ఆభయ మీయవే
మాకు శుభము చేయవే
లక్ష్మీ, సరస్వతి, పార్వతి
ముగురమ్మల అంశలతో
రామ తులసివి,కృష్ణ తులసివి
మా పెరటి వేలుపువై వెలసిన
శ్రీ మహాలక్ష్మివి
నీ దళములు విష్ణువుకి
ప్రియాతి ప్రియమై
ప్రియ జనార్ధనివై
మాధవ ప్రియ భామినిగా
కామితార్ధ ప్రదాయనిగా
మా ఆంగనములో పావనిగా
శుభకర పరిమళాలు విరజిమ్మే
మంగళ స్వరూపిణిగా
జయ హారతి గైకొనుమ
మా పాయసాన్న నైవేద్యములు స్వీకరించి
నీ దయతో మము కావుమ
సత్కృపతో మము బ్రోవుమ

























