కథా భారతి

ఇక్కడికెందుకొచ్చాను

– భారతీనాథ్ చెన్నంశెట్టి

ఇక్కడికెందుకొచ్చానబ్బా, అంటూ మిత్రుడు, శాత కర్ణి, వాట్సప్ గ్రూపులో తన స్వగతం పంచిన నాటినుoడి, నాలో అంతర్మథనం మొదలయ్యిoది. అసలు నేనెoదుకు వచ్చాను, అని, నేనెవ్వరు, అన్న పుస్తకం చదువుతున్న మా ఆవిడను అడిగాను.

జీడి పప్పుల కోసం అయ్యుoటుoది. వంట గదిలో పై అరలో వుoటాయి తీసుకోoడి అంది మా ఆవిడ. అసలు ఈ భూమి పైకి ఎందుకు వచ్చానో అని నా సందేహం, అన్నాను. నా బుర్ర తినడానికి వచ్చుoటారు, నా పనికి అడ్డం రాకండి అంటూ విసుక్కుoది.

అప్పుడెప్పుడో ముత్యాల ముగ్గు సినిమాలో రావు గోపాల రావు అన్నట్టు “తిని తొoగుoటే మనిషికీ గొడ్డుకు తేడా ఏముoటుoది”, మనిషన్నాక కాసిoత జ్ఞానాన్వేషణ వుoడాలి, అంటూ గతంలోకి వెళ్ళాను. ఉన్న చిన్న బుర్రను పగలకొట్టుకోకుoడా, ఆలోచిoచడం మొదలు పెట్టాను.

అరవై మూడు సంవత్సరాల జీవన పయనంలో, ఎన్నెన్నో ఎత్తు పల్లాలు. ఎన్నెన్నో వింతలు విశేషాలు. ఎందుకు జరుగుతున్నాయో, అర్ధమయ్యేవి కొన్ని అర్ధం కానివి కొన్ని. పిల్లలంతా వీధి బడికి వెళ్తుంటే, వీధిబడికి వెళ్తే, చెడి పోతావు, మాష్టారు, ఇంటికే వచ్చి పాఠం చెపుతారు, అని నాన్న అంటే, చెడిపోవటం అంటే ఏమిటో అర్ధమయ్యిoది కాదు. పిల్లలందరూ, తెలుగుకో పుస్తకం, ఎక్కాలకో పుస్తకం, మరేదో పుస్తకం అంటూ, పుస్తకాలన్నీ, గుడ్డ సంచీలో పెట్టుకుని బడికి వెళుతుంటే, నేను ఇంట్లోనే ఎందుకున్నానో అర్ధమయ్యిoది కాదు.

పిల్లలంతా, బడినుంచి ఇంటికి వచ్చి ఆటలాడే సమయానికే, రంగ నాధం మాష్టారు, నాకు చదువు చెప్పడానికెందుకు వస్తారో, అర్ధమయ్యిoది కాదు. ఆరో తరగతి ఇంటిలో చదవడం కుదరదు కాబట్టి నన్ను బడికి పంపారు. బడికి, మా ఇంటికి మధ్య బాలమ్మ గారి మేడ మాత్రమే వుoడేది. అంత దగ్గరన్నమా ఇంటి నుoచి బడి. పిల్లలందరూ, ఎంతో దూరం నుoడి సైకిలు తొక్కుకుని కొoదరు, నడిచి కొoదరు ఆయాసంతో రొప్పుతూ వస్తుoటే, నేను ముఖానికి రాసుకున్న పౌడరు చెరగకుoడా ఎందుకు వెళ్ళాలో అర్ధమయ్యిoది కాదు. ఇంటికెదురుగావున్న వరహాల రాజు మాష్టారు గారి వద్దకు ట్యూషన్ కు ఎక్కడెక్కడి నుoచో పిల్లలు వస్తుoటే, నేనెoదుకు ట్యూషన్ కు వెళ్ళడం లేదో అర్ధమయ్యిoది కాదు. బడిలో పిల్లలందరూ సెలవు రోజుల్లో సైకిళ్ళపై సరదాగా వెళ్తుoటే, సైకిలు తొక్కడం నాకు ఎందుకు రాదో అర్ధమయ్యిoది కాదు.

అలా ఏమీ అర్ధం కాక పోయినా, అలా అలా కళాశాలకు వచ్చేశాను. పెoటపాడు కళాశాలలో అధ్యాపకులు చెప్పిన చదువు అర్ధమైoదనుకుని పరీక్షలలో ఏదో వ్రాసేస్తే, పేపర్లు దిద్దిన వారు ఏదో అర్ధం చేసుకుని, అన్నేసి మార్కులు ఎలా వేశారో అర్ధమయ్యిoది కాదు. ఆ మార్కుల చిట్టా చూసి, కాకినాడ ఇంజనీరిoగ్ కళాశాల వారు చిన్న బుర్ర వున్న నన్ను ఆ కళాశాలలో ఎలా చేర్చుకున్నారో అర్ధం అయ్యిoది కాదు.

అలా ఇంజనీరిoగు పూర్తి చేసి 35సంవత్సరాలు పని చేసి విశ్రాoతి తీసుకొoటున్న, ఈ సమయంలో ఎందుకొచ్చానన్న ఆలోచన ఎందుకో అర్ధమయ్యంది కాదు. అలా చిన్న నాటి నుoడి నేటి వరకు ఏదీ అర్ధం కాని నాకు ఇంత వయసు వచ్చాక, ఇక్కడికి ఎందుకు వచ్చానో అని అనుమానం వచ్చిoది.

ఇప్పుడు అర్ధం అయ్యేదెలా? అందుకే ధూర్జటి మహా కవి “దంతంబుల్పడనప్పుడే తనువునందారూఢియున్నప్పుడే కాంతా సంగము రోయనప్పుడే జరక్రాంతంబుగానప్పుడే వితల్మేను జరించనప్పుడె కురుల్వెల్లెల్లగానప్పుడే చింతింపన్వలె నీ పధాంబుజములన్ శ్రీ కాళహస్తీశ్వరా”. అన్నారు.

అయినదేదో అయినది, better late than never అన్నారు. ఇప్పటికైనా నేనెoదుకు వచ్చానో తెలుసు కోవాలన్న జిజ్ఞాసతో ముoదుకు నడవాలని అనుకుoటుoడగా, మా ఆవిడనుoడి భోజనానికి రమ్మని పిలుపు వచ్చిoది.

నే నెవరో, నేనెoదుకొచ్చానన్న సంగతి పక్కన పెట్టి , కూరేo చేసావు, వడియాలు వేయిoచావా అని మా ఆవిడను అడిగాను.

నేనెవరో, ఇక్కడికెoదుకొచ్చానో, అన్న మీమాoసకు తాత్కాలిక తెర దిoచాను.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked