శీర్షికలు

అమెరికా ఉద్యోగ విజయాలు

‘Intelligent behavior requires knowledge’. ఆ మాట రచనా వ్యాసంగానికి కూడా వర్తిస్తుంది. మంచి చదువులు చదివి, వివిధ స్థాయిల్లో అమెరికాలో అనుభవం గడించిన సత్యం గారు ఈ పుస్తకాన్ని ఆవేదనతో రాసానన్నారు. ఆవేదనలోంచి వచ్చినది ఏదైనా చదవటానికి ఆమోదయోగ్యమే.

‘ఉద్యోగం స్త్రీ, పురుష లక్షణం’ అన్నది నేటి నానుడి. కాలేజీలో పుస్తకాల్లో చదివేది పాతికవంతు మాత్రమే. మిగతా ముప్పాతిక బయట ప్రపంచంలోకి అడుగుపెట్టి, ఉద్యోగం చేస్తున్నప్పుడు నేర్చుకోవాలి. భదవద్గీత తరహాలో ‘కృష్ణ, అర్జున్ (బావ, మరది)’ మధ్య జరిగే సంభాషణల రూపమే ‘అమెరికా ఉద్యోగ విజయాలు ‘ పుస్తకంలో చెప్పబడ్డ చిట్కాలు. సత్యం గారు కృష్ణ (బావ) పాత్రలో పరకాయప్రవేశం చేసి తన అనుభవాన్ని రంగరించి అప్పుడే ఉద్యోగంలోకి అడుగిడుతున్న అర్జున్ (బావమరిది) చెప్పిన విజయసూత్రాలు పన్నెండు అధ్యాయాల్లో అగుపడుతాయి.

భారతదేశంలో కూడా ఇప్పుడు విదేశీ కంపెనీలతో ప్రైవేటురంగం అభివృద్ధి చెందుతున్నది కాబట్టి ఈ సూత్రాలు అక్కడ కూడా వర్తిస్తాయి. డిగ్రీ పుచ్చుకొని ఉద్యోగం మొదలెట్టాలని అభిలషిస్తున్న యువత తప్పక చదవలసిన పుస్తకమిది. పిల్లలకు టైం కుదరటం లేదంటే పెద్దలు చదివి పిల్లలకు టీ టైంలోనో, బయట నడకకు వెళ్ళినప్పుడో చెప్పినా చాలు. వారి విజయసోపానినికి మెట్లు చూపినవారు అవుతారు.

చివరిగా, ఈ పుస్తకంలోని ప్రతి అధ్యాయాన్ని చదివిన మొదటి పాఠకుణ్ణి నేను అనుకోవచ్చు. సిలికానాంధ్ర సంస్థ సుజనరంజని అంతర్జాల మాసపత్రికను ప్రచురణకు ఎంచుకొన్నందుకు సత్యం గారికి కృతజ్ఞతలు!

ఈ పుస్తకం eBook రూపంలో Kinige (India), Apple iBooks, Tolino, Rokuten Kobo, Baker & Taylor, Vivlio, SCRIBD, 24 Sympols, Overdrive, Bibliotheca మొదలగు వెబ్ సైట్లలో అందరికి అందుబాటులోకి రావాలనే ఉద్దేశంతో చాలా తక్కువ ధరకు లభిస్తుంది.

– తాటిపాముల మృత్యుంజయుడు
ప్రధాన సంపాదకుడు, సుజనరంజని, అంతర్జాల మాసపత్రిక

Leave a Reply

Your email address will not be published. Required fields are marked