Month: July 2017

నక్షత్రాలు

నక్షత్రభౌతిక శాస్త్రం (Astrophysics) భౌతిక శాస్త్రం (Physics) లో ఒక శాఖ. భౌతిక శాస్త్రానికి, నక్షత్రభౌతిక శాస్త్రానికి మధ్య మౌలికమైన తేడా ఒకటి ఉంది. భౌతిక శాస్త్రంలో వాదం (theory), ప్రయోగం (experiment) అని రెండు భాగాలు ఉంటాయి. ఉదాహరణకి ఆదర్శ వాయు సూత్రం, (Ideal gas law) PV = kT ఉంది. ఈ సూత్రం నిజమేనని ఋజువు చెయ్యాలంటే మనం ప్రయోగశాలలో కూర్చుని, ఒక గాజు బుడ్డిని వాయువుతో నింపి, ఆ బుడ్డిని వేడి చేసి, ఆ బుడ్డి ఎంత వేడెక్కిందో, లోపల పీడనం ఎంత పెరిగిందో, వగైరాలు కొలిచి ఇటో ఆటో తేల్చి చెప్పవచ్చు. శాస్త్రంలో ప్రయోగ ఫలితానిదే పై చెయ్యి. ఒక వేళ ప్రయోగంలో నమోదు అయిన విలోకానాంకాలు (readings) PV = kT అనే సమీకరణంతో ఏకీభవించలేదని అనుకుందాం. అప్పుడు మనం మన సమీకరణాన్ని (అనగా, మన వాదాన్ని, మన నమ్మకాన్ని, మన నమూనాని) మార్చాలి కానీ ప్రయోగం తప్పు అని దబాయించకూడదు. నక్షత్రభౌతిక శాస్త్రంలో నక్షత్రాలతో ప్రయోగం

చంద్రశేఖర్ చరిత్ర-విద్యాభ్యాసం

సుబ్రహ్మణ్యన్ చంద్రశేఖర్ (19 అక్టోబరు 1910 - 21 ఆగస్టు 1995) అవిభక్త భారత దేశపు పంజాబ్ లోని లాహోర్ నగరంలో సీతాలక్ష్మి కి చంద్రశేఖర సుబ్రహ్మణ్యన్ అయ్యర్ కి పుట్టిన పదిమంది పిల్లలలో మూడవ బిడ్డ, ప్రథమ మగ సంతానం. (తమిళులు తండ్రి పేరుని మొదటి పేరుగా వాడతారు; రెండవ పేరు పెట్టిన పేరు.) వారి వంశ వృక్షంలో చదువులకి, ప్రత్యేకించి వైజ్ఞానిక పరిజ్ఞానానికి, పెద్ద పీట పడడానికి ముఖ్య కారకుడు చంద్రశేఖర్ పితామహుడైన రామనాధన్ చంద్రశేఖర్. ఈయన విశాఖపట్నం లోని మిసెస్ ఏ.వి.ఎన్. (అంకితం వెంకట నరసింగరావు) కళాశాలలో గణితం బోధించే ఆచార్యుడుగా పనిచేసేడు. చంద్రశేఖర్ పుట్టిన ఏటనే ఈ పితామహుడు స్వర్గస్తుడవడంతో, ఆయన రచించిన, సేకరించిన, గణిత గ్రంథాలన్నింటికి చంద్రశేఖర్ వారసుడయ్యాడు. వాటిని జీవితాంతం చంద్రశేఖర్ తన దగ్గర భద్రపరచుకున్నాడట. రామనాధన్ పిల్లలలో జ్యేష్ఠుడు చంద్రశేఖర సుబ్రహ్మణ్యన్; ఈయనే మన కథానాయకుడయిన చంద్రశేఖర్

చంద్రశేఖర్ చరిత్ర ‘చుక్కల్లో చంద్రుడు’

వేమూరి వేంకటేశ్వరరావు తొలిపలుకు రామ కథ రావణుడితో ముడిపడి ఉంది. రావణుడు లేకపోతే రామాయణమే లేదు. రావణుడు మాత్రం సామాన్యుడా? అసమాన్య ప్రతిభావంతుడు. చివరికి రావణుడిని పడగొట్టింది అతని అహంకారం. చంద్రశేఖర్ కథ ఎడింగ్టన్ తో ముడిపడి ఉంది. ఎడింగ్టన్ లేకపోతే చంద్రశేఖర్ కథ మరొకలా ఉండి ఉండేదేమో! ఎడింగ్టన్ మాత్రం సామాన్యుడా? అసమాన్య ప్రతిభావంతుడు. అతను జాత్యహంకారంతో తనని పడగొట్టడానికి ప్రయత్నం చేసేడని చంద్రశేఖరే అభియోగం చేసేడు; అయినా చిట్టచివరి వరకు ఎడింగ్టన్ యెడల గౌరవభావం సడలనివ్వ లేదు. చంద్రశేఖర్ పేరు మొట్టమొదట నేను అమెరికా వచ్చిన కొత్తలో, 1961 లో, విన్నట్లు జ్ఞాపకం. అంతకు పూర్వమే విన్నానేమో, చెప్పలేను. అమెరికా వచ్చి మూడు నెలలు అయింది. డిసెంబరు నెలలో, సెలవులకి, అన్నయ్య దగ్గరకి రాచెస్టర్ వెళ్లేను. అప్పుడు చాల విషయాల మీద చాల కబుర్లు చెప్పుకున్నాం. మా కబుర్లలో అప్పటికి అమెరికాలో సజీవంగా ఉన్న ముగ

వీక్షణం-58వ సమావేశం

వీక్షణం
-పొట్లూరి చాయాదేవి నేటి సమావేశం లోని ముఖ్యాంశాలు:- ఈ సమావేశానికి శ్రీ మేకా రామస్వామి గారు ఆహ్వానం పలుకుతూ సాహితీ ప్రపంచానికి ఎల్లలు లేవని అన్నారు. తెలుగు భాష తీగలు భువనమంతా పాకాయని, వాటిని కాపాడవలసిన బాధ్యత ప్రతీ తెలుగు వారికి ఉందని తెలిపారు. శ్రీమతి కాత్యాయనీ విద్మహే గారు మరాఠీ అనువాదం "మా బతుకులు" అనే పుస్తకం గురించి విశ్లేషణ చేసారు. తను ఎక్కువగా సాహిత్యంలో స్త్రీల సమస్యల పై స్పందిస్తానని అన్నా రు. స్త్రీల రచనలు సేకరించడం తన బాధ్యతగా భావించానని అన్నారు. సాహిత్యంలో స్త్రీల రచనల పట్ల అసమానతలున్నాయని, వాటిని రూపుమాపాలని, స్త్రీలు తమ రచనలలో తమ అభిప్రాయాలని స్వేచ్ఛగా పొందుపరుస్తారని అన్నారు. స్త్రీల రచనల్లో ఆత్మ కథలు, స్వీయ చరిత్ర లు బహు తక్కువని, అందులో ఒకటి మహారాష్ట్ర లో 1965 లో దళిత మహిళ సమాజంలో అనుభవించిన బాధల సమాహారమే "మా బతుకులు" నవల అన్నారు. మా బతుకులు నవల మరాఠీ భాషలో 1980 లో స్త్రీ

విశ్వామిత్ర 2015 – నవల ( 12వ భాగము )

ధారావాహికలు
– యస్. యస్. వి రమణారావు శివహైమ మాత్రం చాలా ప్రశాంతంగా హాయిగా నిద్రపోయింది.నిద్రపోయేముందు సెల్ లో రికార్డ్ చేసిన అభిషేక్ తనకోసం పాడిన పాటను సంతోషంగా మళ్ళీ మళ్ళీ వింటూ హాయిగా నిద్రపోయింది. తెలిసీ మొదలవ్వలేదే ముహూర్తం నే పెట్టలేదే అన్ని ఆలోచనలకన్నా ముందే ఇది మొదలవుతోందే మెరుపే మనిషయ్యిందా నవ్వుల్లో ముత్యాలే చిమ్మిందా నా మనసే మేఘమయ్యింది వర్షమై నీ చుట్టే కురిసింది కడిగిన ఆ ముత్యాలన్నీ ఇక నావే వెలకట్టలేని ఆ హృదయం ఎన్నడూ ఇక నాదే It's not infatuation It will never reach saturation It's not an exaggeration give me visa to the land of LOVE Nation (తెలుగమ్మా, తెలుగులో పాడు) ఇది మోహం కాదే ఎడబాటోర్వలేనే అతిశయోక్తి కానేకాదే రాణి ముద్ర వెయ్యవా ప్రేమదేశానికే రాజుని చేస్తూ నీ హృదయ ప్రపంచాన్నే ఏలనా చక్రవర్తినై ప్రేమపతాకాన్నే ఎగరవేస్తూ మర్నాడుపొద్దున్నఇంకానిద్రలేవకుండానే

భక్తి వ్యసనంగా మారకూడదు!

సారస్వతం
(కార్టూన్ సౌజన్యం --మిత్రుడు శ్రీ రామకృష్ణ గారు) -శారదాప్రసాద్(టీవీయస్.శాస్త్రి) ​నాకొక మిత్రుడున్నాడు.నా కన్నా వయసులో చాలా చిన్నవాడే!24 గంటలూ భక్తి టీవీ చూస్తుంటాడు.అన్ని భక్తి కార్యక్రమాలకు వెళ్లుతాడు. వివిధ యాత్రాస్ధలాలు చూస్తుంటాడు. కుటుంబం కోసం కన్నా ఎక్కువ కాలాన్ని భక్తి కార్యక్రమాలకు కేటాయిస్తాడు. అడ్డూ, అదుపు లేకుండా ధనాన్ని భక్తి కార్యక్రమాలకోసమే విపరీతంగా ఖర్చు చేస్తాడు.ఎన్నో గ్రంధాలను కొంటాడు.నిజానికి అతనొక మధ్యతరగతి కుటుంబీకుడు. పైకి రావలసిన పిల్లలున్నారు.కుటుంబ బాధ్యతలను సరిగా నిర్వహించలేక పోతున్నాడేమోననిపిస్తుంది!ఒక్కొక్కసారి తాదాత్మ్యం చెంది ,"నాకు శివుడిలో లీనం కావాలనిపిస్తుందని అంటాడు!శివైక్యం చెందని జీవితం వృధా" అని అంటాడు. నిజం చెబితే బాధపడుతారేమో కానీ ఇవన్నీ histrionic లక్షణాలు. సాధారణంగా ఈ లక్షణాలు ఆడవారిలో ఎక్కువగా ఉంటాయి. దేవుడికి హారతి ఇచ్చేటప్పుడు కూడా చాలామంది

అన్నమయ్యకు ఆరాధనా నివాళి 

సారస్వతం
- దీప్తి కోడూరు  భగవంతుని గుణకీర్తనం చేసి తరించిన భక్తులు ఎందరో మన దేశంలో ఉద్భవించారు. వీరినే భక్త కవులంటారు. భక్త కవుల గురించి సుదీర్ఘ వివరణలు చెప్పుకునేకంటే ఒక్క సంఘటనను స్మరిస్తే వారి అంతరంగం స్పష్టమవుతుంది. ఒకనాడు ఒక భక్తురాలు భగవాన్ శ్రీ రమణ మహర్షి వద్ద ఇలా అడిగింది,"నాయనా త్యాగయ్య అన్నమయ్య రామదాసు వీరంతా గానం చేసి తరించారు కదా! అది అందరికీ సాధ్యమవుతుందా?" అని. దానికి మహర్షి చిన్న చిరునవ్వుతో ఇలా జవాబిచ్చారు, "అమ్మా వారంతా గానంతో తరించలేదే, తరించాకే ఆ అనుభవాన్ని గానం చేశారు. " ఒక మహాత్ముని అంతరంగాన్ని ఇంకొక మహాత్ముడు తప్ప సామాన్యులు ఎలా అర్ధం చేసుకోగలరు?!! మీరాబాయి, గోదాదేవి, అక్కమహాదేవి, అన్నమయ్య, త్యాగయ్య, రామదాసు, పురందరదాసు, తులసీదాసు, కబీరుదాసు, నామదేవుడు, రామానందుడు, సూరదాసు, బసవన్న, అల్లమప్రభువు, రవి దాసు, తుకారాం , చైతన్య ప్రభు చెప్పుకుంటూ పోతే మన దేశంలో మహానుభావులు ఉదయించ

అనుభూతి – ప్రాచీన దృక్పథం (5వ- భాగం)

సారస్వతం
– సునీల పావులూరు వ.క్ర. ప్రవృత్తి కోశం అనుభూతి 1 ఇంద్రియచైతన్య ప్రవృత్తి అన్నమయకోశం వాస్తవికానుభూతి 2 భావచైతన్య ప్రవృత్తి మనోమయకోశం కాల్పనికానుభూతి 3 జ్ఞానచైతన్య ప్రవృత్తి విజ్ఞానమయకోశం జ్ఞానానుభూతి 4 జీవచైతన్య ప్రవృత్తి ప్రాణమయకోశం పూర్ణచైతన్యాంశం 5 ఆధ్యాత్మికచైతన్య ప్రవృత్తి ఆనందమయకోశం తాత్త్వికానుభూతి “ఈ అయిదు కోశాలద్వారా పొందే అనుభవం సమాజంలో ఉంది. దానితో సహజీవనం చేయటం సామాజిక జీవితం; ఆ సహజీవనంలో వ్యక్తి సహజ ప్రవృత్తికి శక్తిగా వ్యక్తమౌతాడు. సామాజికానుభూతిని రికార్డుచేసే సాత్త్వికసాధనం మనిషి. రికార్డుచేసి ఊరుకుంటే సామాజికుడు. దాన్నే ఉద్దీపనం చ్బెసి సాహిత్యరూపంగా అభివ్యక్తీకరిస్తే రచయిత. సమాజంలో భుక్తమౌతున్న అనుభ

కవివరేణ్యుడు, సాహితీ దురంధరుడు – సినారే

సుజననీయం
- తాటిపాముల మృత్యుంజయుడు కవిత్వమంటే కర్రుమొనలోంచి మట్టి పలికినట్టుండాలి చెమట ఆవిరిలోంచి మబ్బుపట్టినట్టే ఉండాలి కరీం నగర్ జిల్లా హనుమాజీపేట వ్యవసాయ కుటుంబంలో జన్మించిన సింగిరెడ్డి నారాయణరెడ్డి (సినారె) తన కవిత్వంలో కూడ మట్టి వాసనను ఆఘ్రాణించాడు. పాఠశాల విద్యాభ్యాసం ఉర్దూ మీడియంలో జరిగిన సినారె కు చిన్నప్పుడు ఊళ్ళో జరిగే హరికథలు, ఒగ్గుకథలు విని, ప్రదర్శనలు చూసి తెలుగుభాష మధురిమలకు ఆకర్షితుడైనాడు. రాస్తూ రాస్తూ పోతాను సిరా ఇంకే వరకు పోతూపోతూ రాస్తాను వసుపు వాడే వరకు అంటూ కవిత్వమే తన ఊపిరిగా చేసుకొని చివరి క్షణం వరకు బతికాడు. గురువులు, ఆచార్యులు ఖండవల్లి లక్ష్మీరంజనం, దివాకర్ల వెంకటావధాని వంటి దిగ్గజాల మెప్పు పొంది, పాఠాలు, పరిశోధనలచే అధ్యాపక వృత్తికి వన్నె తెచ్చి, గేయాలు, గజళ్ళు, గ్రంథాలు రాసి పాఠకుల అభిమానాన్ని చూరగొని, పాటలతో ప్రేక్షకలోక అభిమానాన్ని సంపాదించి, రాష్ట్ర,