కవితా స్రవంతి

కవిత

మాతా గంగా భవానీ శాంకరీదేవి

ధర్మ శీలవంతు ధారులే నందరు
అల్ప భోగపరులు ఆత్మబంధు
దానశీలా జనులు ధన్య మొందినవారు
రామపడమె జగతి రాజపధము

రామయనుచు నామ రాగ గీత మనగ
శిశువు నవ్వు కఠిన శిలలు కరుగు
మహిమ లెన్నో దాగె మహిమాన్వితంబగు
రామపదమె జగతి రాజపధము

రామచరణ స్పర్శ రాతి నాతిగా మార్చె
మాట శబరికిచ్చె ముక్తిపధము
దనుజుల దునిమాడి ధరణిని రక్షించె
రామపదమె జగతి రాజపధము

ఘోర పాప దోష కర్మలే మున్నను
రామనామ మనిన రాలిపోగ
భస్మమగును మనుజ భవబంధవిముక్తి
రామపడమె జగతి రాజపధము

***

Leave a Reply

Your email address will not be published. Required fields are marked