సుజననీయం

కాలం మహిమ!

సుజననీయం
ప్రధాన సంపాదకులు: తాటిపాముల మృత్యుంజయుడు సంపాదక బృందం: తమిరిశ జానకి కస్తూరి ఫణిమాధవ్ కాలం మహిమ! 'ప్రభో , కాలం నీ చేతుల్లో అనంతం నీ నిమషాల్ని లెక్కపెట్టగలవారెవరూ లేరు ' (గీతాంజలి, చలం) 'ఎందులోంచి ఎప్పుడు ఎలాగ పుట్టింది కాలము? ఎవరివల్ల, ఎవరికోసం జరిగిందీ ఇంద్రజాలం?' (త్వమేవాహం, ఆరుద్ర) 'గాలంవలె శూలం వలె వేలాడే కాలం వేటాడే వ్యాఘ్రం అది, వెంటాడును శీఘ్రం' (ఖడ్గ సృష్టి, శ్రీ శ్రీ) పైవన్నీ మన తెలుగు కవులు తమ కవితల్లో కాలానికి అన్వయించుకున్న అర్థాలవి. మరి తత్వవేత్తలు, ఆధ్యాత్మికులు కాలాన్ని ప్రవాహమని, చక్రమని పరిగణించారు. ఇదలా ఉంచితే, శాస్త్రవేత్తలు కాలం ఈ విశ్వం ఉద్భవించినప్పటినుండి పుట్టిందని పేర్కొన్నారు. నిరంతరం క్రియప్రక్రియలతో నిరాఘాతంగా వ్యాపిస్తున్న ఈ విశ్వంలో ఎప్పుడో ఒకప్పుడు వివిధరూపాల్లో ఉన్న శక్తులు ఉట్టడుగుతాయని (Thermal Equillibrium), అప్పుడు సంకోచం ప్ర

యువత – భవిత

సుజననీయం
సంపాదకవర్గం: ప్రధాన సంపాదకులు: తాటిపాముల మృత్యుంజయుడు సంపాదక బృందం: తమిరిశ జానకి కస్తూరి ఫణిమాధవ్   - తాటిపాముల మృత్యుంజయుడు 'భాషా సేవయే భావితరాల సేవ' అన్న నానుడితో అమెరికాలోని పెక్కు రాష్ట్రాల్లోనే కాకుండా విదేశాల్లో కూడా శరవేగంతో అభివృద్ధి చెందుతూ పిల్లలకు తెలుగు విద్యాబోధన చేస్తున్నది సిలికానాంధ్ర మనబడి. అలాగే, హైస్కూలు పూర్తి చేసిన పిల్లలకు, మరియు పెద్దలకు భారతీయ సంస్కృతిలోని వివిధ అంశాలలో ఉన్నత విద్య అభ్యసించటానికి 'సిలికానాంధ్ర విశ్వవిద్యాలయం' ప్రారం భించడం జరిగింది. విద్యాబోధనే కాకుండా యువత మనోభావాలు వెల్లడించటానికి 'సిలికానాంధ్ర యువత' అనే వేదిక ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటి ప్రపంచీకరణ నేపథ్యంలో వారిని ముందు తరపు పౌరులుగా తయారుచేయటానికి కావల్సిన సదుపాయాలను తయారుచేసి, తగిన రీతిలో సహాయం అందిచడం ఈ వేదిక ముఖ్యోద్దేశం. మరిన్ని వివరాలకు 'ఈ మాసం సిలికానాంధ్ర' శీర్షిక చూడం