కవితా స్రవంతి

దానయ్య

-రచన:శ్రీధరరెడ్డి బిల్లా

దారిన పోయే దానయ్యా

ఒంటిగా సాగే దానయ్యా ,

బిత్తర చూపుల దానయ్యా ,

తత్తర పాటుల దానయ్యా !

చుట్టాల్లేరా దానయ్యా ?

పక్కాల్లేరా దానయ్యా ?

మిత్రుల్లేరా దానయ్యా ?

పెళ్ళామేదీ దానయ్యా ?

పిల్లలేరీ దానయ్యా ?

కన్నోరెవరు దానయ్యా ?

ఎవరూ లేరా దానయ్యా ?

దేవుడే దిక్కా దానయ్యా ?

ఆస్తులెన్ని దానయ్యా ?

అంతస్తులెన్ని దానయ్యా?

అప్పులెన్ని దానయ్యా ?

ఏమీ లేవా దానయ్యా ?

“దేహం వీడా, రామయ్యా!

ఆత్మను నేను, రామయ్యా!

పరమాత్మ కోసం, రామయ్యా!

పయనం కట్టా, రామయ్యా!”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked