ఈ జీవితంతో మరీ వేగిపోయా, ఒక్క అవకాశం సాధించలేకపొయా!
ఐనా ఆశతొ ముందుకు సాగిపోయా!
కన్నకలలను బుగ్గిచేస్తూ,
మరో జీవితం కోసం ఎదురుచూస్తూ,
పైకిచూస్తూ ఆ నీలిఆకాశం, కోరుకోకు ఆ రెండవ అవకాశం!

బ్రతికుండి ఏమిసాధించావనో, మళ్ళీపుట్టి ఏమి బావుకుందామనో!
లేక ఇలా పిచ్చి రాతలు రాసుకుందామనో!
నిజమేకాని అబద్దమేకానీ,
నిను కోరేవారెవరున్నారని గానీ?
పైకిచూస్తూ ఆ నీలిఆకాశం, కోరుకోకు ఆ రెండవ అవకాశం!

చేయిజారిన గాజుబొమ్మలా, బురదచిందిన వానజల్లులా,
వాడిపోయిన జాజిమల్లెలా,
నువు ఉంటే ఎంత?
పోతే ఎంత!
పైకిచూస్తూ ఆ నీలిఆకాశం, కోరుకోకు ఆ రెండవ అవకాశం!

నీ తెలివితేటలు బండబడ, నీ రూపురేఖలు ఎండిపడ,
కోరుకున్న వారే నీపై మండిపడ,
చదువుసందెలు చట్టుబడ,
ఐనా నోటి మాటే మారదు! ఏమి నీ ఎత్తుగడ?
పైకిచూస్తూ ఆ నీలిఆకాశం, కోరుకోకు ఆ రెండవ అవకాశం!

ఒక్క మనిషిని మెప్పించలేవు, రెండుజన్మలు నీకవసరమా?
చెప్పినా నీకు బుద్ధిరాదే, అదేమైనా ఓ సరసమా?
ఎవరునిన్ను మెచ్చారట,
ఎన్నిసార్లు నచ్చావట?
పైకిచూస్తూ ఆ నీలిఆకాశం, కోరుకోకు ఆ రెండవ అవకాశం!

సంవత్సరానికొక మారు ఛస్తావ్, ఐనా కొత్త సంవత్సరం కోసం చూస్తావ్,
మళ్ళీ ఆ పాత పనులే చేస్తావ్!
నువు మళ్ళీమళ్ళీ చావలేవు గానీ,
ఓ చక్కటి చావును కోరుకో పోనీ!
పైకిచూస్తూ ఆ నీలిఆకాశం, కోరుకోకు ఆ రెండవ అవకాశం!
ఇంతవరకు పాఠకుల తీర్పు: Page Title
     
మీమాట ఒక్క మాటలో.... Page Title
    
 Test Page

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం.
దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో విస్తారంగా తెలపండి.
వచ్చే సంచికలో ప్రచురిస్తాము.
(Please leave your opinion)

పేరు(Name):

విద్యుల్లేఖ (Email):

అభిప్రాయం (Opinion):


 

గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)