేరున తాతా యని ప్రేమతోడ తరుణినిఁ బిల

ఆకాశవాణి

శీర్షికలు
జానపదాల నుండి జ్ఞానపీఠం దాకా డా.సి. నారాయణ రెడ్డి ప్రస్థానం డా. జె. చెన్నయ్య 9440049323 విద్యార్థి దశలో అలవోకగా సీసపద్యాలనే అల్లిన నాటి నుంచి నిన్న మొన్నటి వరకు 70 సంవత్సరాల పాటు మహా ప్రవాహంలా నిరంతరం సాగిన కవితాయాత్రను ఆపి శాశ్వతంగా సెలవు తీసుకున్నారు మహాకవి డా.సి.నారాయణ రెడ్డి. సినారె అన్న మూడు అక్షరాలు తెలుగు సాహితీ క్షేత్రంలో భిన్న పక్రియల్లో పేరెన్నిక గన్న రచనల ఆవిర్భావానికి అక్షయపాత్రలై నిలిచాయి. కోట్లాది మంది అభిమానులను ఆయనకు సంపాదించిపెట్టాయి. జానపదవాఙ్మయ ప్రభావంతో సాహితీ సృజనకు శ్రీకారం చుట్టింది మొదలు అత్యున్నతమైన జ్ఞానపీఠ గౌరవాన్ని పొందడమే గాక మరెన్నో కావ్యాలను సృష్టించిన దశ వరకు సాగిన సినారె జీవనయాత్రను, కవితా యాత్రను గురించి సంగ్రహంగా తెలుసుకుందాం. అక్షరాస్యతే కాదు విద్యాగంధం సైతం అంతంతమాత్రంగా వున్న తెలంగాణ జనపదంలో పుట్టి జానపదుల మాట, ఆట, పాటల ఒడిలో పెరిగి ఇంతింతై విరాణ

పద్యం – హృద్యం

శీర్షికలు
-పుల్లెల శ్యామసుందర్ ఈ క్రింది "ప్రశ్న"కు పద్యరూపములో జవాబు పంపాలి. మీ జవాబులు విద్యుల్లేఖ ద్వారా (e-mail : padyam_hrdyam@yahoo.com) మాకు 20వ తారీఖు లోపల పంపించండి. ఉత్తమ పూరణలను తరువాయి సంచికలో ప్రచురిస్తాము. ఈ శీర్షికలో ప్రచురించడానికి పాఠకులనుండి పూరణలు మాత్రమే కాకుండా ప్రశ్నలను కూడా ఆహ్వానిస్తున్నాము. ప్రశ్నలు వీలున్నంతలో తేట తెలుగులో ఉండి, సమకాలీనములైతే బాగుంటుందని మా అభిప్రాయము. ఈ మాసం ప్రశ్న: తాతా యని ప్రేమతోడ తరుణినిఁ బిలిచెన్ గతమాసం ప్రశ్న: "చిత్ర" కవిత్వం - ఈ క్రింది ఛాయచిత్రమునకు ఒక వ్యాఖ్యను లేదా వర్ణనను మీకు నచ్చిన ఛందస్సులో పద్యరూపములో పంపాలి ఈ ప్రశ్నకు మాకు అందిన క్రమములో పూరణలు ఇలా వున్నాయి. అయినాపురపు శ్రీనివాసరావు, సెయింట్ లూయిస్, మిస్సోరి. ఆ.వె. వాలు జడను గూర్చి వయ్యార మొలికించు హావ భావ యుక్త హాస్య లాస్య నవ రసములనెల్ల నాట్యమందున జూపు కులుకు లాడి నడక కూచ

నరసింహ సుభాషితం

శీర్షికలు
-ఓరుగంటి వేఙ్కట లక్ష్మీ నరసింహ మూర్తి జన్మ భూమి శ్లోకం: अपि स्वर्णमई लङ्का न मे लक्ष्मण रोचते । जननी जन्मभूमिश्च स्वर्गादपि गरीयसी ।। అపి స్వర్ణమయీ లఙ్కా న మే లక్ష్మణ రోచతే । జననీ జన్మ భూమిశ్చ స్వర్గాదపి గరీయసీ ॥ సంధి విగ్రహం అపి, స్వర్ణమయీ, లఙ్కా, న, మే, లక్ష్మణ, రోచతే, జననీ, జన్మ భూమి:, చ, స్వర్గాత్ అపి, గరీయసీ. శబ్దార్థం లఙ్కా = లంకా నగరము, స్వర్ణమయీ = పూర్తిగా బంగారుమయమైనప్పటికీ, అపి = కూడా, లక్ష్మణ = ఓ! లక్ష్మణ, మే = నాకు, న రోచతే = రుచించదు, ఇష్టం లేదు; జననీ = జన్మనిచ్చిన తల్లియు, చ = మరియు, జన్మ భూమి: = జన్మించినట్టి భూమియు, స్వర్గాత్ = స్వర్గము కంటెను, అపి = కూడా, గరీయసీ = ఉత్కృష్టం. Meaning After the war with Ravana and on seeing the beauty and grandeur of Lanka, when Lakshmana said to his brother Rama to stay put in Lanka itself, then Rama replied to Lakshma

నరసింహ సుభాషితం

శీర్షికలు
- ఓరుగంటి వేఙ్కట లక్ష్మీ నరసింహ మూర్తి పరోపకారం - 1 శ్లోకం: परोपकाराय फलन्ति र्वुक्षाः  परोपकाराय वहन्ति नद्यः । परोपकाराय दुहन्ति गावः  परोपकारार्धमिदं शरीरम्  ।। పరోపకారాయ ఫలన్తి వృక్షాః పరోపకారాయ వహన్తి నద్యః । పరోపకారాయ దుహన్తి గావః పరోపకారార్థమిదం శరీరమ్ ॥ సంధి విగ్రహం పరోపకారాయ, ఫలన్తి, వృక్షాః, పరః, ఉపకారాయ, వహన్తి, నద్యః, పరః, ఉపకారాయ, దుహన్తి, గావః, పరోపకార, అర్థం, ఇదం, శరీరం, పరోపకారార్థమిదం శరీరమ్. శబ్దార్థం పరోపకారాయ = పరుల ఉపయోగార్థం, వృక్షాః = చెట్లు, ఫలన్తి = పండ్లని కాస్తున్నాయి, నద్యః = నదులు, వహన్తి = ప్రవహిస్తున్నాయి, గావః = ఆవులు, దుహన్తి = పాలని ఇస్తున్నాయి, పరోపకారార్థం = పరుల ఉపయోగం కొరకై, ఇదమ్ శరీరమ్ = ఈ శరీరం ఉద్దేశింపబడినది. Meaning Trees give fruits to help satisfy the hunger of humans. Rivers flow to quench the thirst of humans.

పద్యం – హృద్యం

శీర్షికలు
నిర్వహణ : పుల్లెల శ్యామసుందర్ ఈ క్రింది "ప్రశ్న"కు పద్యరూపములో జవాబు పంపాలి. మీ జవాబులు విద్యుల్లేఖ ద్వారా (e-mail : padyam_hrdyam@yahoo.com) మాకు 20వ తారీఖు లోపల పంపించండి. ఉత్తమ పూరణలను తరువాయి సంచికలో ప్రచురిస్తాము. ఈ శీర్షికలో ప్రచురించడానికి పాఠకులనుండి పూరణలు మాత్రమే కాకుండా ప్రశ్నలను కూడా ఆహ్వానిస్తున్నాము. ప్రశ్నలు వీలున్నంతలో తేట తెలుగులో ఉండి, సమకాలీనములైతే బాగుంటుందని మా అభిప్రాయము. ఈ మాసం ప్రశ్న: "చిత్ర" కవిత్వం - ఈ క్రింది ఛాయచిత్రమునకు ఒక వ్యాఖ్యను లేదా వర్ణనను మీకు నచ్చిన ఛందస్సులో పద్యరూపములో పంపాలి గతమాసం ప్రశ్న: నిర్ధిష్టాక్షరి మరియు వర్ణన: "హే", "వి", :"ళం(లం)", "బి" అనే అక్షరాలతో ఒకొక్క పాదము ప్రారంభిస్తూ మీకు నచ్చిన ఛందస్సులో వసంత ఋతువర్ణన చేయాలి. ఈ ప్రశ్నకు మాకు అందిన క్రమములో పూరణలు ఇలా వున్నాయి. పోచిరాజు కామేశ్వర రావు, రాయిపూర్ హేవిళంబి విలంబన మె

సంగీత పాఠాలు

శీర్షికలు
సేకరణ: డా.కోదాటి సాంబయ్య సంగీత ప్రాశస్త్యం : న నాదేనా వినా గీతం న నాదేన వినా స్వరః | న నాదేన రాగస్త స్మా నాదాత్మకం త్రయం || గీతము, స్వరము, రాగము ఈ మూడూ నాదాన్ని విడిచి ఉండలేవు. మామూలుగా మనం వ్యవహారం లో వినే ధ్వనులను చప్పుడు అంటాము. ఈ చప్పుడుకూ సంగీత ధ్వనికీ చాలా భేదం ఉంది. ఒక వస్తువు ఒక సెకండులో ఎన్నిసార్లు కంపిస్తుందో ఆ సంఖ్య ఆ వస్తువు యొక్క పౌనఃపున్యం అంటారు. సంగీత ధ్వనుల పౌనః పున్యం ప్రతి సెకండు కూ ఒకే విధంగా ఉంటుంది. అందుకే ఆ ధ్వనులను ఎంతసేపు విన్నా ఇంకా వినాలని అనిపిస్తుంది. చప్పుడు ధ్వని తరంగం ప్రతి సెకను సెకండు కూ మారుతుంటుంది. అందుకే ఆ ధ్వనులను వింటుంటే చెవులు మూసుకుంటాము. సంగీత ధ్వనులకు మూడు ప్రత్యెక లక్షణాలు ఉన్నాయి...అవి. 1. పిచ్ : పౌనః పున్యం పెరిగితే పిచ్ పెరిగింది అంటాము. షడ్జం కంటే రిషభం పౌనః పున్యం ఎక్కువ...రిషభం కన్నా గాంధారం పౌనః పున్యం ఇంకా ఎక్కువ.