వరుణుని కారుణ్య మరుదైన మరుభూమి
నరుణుని దారుణ కిరణ శిఖలు
హరితము కొరవడి యొరిగిధరణిపయి
పొగులు తరువులె రగులు చితులు
పవనుడు తోడురా పవకః ఫలహార
హవనసామగ్రులా యడవి దరులు
నిరతము పారక బురదల యేరులై
నావిరై యిగురు మహానదములు
"యెల్నినో" పిడికిలి నిరికియీ యగచాట్లు
దూషిత ప్రకృతి నిరసన మట్లు
నరుని తృష్ణ తీర్ప ధరకుయూష్ణంబులు
ఆశకవధులె యిల కౌషధములు

































