సిలికానాంధ్ర, "సర్వధారి" యుగాది వేడుకలో భాగంగా నిర్వహించిన కవి సమ్మేళనంలో ప్రస్తుతపఱచబడిన కవిత ఇది.



అల్లరి చేస్తే దెయ్యం ఆవహిస్తుందని
చిన్ననాటనే అమ్మనోట విని
దెయ్యమంటే ఏమిటని దిగులుపడితే
దిగులు దెయ్యం పట్టిందని
ధూళివైద్యుడొచ్చి దుమ్ము దులిపె

అసురసంధ్యవేళ ఆరుబయట
ఆహ్లాదంగా వాహ్యాళికి వెళితే
కొరివిదెయ్యం వెంటపడి కించపరిచెనని
భూతవైద్యుడొచ్చి తరిమికొట్టె

ఆడుతూపాడుతూ తిరిగే వయస్సులో
మహమ్మారిలా కలల దెయ్యం కమ్మి
పగలు నిల్చోనీయక రాత్రి నిదురోనీయక
గుంజాటనం చేస్తే
నాడి నిపుణుడొచ్చి తాయెత్తు కట్టె

అంధకారం వదిలి జ్ఞానోదయం చెంది
దెయ్యాలన్నిటినీ మూటగట్టి
గిరగిర తిప్పి మూసీనదిలో గిరవాటువేసి
చేతులు దులిపి ఇల్లు చేరిన వేళ
ఎల్లలు దాటి దేశాంతరాలధిగమించి
ఇల్లువాకిలి లేక ఛాటు బజారులో
మాటున పొంచి చొరవగా నేనున్నానంటూ
చెంత చేరె సరికొత్త ఐయ్యం

నలుమూలలనుండి నలుగురితో
సవ్యసాచిలా సంధానం సంబరమయ్యే
నాలుగు రోజుల్లో చిట్టా సదరుగా
నాలుగువందలకి పెరిగె

నిమిషానికొరరితో Whats up
hi, howdy, బాగున్నావా అంటూ
మూకుమ్మడిగా సంభాషించే
ఐయ్యం ఆరాధ్య దైవమయ్యె

లక్షణంగా లాభసాటిగా పని ఛుట్టీకొట్టి ఛాటీంగ్ చేస్తూంటే
ఉత్తరక్షణంలో R U there అంటూ బాసు పిలిచే
తక్షణమే యెస్ బాస్ అని జవాబుకొట్టి
దైవమనుకున్న ఐయ్యం కాస్తా దెయ్యమయ్యిందనే
ఐయ్యం దెయ్యమా? దైవమా?

ఇంతవరకు పాఠకుల తీర్పు: Page Title
     బాగుంది
మీమాట ఒక్క మాటలో.... Page Title
    
 Test Page

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం.
దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో విస్తారంగా తెలపండి.
వచ్చే సంచికలో ప్రచురిస్తాము.
(Please leave your opinion)

పేరు(Name):

విద్యుల్లేఖ (Email):

అభిప్రాయం (Opinion):


 

గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)