వీక్షణం

వీక్షణం – సాహితీ గవాక్షం – బే ఏరియా వీక్షణం సాహితీ సమావేశం- 54

వీక్షణం
- నాగరాజు రామస్వామి వీక్షణం 54వ సమావేశం ఫిబ్రవరి 12, 2017 నాడు శ్రీ చుక్కా శ్రీనివాస్ గారి స్వగృహమున జరిగింది. ఈ సమావేశమునకు శ్రీ పిల్లలమఱ్ఱి శ్రీ కృష్ణ కుమార్ గారు అధ్యక్షత వహించారు. మొదటి వక్త శ్రీ ఉప్పలూరి విజయ కుమార్ గారు. వారు గత 40 సంవత్సరాలుగా పలు కథలు, నవలలు వ్రాసానని తెలిపి, 30 సంవత్సరాల క్రితం పల్లకీ పత్రికలో ప్రచురితమైన తమ కథ "లోపలి మనిషి" అనే కథను చదివారు. అంటరానితనమును ప్రశ్నిస్తూఒక వ్యక్తి తనలో అంతర్గతంగా ఉన్న అంటరానితనాన్ని ప్రశ్నించుకునే ఈ కథ అందరినీ ఆకట్టుకుంది. తరువాతి కార్యక్రమం శ్రీ నాగరాజు రామస్వామి గారి రవీంద్రుడి గీతాంజలికి తెలుగు అనువాదం "గీతాంజలి" పుస్తకావిష్కరణ. మొదటి సమీక్షకులు శ్రీ వేణు ఆసూరి గారు. వారి ప్రసంగ విశేషములు "ఈ గీతాంజలి చదువుతున్నప్పుడు నేను మూలాన్ని కాని, మరో అనువాదాన్ని కాని ప్రక్కన పెట్టుకుని పోల్చి చూడలేదు. నాగస్వామిగారి రచనను ఒక సరిక