'తల్లీ నినుదలంచి ' పుస్తక
ఆవిష్కరణం :
'కవి సమయం', 'ఆంధ్ర పద్యకవితా
సదస్సు ' మరియు 'త్యాగరాయ
గానసభ ' సంయుక్తాధ్వర్యంలొ
రచయిత నిశాపతి (యెం.హెచ్.వి .
సుబ్బారావు ) రచించిన 'తల్లీ
నినుదలంచి '
పుస్తక ఆవిష్కరణం
జరిగింది. డా. సి. నా.రె ముఖ్య అథిధి
ప్రసంగం చెస్తూ నిశాపతి
నిశిత పరిశీలనతొ, భావుకతతొ మన
విషిస్ఠ సంప్రదాయాలను
గురించి తెలియచెసే ఉద్గ్రంధం
రాశారని అభినందిచారు.
డా. ముక్తేవిభారతి మరియు
అద్దేపల్లి రామరావు కూడ
పాల్గొన్నారు.
'కృతులు, పదములు, జావలీలు '
ఆవిష్కరణ.:
మహాకవి దాసు శ్రీరాములు 19వ
శతాబ్ధి ఉత్తరార్థంలొ
ఆంధ్రరాష్ట్రంలొ జన్మించిన
ఒకగొప్ప వ్యక్తి. ఆయన
ప్రభందాలు, పురాణాలు, శతకాలు, నాటకాలు,
శాస్త్రగ్రంధాలు వంటి
పలుప్రక్రియల్లొ 30కి పైగా
గ్రంధాలు
వెలువరించారు.వీరు సంగీత
నౄత్యాభినయంలకు అనుకూలంగా
రచించిన "కృతులు, పదములు,
జావలీలు " సంకలనం ఆవిష్కరన
కార్యక్రమం 'మహాకవి దాసు
శ్రీరాములు స్మారక సమితి '
ఆద్వర్యంలొ
త్యాగరాయ గానసభలొ
జరిగింది. ముఖ్య అథిది గా డా.ఆవుల
మంజులత, గౌరవ అథిదిగా డా.నూకల
చినసత్యనారయణ వ్యవహరించారు.
'ఆకలి కళ్ళు '
పుస్తకావిష్కరణ:
సుందరయ్య కళానిలయంలొ లోక్
సత్తా కన్వీనర్
డా.జయప్రకాష్ నారాయణ ముఖ్య అథిదిగా
విచ్చేసి ' ఆకలి కళ్ళు '
కవితాసంకలనం పుస్తకావిష్కరణ్
చేసారు. కవిత్వమనేది గుండెల్లో
అనుభూతి,
కళ్ళల్లో చెమ్మ, మనస్సులో
భావం వున్నప్పుడే వస్తుందని
ఈ సందర్భంగా ఆయన అన్నారు.
సీనియర్ పాత్రికేయులు
చక్రవర్తుల రాఘవచారి ,పెద్దిరె
డ్డి తిరుపతి రెడ్డి కూడ
పాల్గోన్న ఈ సభలో
పద్మభూషణం రావి నారయణ
రెడ్డి పుస్తకాన్ని అంకితం
పొందారు.
గజల్ సిడి ఆవిష్కరణ:
తంగిరాల మెమోరియల్ ట్రస్ట్
ఆధ్వర్యంలొ అద్దేపల్లి
రామ్మొహనరావు గారు రచించిన
గజల్ సిడి ఆవిష్కరణ జరిగింది.
ముఖ్య అథిదిగా పాల్గొన్న
డా.సి.నా.రె మాట్లాడుతూ తెలుగు
గజల్ విషయంలొ
సాహిత్య పరిపుష్టి, లోతైన
భావసముదాయం, కమనీయ స్వరాల
కూర్పుతో రచయిత కృషి జరిపారని
అన్నారు. భారతీయ
సంస్కృతిలొ ఒక భాగమైన గజల్ సంగీతము
సాహిత్యము రెండింటిని
సమానంగా
ఆవిష్కరించగలిగే సాధనమని,
ఈప్రక్రియకి భారతదెశమే
పుట్టినిల్లని వక్తలు
పేర్కొన్నారు.
'మల్లికా కుసుమములు ' సిడి
ఆవిష్కరణ
ముదిగొండ మల్లీశ్వరి
రచించగా ప్రతాప్ విద్యాసాగర్
కూర్చిన బాణీలతొ కూడిన సిడీల
ఆవిష్కరణ రాగఝరి
ఆధ్వర్యంలో జరిగింది. డా.సి.నా.రే
మాట్లాదుతూ గీతాలు విశిష్టంగా
భక్తిభావ ప్రపూరితంగా
ఉన్నయని అన్నారు.
సాహిత్య పురస్కారం
ద్వా.నా.శాస్త్రికి
డా.సి.నా.రె సాహితీ పురస్కారం :
ప్రముఖ కవి, ఙానపీఠ అవార్డు
గ్రహీత డా.సి.నారాయణరెడ్డి
పేరిట నెలకొల్పిన
డా.సి.నా.రె కళాపీఠం తరపున పుష్కర
కాలంగా సాహితీప్రముఖులకు
సాహితీ పురస్కారాలను
అందచేస్తున్నది.దీనిలొ భాగంగా 2007
సంవత్సరానికి ప్రముఖకవి,
సాహితీవిమర్శకులు
డా.ద్వా.నా. శాస్త్రిని యెంపిక
చెసినట్లు కలాపీథం కార్యదర్శి,
గజల్ గాయకులు గజల్ శ్రీనివాస్
ఒక ప్రకటనలొ తెలిపారు.
పొట్టిశ్రీరాములు తెలుగు
విశ్వవిద్యాలయంలోని ఎన్.టి.
ఆర్. కళామందిరంలొ
రాష్ట్రమంత్రి మండలి బుద్ధప్రసాద్
ఈపురస్కారం అందచేస్తూ
ద్వా.నా.శాస్త్రి నిరంతర సాహిత్య
అన్వేషిగా మేలైన రచనలతో
సమాజాన్ని ప్రభావితం
చేస్తున్నారని
అభినందించారు.డా.యార్లగడ్డ లక్ష్మీప్రసాద్
అధ్యక్షత వహించగా ఓలేటి
పార్వతీశం కవి పరిచయం చేసారు.
'సుశీలానారాయణరెడ్డి '
పురస్కార ప్రదానం:
రవీంద్రభారతిలొ రసమయి
నిర్వహించిన
'సుశీలానారాయణరెడ్డి ' పురస్కార రజతోత్సవ సభలొ
2008 సంవత్సరానికిగాను
'సుశీలానారాయణరెడ్డి '
పురస్కారాన్ని ప్రముఖ రచయిత్రి
డా. ముదిగంటి సుజాత
రెడ్డికి అందచేసారు. మంత్రి మండలి
బుద్ధ్హప్రసాద్ మాట్లాడుతూ
తెలుగుభాషా పరిపుష్ఠికి
ప్రాతీయ సంప్రదాయం, ఆచార
వ్యవహారాలు చాటిచెప్పె మాండలిక
రచన ప్రక్రియ అవసరం
అన్నారు.
పత్రికల్లొ ప్రాంతీయ
అనుబంధాలలొ మాండలిక
పదప్రయోగానికి ప్రాధాన్యం ఇవ్వాలని
సూచించారు. అవార్డు
న్యాయనిర్నేతలుగా డా.ఆనందరామం,
డా.ఎల్లూరి శివారెడ్డి, ఏం. కె. ఆర్
. ఆశాలత
వ్యవహరించగా అవార్డుని
డా.సి.నా.రె రచయిత్రికి
అందచెసారు.
శివశంకరికి 'గోపిచంద్
పురస్కారం ' :
అగ్రశ్రేణి నవలా - కథా రచైత,
తాత్వికుడు దివంగత
త్రిపురనేని గోపిచంద్ పేర
నెలకొల్పిన జాతీయ సాహిత్య
పురస్కారాన్ని ప్రఖ్యాత తమిల
నవలా-కథా రచైత్రి, సామాజికవేత్త
శివశంకరికి ప్రదానం చేసారు.
యువకళావాహిని అధ్వర్యంలొ
త్యాగరాయ గానసభలో జరిగిన ఈ
కార్యక్రమానికి ముఖ్య అథిది
గా కర్నాటక పూర్వ గవర్నరు
వి.ఎస్.రమాదేవి ప్రసంగిస్తూ
గోపిచంద్ రచనలలో భావుకత
తాత్వికత ప్రతిబింబిస్తాయని
అన్నారు. డా.సి.నా.రే
మాట్లాడుతూ గోపిచంద్
సినీదర్శకుడుగా రాణించారని అన్నారు.
డా.ద్వా. నా. శాస్త్రి ,
టి.సాయిచంద్ అథిదులుగా విచ్చేసారు.
కుందుర్తి సంస్మరణ సభ -
అవార్డుల ప్రదానోత్సవం :
'రంజని ' తెలుగు సాహితీసమితి
నిర్వహించిన కుందుర్తి
సంస్మరణ సభ - అవార్డుల
ప్రదానోత్సవంలొ తెలుగు
విశ్వవిద్యాలం పూర్వ అధ్యక్షులు
అచార్య డా.గోపి ముఖ్య అథిది గా
పాల్గొంటూ సమకాలిన
సమాజంలొ చైతన్యాన్ని
పెంపొదించె కవుల సంఖ్య పెరగాలని
అభిలశించారు. అంతే కాకుండ
కవిత్వపు విశేషనాలని
వివరించారు. ఈ సందర్భంగా 2004 నుంచి 2007
వరకు రంజని - కుందుర్తి
అవార్డులు
పొందిన కవితలని "ఒక
నులివెచ్చని స్పర్ష ' పెరిట కవితా
సంకలనాన్ని ప్రముఖ కవి
కె.శివారెడ్డి ఆవిష్కరించారు.
పోటీల్లో వీజేతలైన వారికి
అవార్డులు ప్రదానం చెసారు.
రంజని అధ్యక్షులు
చీకోలు సుందరయ్య సమన్వ్యం
చేసారు.
హాస్యావధాని శంకరనారాయణకు
సన్మానం :
సాహితీ సాంస్కృతిక సంస్థ
'శ్రీరస్తు ' అధ్వర్యంలొ
త్యాగరాయగానసభ సదనంలొ
హాస్యావధాన ప్రక్రియలొ పదేల్లు
పూర్తిచెసుకున్న హాస్యావధాని
శంకరనారాయణకు సన్మానం
జరిగింది.
ఈ సంధర్భంగా వ్యంగం, హాస్యం
, చమత్కారం, విసుర్లు
మెళవించిన వ్యాఖ్యలతొ శంకరనారయణ
వైద్యులతొ హాస్యావధానం
చేసారు. కె.వి.రమణారెడ్డి
అధ్యక్షత వహించగా
ఆర్.టి.సి ఛైర్మన్ ఏం.
సత్యనారయణరావు జ్యొతి
ప్రజ్వలించారు. ప్రముఖ వైద్యులు
డా.ఏ.వై.చారి, కంభంపాటి
స్వయంప్రకాష్, బి. చంద్రకాంత్,
భాగ్యలక్శ్మి మొదలైన వారు
ప్రుఛకులుగా పాల్గొని
ఆహ్లాద పరిచారు.
విశేషాలు
తిలక్ సాహితీ సమాలోచనం:
రవీంద్రభారతి లొ ' తిలక్
సాహితీ సమాలోచనం ' పెరిట
ఏర్పాటు చెసిన నిర్విరామ సాహితీ
సదస్సులొ రాష్ట్రానికి
చెందిన ప్రముఖ కవులు రచైతలు
తిలక్ సాహిత్యంలోని పలు
కోణాలను దృక్పధాలను
పంచుకొన్నారు.
మనిషి మనస్తత్వాన్ని, మానవ
జీవిత మనుగడను తన
సాహిత్యంలో రంగరించిన దెవరకొండ
బాలగంగాధర తిలక్ సాహిత్యాన్ని
తరతరాలు అధ్యనం చెయాల్సిన
అవసరం వుందని వక్తలు
అభిప్రాయ పడ్డారు
నవలా పురస్కారానికి
దరఖాస్తుల ఆహ్వానం :
ప్రముఖ నవలా రచయిత్రి
దివంగత సోమిరెడ్డి జమున
స్మారకార్థం 2007 సంవత్సరానికి
రాష్ట్ర స్థాయి నవలా
పురస్కారానికి దరఖాస్తులు
ఆహ్వానిస్తున్నట్లు నిరవహకులు ఒక
ప్రకటనలొ తెలిపారు
2007 లో విడుదలైన అన్ని నవలలు
పోతికి పంపవచ్చు . పంపవలసిన
చిరునామ డా.పెల్లుకూరు
జయప్రద, వంశీ నర్సింగ్ హొం,
ఇందిరాభవన్ రోడ్ , నెల్లూరు - 524001
సినిమాలకు ఉపయోగపడే
మరిన్ని కోర్సులకు రూపకల్పన:
తెలుగు విశ్వవిద్యాలయం
చలనచిత్రాల రూపకల్పనకు
ఉపయోగపడె వివిధ శాఖలపై అవగాహన,
నైపుణ్యం కల్పించె కొత్త
కోర్సులను ప్రవెశపెట్టె ఆలోచన
ఉన్నట్లు డా.ఆవుల మంజులత
తెలిపారు.
రచయిత పరుచూరి గోపాలకృష్ణ
ఆధ్వర్యంలొ ' స్క్రీన్ ప్లే '
కోర్సు మూడవ విడత శిక్షణ
ప్రారంభమైంది.
ఖండాంతరాలు దాటనున్న '
తెలుగు ' ఖ్యాతి ::
ఇకముందు తెలుగు భాష ఖ్యాతి
ఖండాంతరాలు దాటనుంది.
హిబ్రూ విశ్వవిద్యాలంలొ తెలుగు
అధయన కేంద్రం ఫిబ్రవరి
నెలలొ ప్రారంభం కానుండగా
జర్మని, అమెరికాలలో కూడ ఆ దిశగా
ప్రయత్నాలు
ప్రాంభమైనట్లుగా తెలుగు
విశ్వవిద్యాలం వైస్
చాన్స్లర్ డా.ఆవుల మంజులత తెలిపారు.
అమెరికా అట్లాంటాలోని
ఎమురి మరియు జర్మని హెడెంబర్గ్
విశ్వవిద్యాలయాల్లో తెలుగు
అధ్యయన కేంద్రాల
ఏర్పాటుకి
అక్కడి విశ్వవిద్యాలయాలు
అంగీకరించినట్లు తెలిపారు.