రచన: విద్వాన్ శ్రీమతి జి సందిత, అనంతపురము
(సహస్ర కవిరత్న సహస్రకవిభూషణ గురజాడ జాతీయవిశిష్ట సాహితీ సేవా పురస్కార గ్రహీత)
తెలుగురాష్ట్రాన్నెవరో
ముక్కలు చేశారంటారేంటి?
కళ్ళుంటే చూడండి….
రాష్ట్రాన్నేలే ఏలిక తెలంగాణా చంద్రన్న
గురువుపాదంపై నుదురానించి మ్రొక్కి…
రాష్ట్రాల్నేకాదు
ఉత్కృష్టాంధ్రభాషాప్రపంచాన్నే
ఏకంచేస్తున్నాడిక్కడ!
నన్నయాదికవుల్ని
ఈ ఏడాదికి బ్రతికున్న కవులతో కలిపి
పరభాషా వ్యామోహపు పులికి
బలియైపోతున్న తెలుగులిపిని
కోట్లాదిగుండెల్లో నిలిపి పలికించి ..
తెలుగుతల్లి పలుకుల్ని విలువల్ని
బ్రతికిస్తున్నాడిక్కడ!
ప్రజాసమస్యల్ని పరిష్కరిస్తూనే
ఆకాశవాణి హైద్రాబాద్సాక్షిగా
తెలుగుసమస్యాపరిష్కారాల్ని
సంధిస్తున్నాడిక్కడ !
స్వార్థంకోసం ఆస్తులకోసం
అన్నదమ్ములే శత్రువులై
దాయాదుల్ని చంపుకునే ….
కురుక్షేత్రాన్నికాదు
తెలుగుకోసం ..భాష అస్థిత్వం కోసం
సోదరులందరెేకమై
ఆత్మీయతల్ని నింపుకునే…
సంయుక్తాంధ్రసాహిత్యక్షేత్రాన్ని
సృష్టించాడు తెలుగన్న
తెలంగాణా చంద్రన్న
సందడిచేద్దాం రారన్నా !!
(ప్రపంచ తెలుగు మహా సభలు హైదరాబాదు లో జరుగుతున్న సందర్భంగా ఈ కవిత …తెలుగు తెలంగాణా నేత కె.సి .యార్ .వారి కి అంకితం)