Month: May 2017

సంగీత పాఠాలు

శీర్షికలు
సేకరణ: డా.కోదాటి సాంబయ్య సంగీత ప్రాశస్త్యం : న నాదేనా వినా గీతం న నాదేన వినా స్వరః | న నాదేన రాగస్త స్మా నాదాత్మకం త్రయం || గీతము, స్వరము, రాగము ఈ మూడూ నాదాన్ని విడిచి ఉండలేవు. మామూలుగా మనం వ్యవహారం లో వినే ధ్వనులను చప్పుడు అంటాము. ఈ చప్పుడుకూ సంగీత ధ్వనికీ చాలా భేదం ఉంది. ఒక వస్తువు ఒక సెకండులో ఎన్నిసార్లు కంపిస్తుందో ఆ సంఖ్య ఆ వస్తువు యొక్క పౌనఃపున్యం అంటారు. సంగీత ధ్వనుల పౌనః పున్యం ప్రతి సెకండు కూ ఒకే విధంగా ఉంటుంది. అందుకే ఆ ధ్వనులను ఎంతసేపు విన్నా ఇంకా వినాలని అనిపిస్తుంది. చప్పుడు ధ్వని తరంగం ప్రతి సెకను సెకండు కూ మారుతుంటుంది. అందుకే ఆ ధ్వనులను వింటుంటే చెవులు మూసుకుంటాము. సంగీత ధ్వనులకు మూడు ప్రత్యెక లక్షణాలు ఉన్నాయి...అవి. 1. పిచ్ : పౌనః పున్యం పెరిగితే పిచ్ పెరిగింది అంటాము. షడ్జం కంటే రిషభం పౌనః పున్యం ఎక్కువ...రిషభం కన్నా గాంధారం పౌనః పున్యం ఇంకా ఎక్కువ.

అన్నమయ్య శృంగార నీరాజనం

సారస్వతం
- టేకుమళ్ళ వెంకటప్పయ్య నాయికలలో వయస్సును, కౌశలాన్ని బట్టి "ప్రౌఢ" అనే నాయికను సాహిత్య దర్పణము "స్మరాంధా గాఢ తారుణ్యా సమస్త రతికోవిదా/భావోన్నతాదరవ్రీడా ప్రగల్భా క్రాంత నాయకా" అని పరిచయం జేస్తుంది. అనగా స్మరాంధురాలు, సంపూర్ణ యౌవనము గలది, శృంగారచేష్టలు గలది, కొంచెం సిగ్గు గలిగి నాయకుని వశపరచుకొన్న స్త్రీ అని అర్ధము. ప్రౌఢకు ప్రగల్భ అని నామాంతరము గలదు. ఒక ప్రౌఢ నాయికతో చెలికత్తెలు ఈ క్రింది కీర్తనలో ఎలా మేలమాడుచున్నారో గమనించండి. ఎంత మనసెరిగిన నాయికవైనా ఇంత అతిచనువు పనికిరాదు నీకు, ఆ కుప్పిగంతులేమిటి? ఆ మొరటుదనంతో ప్రవర్తించడమేటి? హవ్వ. ఇది నీకు తగునా? అని చనువుగా అమ్మను మందలిస్తున్నారు. కీర్తన: పల్లవి: ఇల్లాలికిఁ దగునటే యింత రట్టడితనము వొల్లనే మితిమేరతో నొనగూడవలదా చ.1. రవ్వలుగా నవ్వేవు రతికిట్టె లాచేవు చివ్వన పతిముందర సిగ్గువడవు వువ్విళ్లూరఁ జన్నులను వూఁదేవాతని వీఁపున ఇవ్

వీక్షణం 56వ సమావేశం

వీక్షణం
-సుభాష్ పెద్దు వీక్షణం 56వ సమావేశం ఏప్రిల్ 9, 2017 నాడు మిల్పిటాసు లోని అనిల్ రాయల్ గారి ఇంటిలో జరిగగింది. ఈ సమావేశానికి శ్రీ పెద్దింటి తిరుములాచార్యులు గారు అధ్యక్షత వహించారు. అధ్యక్షుల వారు ముఖ్య అతిథిగా ప్రముఖ కథా, నవలా రచయిత్రి, టీ.వీ సీరియల్ రచయిత్రి శ్రీమతి బలభద్రపాత్రుని రమణి గారిని సభకు ఆహ్వానించి ప్రసంగించవలసినదిగా కోరారు. బలభద్రపాత్రుని రమణి గారి ప్రసంగ విశేషాలు - "నేను 7, 8వ తరగతులలో ఉన్నప్పుడు కథలు వ్రాయటం మొదలుపెట్టాను. ఒకసారి ఒక పత్రికకు కథ పంపిస్తుంటే మా అన్నయ్య బల్ల కొట్టి మరీ చెప్పాడు, ఈ కథను ప్రచురించరు అని. ఆ కథ ప్రచురించబడటమే కాకుండా పలు ప్రశంసలకు కూడా పొందింది. అద్రక్-కె-పంజే వంటి నాటికలు, చలం గారి రచనలు, ముఖ్యముగా "దైవమిచ్చిన భార్య" మొదలైనవి నన్ను ప్రభావితం చేశాయి. నన్ను ప్రోత్సహించిన వారు ఎందరో. వారిలో ముఖ్యులు శ్రీ యండమూరి వీరేంద్రనాథ్ గారు.

సలలిత రాగ సుధారస సారం

కథా భారతి
-ఆర్. శర్మ దంతుర్తి లోపలకి వస్తున్న బాలమురళీని చూస్తూ ఇంద్రుడు ఆసనం మీద నుంచి లేచి "రండి, రండి" అంటూ అహ్వానించేడు. అక్కడే ఉన్న నారద తుంబురులూ, అప్సరసలూ కూడా నవ్వుతూ ఆసనం చూపించేక అందరికీ నమస్కారం పెట్టి చుట్టూ చూసేంతలో నారదుడి కంఠం వినిపించింది, "ఇంతకాలం అద్భుతంగా భూలోకంలో సంగీతాన్ని పంచిపెట్టిన మీకు స్వాగతం. ఇప్పుడెలా ఉంది సంగీత కళ భూలోకంలో? త్యాగరాజుల వారు మొదలుపెట్టిన సంగీత యజ్ఞం బాగా సాగుతోందా?" బాలమురళీకి ఏమనాలో తోచలేదు. వచ్చిన ఐదు నిముషాల్లో ఇక్కడంతా ఏమీ పూర్తిగా పరిచయం అవకుండానే నారదుల వారు తనని క్రాస్ ఎగ్జామినేషన్ చేస్తున్నారప్పుడే. బాలమురళీ ఏమీ సమాధానం చెప్పకపోవడంతో ఈ సారి తుంబురుడు అడిగేడు, "త్యాగరాజ స్వామి ఆరాధనా, ఉత్సవాలు బాగా జరుగుతున్నాయని వింటున్నాం. ఆయన పంచిచ్చిన సంగీత సుధ, ఆ రాములవారి అనుగ్రహంతో అలా నిరాటంకంగా సాగుతోందా?” ఇంద్రుడికేసీ అక్కడ సభలో అందరికేసీ చూశాడు బాల
అక్రిలిక్ పేయింటింగ్స్ వేసిన చిత్రం

అక్రిలిక్ పేయింటింగ్స్ వేసిన చిత్రం

చిత్ర రంజని
- రషీద కజీజీ (Rashida Kajiji) మార్చి నెలలో వుమెన్స్ డే జరుపుకొన్నాము. మే నెల 9న అమెరికాలో టీచర్స్ డే, అలాగే 14న మదర్స్ డే వస్తున్నాయి. స్త్రీ చేస్తున్న సేవలను కొనియాడుతూ ఉజ్జ్వల (Bright) పసుపు వర్ణం నేపథ్యంలో చతురస్రాకార కాన్వాసుపై అక్రిలిక్ పేయింటింగ్స్ వేసిన చిత్రం.

మనకేం కావాలి?

సారస్వతం
- దీప్తి కోడూరు మనం రోజూ చేసే పనులు, ఆలోచనలు, తీర్మానాలు, నిశ్చయాలు అన్నీ క్రోడీకరించి చూసుకుంటే మనందరం 3 అంశాల కోసం ఆరాటపడుతుంటాము అని అర్ధమైపోతుంది. కొన్ని ఉదాహరణలు పరిశీలిస్తే మనమే అవేంటో తెలుసుకోవచ్చు. ఒకడు ఒక అమ్మాయిని గాఢంగా ప్రేమిస్తున్నాడు. వాడికి ఆ అమ్మాయి తప్ప మరో లోకం లేకుండా బతికేస్తున్నాడు. వాడిని, "నీకు ఏం కావాల్రా?" అని అడిగితే ఏం చెప్తాడు. ప్రతిక్షణం తన ప్రియురాలి చెంత గడిపేస్తే చాలు అంటాడు. ఎందుకు రా? అంటే అదే నాకు గొప్ప సంతోషాన్ని ఇస్తుంది అంటాడు. సరే మరొకడు ఉన్నాడు. వాడికి రాజకీయాలంటే ఇష్టం. నీకేం కావాలిరా అనడిగితే, "నాకు ఫలానా పదవి కావాలి అంటాడు" వాడు నిజాయితీపరుడైతే, పదవులు ఎందుకు రా అంటే "నేను అందరికంటే గొప్ప పనులు చేసే అవకాశం వస్తుంది. అందరికీ సహాయం చేయగలను. దాని వల్ల అందరూ నన్ను గౌరవంగా చూస్తారు. ఆ తృప్తి చాలు నాకు." అంటాడు. అలాగే ఇంకొకడు వ్యాపారం చేసుక

స్త్రీ జాతి

కవితా స్రవంతి
(డాǁ. దోముడాల ప్రమోద్,సంస్కృతి సమితి, అల్మాస్ గూడ, హైదరాబాద్) స్త్రీ జాతి, స్త్రీ జాతి, ఇది మన స్త్రీ జాతి | స్త్రీ జాతి, స్త్రీ జాతి, ఇదే మన గొప్ప స్త్రీ జాతి || సృష్టికి మూలం సర్వ శ్రేష్టి స్త్రీ | వంశాభివృద్ధికీ మూలం సర్వాంతర్యామి స్త్రీ || సంసారానికి మూలం సర్వ శక్తి స్త్రీ | సుఖ సంతోషాలకు మూలం స్వర్ణ సుందరి స్త్రీ || స్త్రీ జాతి, స్త్రీ జాతి, ఇది మన స్త్రీ జాతి | స్త్రీ జాతి, స్త్రీ జాతి, ఇదే మన గొప్ప స్త్రీ జాతి || ఇల్లును కళకళలాడించేది అమ్మాయీ | సోదరులను కలిపి ఉండేది సోదరి || తల్లితండ్రులను కాపాడేది కూతురు | అందరికీ ఆనందము పంచేది వనిత || స్త్రీ జాతి, స్త్రీ జాతి, ఇదే మన స్త్రీ జాతి | స్త్రీ జాతి, స్త్రీ జాతి, ఇదే మన గొప్ప స్త్రీ జాతి || కల్యాణానికి కావలసింది కన్య | ఉత్సవాలకు మంగళం నిచ్చేది మహిళ | పెళ్ళికి అందం పెళ్ళికూతురు | వరుణికి ఆనందం వధువు | అందరికీ

విశ్వామిత్ర 2015 – నవల ( 11వ భాగము )

ధారావాహికలు
– యస్. యస్. వి రమణారావు శివహైమ ని డ్రాప్ చేసి గెస్ట్ హౌస్ కి వచ్చాడు అభిషేక్. తాజ్ లో డిన్నర్ చేస్తుండగా తెలిసిన రెండు విషయాలు అతన్ని అశాంతికి గురిచేశాయి.అవి రెండు టెలిఫోన్ కాల్స్ కి సంబంధించినవి.మొదటి కాల్ రఘురామ్ నుంచి వచ్చినది.రెండవది శివహైమకి వచ్చిన కాల్."మూడో మనిషిని పంపించడం ఇష్టం లేక నేనే వెళ్ళాను.నీ కానిస్టేబుల్ ఇంకొక ఇద్దరు ఎక్సైజ్ కానిస్టేబుల్స్ తో కలిసి జగదాంబ జంక్షన్ దగ్గరున్న ’జానీహార్స్’ బార్ కి వెళ్ళాడు.అక్కడ వాళ్ళు చాలాసేపు మాట్లాడుకున్నారు.అదంతా నాపెన్ కెమెరాతో రికార్డ్ చేశాను.నేను రికార్డింగ్ మొత్తం చూడలేదు క్వాలిటి చెక్ చేయడానికి అక్కడక్కడ చూశాను. శివహైమ,విశ్వామిత్ర అన్న పేర్లు బాగా వినపడ్డాయి.మధ్యలో మన సిటి మునిసిపల్ కమీషనర్ శివకుమార్ పేరు కూడా వినపడింది.నీకా పెన్ను మా కానిస్టేబుల్ తో సీల్డ్ కవర్ లో పంపిస్తున్నాను.ప్లీజ్ కీప్ ద పెన్ ఏస్ మై గిఫ్ట్"అంతా విని కానిస్

అనుభూతి – ప్రాచీన దృక్పథం (4- భాగం)

సారస్వతం
– సునీల పావులూరు ఈ పంచకోశాల ద్వారా కలిగే సంపూర్ణమైన అనుభూతే సమగ్రానుభూతి. ఒక్కొక్క కోశం ద్వారా ఒక్కొక్క విధమైన అనుభూతి కలుగుతుంది. ఆ అనుభూతి పాక్షికంగా ఉంటుంది. సమాజం పాక్షికానుభూతిని కాకుండా సమగ్రానుభూతిని కాంక్షిస్తోంది. అనుభవం మానవసమాజానికి మూడు రకాలుగా అందించబడుతోంది. శాస్త్రపరంగానూ, తత్త్వపరంగానూ, కవిత్వపరంగానూ అనుభవ ఏకసూత్రత జరుగుతోంది. “భూమిమీద మనిషి అడుగు పెట్టినప్పట్నించీ తన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని అర్థం చేసుకోవటానికీ, ఈ ప్రపంచంతో సంధానం (adjustment) కుదుర్చుకోవటానికీ ప్రయత్నిస్తున్నాడు. ప్రపంచాన్ని అర్థం చేసుకోవటమంటే విభిన్నమైన ప్రాపంచిక అనుభవాల్లో ఏకసూత్రతని సాదృశ్యాన్ని సాధించటమన్నమాట. ఈ ప్రయత్నం శాస్త్రం ద్వారా, తత్త్వం ద్వారా, కవిత్వం ద్వారా మూడు విధాలుగా సాగింది. భౌతిక సంఘటనల్లో ఏకసూత్రతని సాధించటానికి శాస్త్రం పూనుకుంది. వివిధ శాస్త్రాలకు చెందిన భౌతిక సూత్రా

జ్ఞాన భూములు

సారస్వతం
మన దేశ సంస్కృతి అంతా గంగానదితో పెనవేసుకొని ఉంది. గంగకు ఎగువున ఉన్న హిమాలయాలను దేవభూములు అని, గంగానది పర్వతాలనుండి మైదానాలకు వచ్చిన ఋషీకేశ్, హరిద్వార్ లను జ్ఞానభూములు అని, ఇంకా గంగకు దిగువ ప్రాంతమంతా కర్మభూమి అని పరిగణిస్తారు. శివుని జటాజూటం నుండి బయలు వెడలి భగీరధుని వెంట ప్రయాణించిన పాయను భాగీరధి అంటారు. ఇది గంగోత్రి వద్ద గోముఖం ద్వారా బయటకు వస్తుంది. గంగోత్రి నుండి ఋషీకేశ్ కి వచ్చే దారిలో 5 ప్రయాగలు (సంగమ స్థానాలు) ఉన్నాయి. (1) విష్ణుప్రయాగ వద్ద అలకనంది దౌళీగంగతో కలిసి ముందుకు సాగి (2) నంద ప్రయాగ వద్ద నందాకినితో కలిసి సాగుతుంది. (3) కర్ణ ప్రయాగ వద్ద పిండారినదితో కలిసిన అలకనంద (4) రుద్ర ప్రయాగ వద్ద భాగీరధితో కలుస్తుంది. ఇక నుండి గంగానదిగా పిలవబడుతూ, ఋషీకేశ్ ను చేరుతుంది. ఇక్కడ గంగానది రెండు కొండల మధ్య యిరుకైన దారిలో పరవళ్ళు తొక్కుతూ 30కి||మీ|| ముందుకు సాగి హరిద్వార్ వద్ద సమతుల ప్రదేశం