రక్కాసులను సంపీనట్టీ రామన్నా, ఓహో
రక్కాసులను సంపీనట్టీ రామన్నా, ఓహో
మా అక్కారాలను తీర్చ నీవు రావయ్యా |ఏలైయ్యాల|
కొండామీదా రామయ్యా, కొండాదీగీ రావయ్య |8|
శాయి మనాప్రగడ గారు, తన తండ్రి స్వర్గీయ నరసింహ మూర్తి గారి నుంచీ వారసత్వంగా సంగీత స్వర సంపదను పొందారు. రేడియో లోనూ దూరదర్శన్ లోనూ అనేక సార్లు పాడారు. రాష్ట్రపతీ భవన్ లో జాతీయ సమైక్యతా అవార్డును పొందారు. కె.వి. మహదేవన్, ఇళయరాజాలకు రంగస్థలం పై కీ బోర్డ్ సహకారం అందించారు. కొన్ని సినిమాలకి కూడా సంగీత సహకారం అందించారు. అనేక వాణిజ్య ప్రకటనలకు కూడా సంగీత సహకారం అందించారు.