కవితా స్రవంతి

నీతి లేని…మానవ జాతి

🌷నీతి లేని…మానవ జాతి🌷

– కొప్పోలు యాదయ్య

ముక్కు పచ్ఛలారని పక్షుల నిష్కల్మష ప్రేమకు కుల బురద అంటింది
ఆ బురద ఎవరికి కనిపించదు ఆ బురద చూసే కళ్ళ దురదకు తప్ప..

ఆ బురద ఎన్ని రకాలుగా శుద్దిచేసుకున్నా, మూలాలు ఎదుటి వాడి మెదడులో దూలాలై
దూరినవి

జీవుల్లో మనిషి ఓ జంతువే
మరి ఏ జంతువుకు లేని కుల వర్గాలు ఈ మనషికే ఎందుకో..

ఒక రకం చెట్టు ఒకే రకమైన పళ్ళనిస్తవి.
ఒక జాతి పక్షులు ఒకే పద్ధతి న జీవిస్తాయి.
సృష్టిలో ప్రతి జీవి తమ జీవన ధర్మాలను పాటిస్తూ మనుగడ సాగిస్తున్నాయి

కానీ…
తెలివైన , మానవతా, నాగరిక జీవిగా చెలామని అవుతున్న మనిషికే
ఏ జీవన విధానం లేదు..

లేని కులాల మూఢత్వంలో ప్రకృతికి విరుద్ధంగా మనిషి కొత్త మృగమై రాక్షస
క్రీఢలో మానవతా విలువలను మంటగలుపుతున్నాడు

ఎవడో అంటించిన ఈ రంగుల రావణకాష్ట మనిషి రక్తం మాంసాలతో మండుతూనే ఉంది.
ఇది మానవ అనాగరిక రాక్షసత్వనికి పరాకాష్ట

****

Leave a Reply

Your email address will not be published. Required fields are marked