Month: March 2017

రచనలకు ఆహ్వానం

విజ్ఞప్తి
పాఠక మహాశయులకు సాదర ఆహ్వానం!! మీలోని రచయిత ఎప్పుడైనా నిదురలేచి కొత్త ఆలోచనలు కలిగిస్తున్నాడా?? మీలోని భావుకుడు ఎప్పుడైనా సుందర స్వప్నాలను చూపిస్తున్నాడా?? మీలోని విప్లవకారుడు నవ సమాజం అంటూ ఉవిళ్ళూరుతున్నాడా?? మీలోని పరిశొధకుడు ఎవరికీ తట్టని అంశాలను అప్పుడప్పుడూ అయినా విప్పిచెబుతున్నాడా?? ఐతే ఇంకేం ఇక మీరు కలం చేపట్టాల్సిందే!! మీలాంటి వారి కోసం, మీ రచనల కోసం సుజనరంజని పలుకుతున్న ఆహ్వానం! మీ కథ /కవిత /వ్యాసం ఇలా యే రచన అయినా పరిశీలనకు sujanaranjani@siliconandhra.org కు RTS పధ్ధతిలో కానీ లేక యూనికోడ్ తెలుగు ఉపయోగించి కానీ పంపండి.సుజనరంజని విలువలకు, ఆశయాలకు దగ్గరగా ఉన్న రచనలకు పెద్ద పీట వేస్తాం. సుజనరంజని వివిధ అభిప్రాయాలకు వేదిక. మీ వంతు కొత్తదనం నింపండి.

పాఠకుల స్పందన

పాఠకుల స్పందన
Response to: response to january2017 patakulaspandana Name: సాగర్ల సత్తయ్య City: నల్లగొండ Message: పత్రిక చాలా బాగుంది. అన్ని అంశాలు చదివించేవిగా ఉంటున్నాయి. ధన్యవాదములు Response to: response to january2017 katha4 Name: Dr.V.Ramana rao City: visakhapatnam Message: manishiki kavalasinadi manavatvam , toti manushulanu premichatam, preminchatam chetakakpote kanisam toti manishi laga chudatam. such subrata peruto manassanta murike. e rojullo rayavalasina kadha kadu. pillaki kavalsinavi samakurchakunda vettichakiri ela cheyinchu kuntaru. katha baledu. Response to: response to january2017 annamayya Name: Dr.V.Ramana Rao City: visakhapatnam Message: annamayya padalaki sariyaina bhavamu vyakta parachatam kastam. e keertana lo ekkuva grandhika padalu levu. unnavatini sulabha

బాలగేయాలు – కోకిలమ్మా! ఓ కోకిలమ్మా

బాలానందం
- డా||వాసా ప్రభావతి కోకిలమ్మా! ఓ కోకిలమ్మా గున్నమామిడి కొమ్మపై ఒయ్యారంగా కూర్చుని కోటిరాగాలతో పాడుతావు నీ పాట మాకు నేర్పుతావా? నీవు పాడినంత తీయగా మేము పాడగలమా? నీ పాటను అనుకరిస్తే గొంతు చించుకు పాడుతావు? మా మీద కోపమేలా? నీలా మామిడిచిగురులు తిందామనుకుంటే చిగురులన్నీ చిటారుకొమ్మకున్నాయి కొమ్మను అందుకుందామంటే ఆకాశం ఎత్తున ఎదిగిపోయింది చిన్న పిల్లలమని చిన్నచూపు చూడక చిగురులు కోసి మాకిచ్చావంటే నీతో సమానంగా పాడేస్తాం! సంవత్సరానికి ఒకసారి వస్తావూ? వసంతుని వెంట వెడలి పోతావు? పెద్దవాళ్ళము మేమైతే గున్నమామిడి ఎక్కేస్తాము గుప్పిట్లో నిన్ను దాచేస్తాము
చిత్రరంజని – ప్రశాంతత

చిత్రరంజని – ప్రశాంతత

చిత్ర రంజని
- చిత్రకారిణి: రషీద కజీజి చూడగానే మనసుకు ఉపశమనం కలిగించే నీలి రంగుతో క్రమశిక్షణ, సమతుల్యం ప్రదర్శిస్తూ పేర్చబడిన రాళ్లు ఏక్రిలిక్ రంగులతో కాన్వాస్ పై వేసిన చిత్రమిది.

అందెశ్రీ

జగమంత కుటుంబం
గత డిసెంబర్ నెలలో హైద్రాబాదులో జరిగిన పుస్తక ప్రదర్శనలో తెలంగాణ రాష్ట్రగీతాన్ని రచించిన అందెశ్రీ ని తాటిపాముల మృత్యుంజయుడు కలుసుకొన్న చిత్రం. అలాగే, ఆ గీతాన్ని కూడా కింద చదవండి.

వీక్షణం – సాహితీ గవాక్షం – బే ఏరియా వీక్షణం సాహితీ సమావేశం- 54

వీక్షణం
- నాగరాజు రామస్వామి వీక్షణం 54వ సమావేశం ఫిబ్రవరి 12, 2017 నాడు శ్రీ చుక్కా శ్రీనివాస్ గారి స్వగృహమున జరిగింది. ఈ సమావేశమునకు శ్రీ పిల్లలమఱ్ఱి శ్రీ కృష్ణ కుమార్ గారు అధ్యక్షత వహించారు. మొదటి వక్త శ్రీ ఉప్పలూరి విజయ కుమార్ గారు. వారు గత 40 సంవత్సరాలుగా పలు కథలు, నవలలు వ్రాసానని తెలిపి, 30 సంవత్సరాల క్రితం పల్లకీ పత్రికలో ప్రచురితమైన తమ కథ "లోపలి మనిషి" అనే కథను చదివారు. అంటరానితనమును ప్రశ్నిస్తూఒక వ్యక్తి తనలో అంతర్గతంగా ఉన్న అంటరానితనాన్ని ప్రశ్నించుకునే ఈ కథ అందరినీ ఆకట్టుకుంది. తరువాతి కార్యక్రమం శ్రీ నాగరాజు రామస్వామి గారి రవీంద్రుడి గీతాంజలికి తెలుగు అనువాదం "గీతాంజలి" పుస్తకావిష్కరణ. మొదటి సమీక్షకులు శ్రీ వేణు ఆసూరి గారు. వారి ప్రసంగ విశేషములు "ఈ గీతాంజలి చదువుతున్నప్పుడు నేను మూలాన్ని కాని, మరో అనువాదాన్ని కాని ప్రక్కన పెట్టుకుని పోల్చి చూడలేదు. నాగస్వామిగారి రచనను ఒక సరిక

సంగీతరంజని – శ్రీ రామదాసు కీర్తనల్లో సీతమ్మవారి ప్రస్తావన

శీర్షికలు
- శ్రీమతి ఎమ్‌.వి.కమలారమణి ఈ తెలుగు నేల మీద, మన మధ్య నడయాడిన మహనీయ వాగ్గేయకారుడు 'శ్రీ భద్రాచల రామదాసు.' రామదాసు గొప్ప రామభక్తుడు. సీతారామచంద్రులను తల్లిదండ్రులుగా ఎంచి, ఆయన ఆలపించిన ప్రతి కీర్తనలో భక్తి-జ్ఞాన-వైరాగ్యాలు, శ్రవణ-కీర్తన-స్మరణము వంటి నవవిధ భక్తిరసాలు ఉట్టిపడుతూ ఉంటాయి. రామదాసు కీర్తనల్లో సీతమ్మవారి ప్రస్తావనను మనము రెండు విధాలుగా చెప్పుకోవచ్చు. 1. సీతమ్మవారిని నామ ప్రధానంగా గల రచనలు. 2. సీతమ్మవారిని ఉద్దేశించి రచించిన కీర్తనలు. నామ ప్రధానంగా యనిన సీతాపతి యని, సీతానాయకయని, సీతాసమేతయని, సీతారమణ యని, సీతాహృదయ విహౄరయని, సీతారామస్వామి మొదలయిన పదాల రచన. ఇంకా, నినుబోనిచ్యెదనా సీతారామా! జైజై సీతారాం! భద్రాచలమందు సీతతో మెరయుచున్న రాముడు! యను వాక్యరచన. ''రావణ సంహారంలో సీతను పాలించిన'' అని 'సీతమ్మకు చేయిస్తి చింతాకు పతకము' అని ఇంకా ఒక విశేషమైన కీర్తన అనియు 'ఆశపుట్టెనే శ్

పంచాంగం

శీర్షికలు
Click here to download in pdf format / పి.డి.ఎఫ్. ఫార్మాట్ లో పొందుటకు ఇక్కడ క్లిక్ చేయండి   పంచాంగ కర్త : బ్రహ్మశ్రీ మారేపల్లి వెంకట నాగ శాస్త్రి గారు