Month: May 2017

ఆధ్యాత్మిక అహంభావం

సారస్వతం
-శారదాప్రసాద్ (టీవీయస్.శాస్త్రి) ఈ మధ్య నాకు తెలిసిన ఒక మిత్రుడు ఒక ఆధ్యాత్మిక గ్రంధాన్ని పోస్ట్ లో పంపించాడు.దానికొక రచయిత(?) కూడా ఉన్నాడు. ఆ గ్రంధంలోని విషయాలన్నీ ప్రాచీన గ్రంధాలలోని విషయాలను ఏర్చి కూర్చినవి.ఆ శ్లోకాలను వ్రాసిన వారు పరమ పురుషులు,అద్వైత సిద్ధాంత ప్రవచకులు,సాక్షాత్తు శంకర స్వరూపులు.అలా ఏర్చికూర్చిన గ్రంధానికి 'రచయిత ' అని పేరు పెట్టుకోవటం ఆది శంకరులకు ద్రోహం చేయటమే!దీనినే ఆధ్యాత్మిక అహంభావం అని అనవచ్చు.జ్ఞానం వలన అహంభావం పెరిగే అవకాశం ఉన్నదని మరొకసారి తెలుసుకున్నాను.మనసు ఎలాగైతే సృజనాత్మక దృష్టితో సృష్టి చేయగలదో, అలాగే అదే మనసుకు నసింపచేసే శక్తికూడా ఉన్నదని 'జ్ఞానయోగం'ద్వారా తెలుసుకొనవచ్చును.అన్నీ నాకే తెలుసు అని అనుకోవటం అహంకారం,అజ్ఞానం.నాకు తెలిసింది తక్కువ, తెలుసుకోవలసింది ఇంకా ఎక్కువ ఉంది అని అనుకోవటం 'జ్ఞానం'.ఈ అజ్ఞానపు చీకటిలో పడిన ఇంకా చాలామంది ఆధ్యాత్మికవేత్తలు మ

అనుకోని ఆనందం

కథా భారతి
రచయిత్రి : ఇందిరామూర్తి ఏమండీ, ఏం? ఏం ఆలోచిస్తున్నారింకా? లేవండి, లేచి బట్టలు మార్చుకొని మీ తమ్ముడింటి కెళ్ళండి. ఆయనో పెద్ద ఉద్యోగస్థుడుగా! ఆమాత్రం సాయం చేయడని, నేననుకోను. అదికాదు లలితా! నేను పెద్దవాణ్ణి. వాడి అవసరాలకు నేను నిలబడాలి గానీ వాడిముందు చేయిచాపడం న్యాయంకాదు. అబ్బా! అవన్నీ చింతకాయ సిద్ధాంతాలు. వాటిని పట్టుకు కూర్చుంటే జరిగేదేమీ వుండదు. న్యాయాలు, ధర్మాలు నడిచినన్నాళ్ళే. సోది ఆపి బయలుదేరండి. మీరిట్లా తెమల్చకపోతే అవతల పాడైపోయేది పిల్లాడి జీవితం. ఇదుగో ఒకటే చెప్తున్నా నా మనసంగీకరించడం లేదే. అమ్మానాన్న లేకున్నా ఎంతో అన్యోన్యంగా ఉంటున్నాం అందరం. ఇప్పుడీ అప్పు ప్రస్థాపన తెచ్చి, వాడిచ్చ్జ్హినా నాకు అవమానంగానే ఉంటుంది. చిన్నవాడి దగ్గర అడిగానేనని. లేదన్నాడా, అది మరీ బాధ, మనస్ఫర్థలకు బీజం పడినట్లవుతుందే కుటుంబాల మధ్య ఆలోచించు. ఆలోచించి చేసేది ఏమీలేదు. ఏమన్నా కానీ, నాకొడుకు అ
శ్రీరామాయణ సంగ్రహం – యుద్ధకాండ

శ్రీరామాయణ సంగ్రహం – యుద్ధకాండ

ధారావాహికలు
– డా. అక్కిరాజు రమాపతిరావు “అన్నా! నీవు పితృవాక్య పరిపాలన రూపమైన సన్మార్గం అవలంభించి, జితేంద్రియుడవై ఉన్నా నిన్ను ధర్మం ఆపదలనుండి కాపాకలేకపోతున్నది. కాబట్టి ఆ ధర్మం నిష్ప్రయోజనం. లోకంలో స్థావరాలు (చెట్లు, కొండలు మొ.), జంగమాలు (పశువులూ, మనుషులూ మొ.) కనపడినట్లు ధర్మాధర్మాలు కనపడటం లేదు. కాబట్టి ధర్మాధర్మాలనేవి లేనే లేవు. అధర్మమే వాస్తవానికి ఉండవలసివస్తే రావణుడివంటి అధార్మికుడు కష్టాలపాలు కావాలి. నీవంటి ధార్మికుడికి కష్టాలే రాకూడదు.రావణుడికి ఆపదలు రాకపోవాటాన్నీ, నీకు కష్టాలు రావటాన్నీ పరిశీలిస్తే - అధర్మం, ధర్మఫలాన్నీ, ధర్మం అధర్మఫలాన్నీ ఇస్తున్నట్లు అనిపిస్తుంది. అధర్మమే ఆచరించేవారికి సంపదలూ, ధర్మాన్నేఆచరించేవారికి కష్టాలు కలగటాన్ని బట్టి ధర్మాధర్మాలు నిష్ఫలాలు. ఉన్నదో లేదో తెలియని, అది ఉత్తమఫలాన్నే ఇస్తుందనే నిశ్చయం లేని ధర్మాన్ని పట్ట్టుకొని పాకులాడేకంటే దాన్ని విడిచి పెట్టటమే మంచిది అనుక