దేవులపల్లి కృష్ణశాస్త్రి
(నవంబర్ 1, 1897 – ఫిబ్రవరి 24, 1980)
తెలుగులో భావకవిత్వమనగానే మొదట స్ఫురణకు వచ్చేది కృష్ణశాస్త్రి. నెత్తిపై గిరజాల జుట్టు, భుజంపై చెరగని కండువా భావకవిని వర్ణించటానికి ఉపయోగపడే చిహ్నాలుగా కూడా నిలిచాయి. వీరిని తెలుగు కవిత్వ ప్రపంచంలో ‘ఆంధ్రా షెల్లీ’ అని పిలవడం కూడా కద్దూ. భావకవిత్వంలో ప్రణయ, విరహ, విషాద, ఆత్మాశ్రయ మొదలగు రీతుల్లో కలకాలం గురుండీపోయే కవిత్వం రాసారు.
వీరి రచనలు అనగానే వెంటనే గుర్తుకు వచ్చేవి – అమృతవీణ, శ్రీ ఆండాళ్ళు తిరుప్పావు కీర్తనలు, మేఘమాల, కృష్ణపక్షము, ప్రవాసము, ఊర్వశి, దీపావళి, మహతి
వీరి గేయం ‘జయ జయ ప్రియభారత జనయిత్రీ దివధాత్రి ‘ ఇతర ప్రసిద్ధ దేశభక్తి గేయాలకు తీసిపోదు.