ధారావాహికలు

శ్రీ రామ సంగ్రహం

రావణుడి తాతతండ్రులు

-అక్కిరాజు రామాపతి రావు

సుకేశుడు ధర్మమార్గావలంబి అయినాడే కాని రాక్షస ప్రవృత్తినిస్వీస్వేకరించలేదు. గ్రామణి అనే గంధర్వుడు సుకేశుణ్ణి చూసి ఎంతో ముచ్చటపడి తన కూతురు దేవవతినిచ్చి అతడికి పెళ్ళి చేశాడు. సుకేశుడు దేవవతితో అభీష్టసుఖాలు పొందుతూ ఆనందంగా కాలం గడుపుతుండగా ఆ దంపతులకు క్రమంగా ముగ్గురు కొడుకులు పుట్టారు. వాళ్ళు ఆ సంతానానికి మాల్యవంతుడు, సుమాలి, మాలి అని పేర్లు పెట్టుకున్నారు. వాళ్ళు మహాదేవుడి వరప్రభావం వల్ల జన్మించారని ఆ తండ్రి ఎంతో మురిసిపోయినాడు. అయితే వీళ్ళకి తండ్రి తాతల సత్త్వగుణసంపద అబ్బలేదు. తమ తండ్రికి, శివానుగ్రహం ఉన్నదని తెలుసుకొని తాము కూడా అత్యంత బలపరాక్రమాలతో, లోకాలన్నిటినీ శాసించే శక్తిసామర్థ్యాలతో విలసిల్లాలని బ్రహ్మదేవుణ్ణి గూర్చి వాళ్ళు ముగ్గురూ ఘోరతపస్సు చేశారు. బ్రహ్మ ప్రత్యక్షమై వాళ్ళకు వారు కోరిన వరాలిచ్చాడు. ఇక వాళ్ళు అహంకరించి, తమకు ఎవరూ ఎదురు నిలవలేరన్న ఆటోపంతో లోకాలను భయపెట్టసాగారు. తపస్వులను, ఋషులను, దేవతలను నానాబాధలు పెట్టసాగారు. విఙృంభించి వీరవిహారం సాగించారు. లోకాలన్నిటినీ చికాకు పరిచారు. దేవతలు అందరూ కూడి వీళ్ళ ఆగడాలను గూర్చి పరమశివుడుకి మొరపెట్టుకొన్నారు. వీళ్ళ కండకావరాన్ని అణచి వేయవలసిందిగా ప్రార్థించారు. అప్పుడు మహాదేవుడు వాళ్ళ తండ్రిని అనుగ్రహించిన తాను ఇప్పుడు వాళ్ళను నాశనం చేయడం తగదనీ, ఆ పని తాను చేయలేననీ, వెళ్ళి విష్ణుమూర్తిని ప్రార్థిస్తే వాళ్ళను ఆయన శిక్షించగలడని దేవతలకు చెప్పాడు.

రాక్షస సంహారానికి దేవతలు శ్రీమహావిష్ణువును ప్రార్థించటం ఇక వాళ్ళు పరమశివుణ్ణి స్తుతించి, శ్రీమన్నారాయణుణ్ణి ఆశ్రయించటానికి వెళ్ళారు. దోసిలొగ్గి సుకేశుడి కొడుకుల వల్ల జరుగుతున్న లోకోపద్రవాన్ని ఆయనకు విన్నవించుకున్నారు. “ఈ రాక్షసులు లంకలో నివసిస్తూ లోకాన్నంతా భయవ్యాకులం చేస్తున్నారు. మాకు దిక్కుతోచడం లేదు. ‘దేవతలు-వాళ్ళు త్రిమూర్తులైనా, దిక్పాలుకులైనా మాకు లెక్కలేదు. వాళ్ళు మమ్మల్నేమీ చేయలేరు. మాపైకి యుద్ధానికి వస్తే వాళ్ళను చీల్చి చెండాడుతాము’ అని అహంకరిస్తున్నారు, విర్రవీగుతున్నారు మహాప్రభో! అని పరిదీనవదనులై ఈ రాక్షసుల బాధ మాకు తొలగించ వలసింద’ని విష్ణుమూర్తిని వేడుకున్నారు.

శ్రీమన్నారాయణుడు వాళ్ళకు అభయమిచ్చాడు. దేవతలు ఊపిరి పీల్చుకుని తమ నివాసాలకు వెళ్ళిపోయినారు. దేవతలు విష్ణుమూర్తిని ఆశ్రయించటం, వాళ్ళకు ఆయన అభయమివ్వటం రాక్షసులు విన్నారు. అందువల్ల వాళ్ళకు దేవతలపై మరింత కసి పెరిగింది. క్రూరంగా దేవగణాలను శిక్షించాలనుకున్నారు. తమ దుశ్చర్యలు మరింత తీవ్రతరం చేశారు. రాక్షసులకు విష్ణువుపై ఇంతింతనరాని కోపం ఇదివరకు ఉండనే ఉంది. అది ఇప్పుడు కట్టలు తెంచుకుంది. ‘నముచి, కాలనేమి, హిరణ్యకశిపుడు, శుంభనిశుంబులు లాంటి మహా వీరాగ్రేసరులైన రాక్షసులను ఈ హరి ఇదివరకే సంహరించాడు. ఇక మనను తుదముట్టించే యత్నంలో ఉన్నాడిప్పుడు’ అని మాల్యవంతుడు తమకు ముంచుకొని వస్తున్న ప్రమాదం గూర్చి చెప్పాడు. అప్పుడు తమ్ములు విర్రవీగుతూ అన్నకు తమ అజేయమైన తోడ్పాటు గూర్చి చెపుతూ ఆ విష్ణువును “ముందుగా మనపట్ల పగ పెంచి విష్ణుమూర్తిని ప్రేరేపించిన ఆ దేవతలను నాశనం చేద్దా’మని నిశ్చయించారు.

ఆ శిశువు ఆకలితో పెద్దపెట్టున ఏడవటం సాగించాడు. వాడి పుణ్యమేమో ఆ సమయంలో పార్వతీపరమేశ్వరులు విలాస విహారయాత్ర చేస్తూ నందివాహనులై ఆకాశంలో వెళుతున్నారు. శిశువు రోదన విని శివుడు కరుణతో అక్కడ దిగి ఆ బిడ్డను ఎత్తుకున్నాడు. పార్వతికి చూపి వీణ్ణి నీ కుమారుడిగా చూసుకోవసిందని చెప్పాడు. పరమశివుడు అనుగ్రహించి ఆ శిశువుకు సద్యోయౌవనం అనుగ్రహించాడు. ఆ పిల్లవాడికి వాళ్ళు సుకేశుడు అని నామకరణం చేశారు. ఆ పిల్లవాణ్ణి సంరక్షించిన ప్రేమతో అతడికి కామగమనం గల ఒక విమానం కూడా శివుడు అనుగ్రహించాడు. స్వేచ్చగా విహరించాల్సిందని ఆ సుకేశుణ్ణి కరుణించాడు కూడానూ. వాడికి దేవత్వమిచ్చాడు. ఆ సుకేశుడికి ఇంద్రపదవి అబ్బినంత ప్రభావం కలిగింది. దేవతలు కూడా అతణ్ణి అభిమానించసాగారు. సంతోషంతో యథేచ్చగా సంచారం చేస్తూ సుకేసుడు అప్పుడప్పుడు శివుణ్ణి దర్శిస్తూ ఆ మహాదేవుడికి ప్రీతిపాత్రుడైనాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked