సుజననీయం

సిసలైన తెలుగుతేజం

ప్రతి మనిషికి తన జీవితకాలంలో కొన్ని అరుదైన, అపురూపమైన సంఘటనలు ఎదురైతాయి. ప్రస్తుతం జగమంతా నిండిన తెలుగు వారికి అలాంటి సంఘటనే జూన్ 16న జరిగింది. అప్పటివరకు ప్రపంచంలోనే రెండవ పెద్ద కంపెనీగా వ్యవహరింపబడుతున్న ప్రఖ్యాత మైక్రోసాఫ్ట్ సంస్థకు సీఈవో గా ఉన్న సత్య నాదెళ్ళను బోర్డ్ ఆఫ్ డైరక్టర్స్ చైర్మన్ గా కూడా ఎన్నుకొన్నారు. ఈ రెండు పదవులను అలకరించిన మొదటి మనిషి ఆ సంస్థ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్. తెలుగువాడు ఈ స్థాయికి ఎదగడం మనందరికి గర్వకారణం. సత్యనారాయణ నాదెళ్ళకు సుజనరంజని అభినందనలు తెలుపుతున్నది.

అలాగే, తొంభై దాటి జీవిస్తే నూరేళ్ళు చేరుకున్నట్టే అన్నది నానుడి. అలా పరిపూర్ణంగా జీవించిన కారా మాస్టారు స్థాపించిన కథానిలయం తెలుగు కథలకు కేరాఫ్ అడ్రసుగా నిలిచింది. ప్రముఖ కవి సుధామ గారు సుజనరంజని సంపాదకురాలు తమిరిశ జానకి గారితో కాళీపట్నం రామారావు గురించి తమ జ్ఞాపకాలను పంచుకొన్నారు. సాహితీ వార్తలు శీర్షికలో తప్పక చదవండి.

– తాటిపాముల మృత్యుంజయుడు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked