Month: August 2017

మనబడి వార్తలు

మనబడి
ఉత్సాహభరితంగా మనబడి పిల్లల నాటకోత్సవం సిలికానాంధ్ర మనబడి బాలల నాటకోత్సవం అనే మరో అద్భుతానికి తెరతీసింది. ప్రవాస బాలలకు తెలుగు నేర్పించడమే కాకుండా మన సంస్కృతిని అలవరిచే క్రమంలో మరో అద్భుత ఆవిష్కరణ ఇది. ఎంతో ప్రఖ్యాతమైన నాటిక అనే కళాప్రక్రియను బాలలకు పరిచయం చేయడం ద్వారా, ఆ ప్రక్రియ భవిష్యత్తు ఉజ్వలంగా మారుతుందనే ఉద్దేశ్యంతో ఉన్న మనబడి విద్యార్ధులకు ఈ నాటిక పోటీలు నిర్వహించింది. ముందుగా ప్రాంతాల వారిగా ఆన్ లైన్(అంతర్జాలమాధ్యమం) ద్వారా వచ్చిన నాటికలను పరిశీలించి, జాతీయపోటీలకోసం క్యాలిఫోర్నియా రాష్ట్రంలోని మిల్పీటస్ నగరానికి వివిధ ప్రాంతాల నుంచి విద్యార్ధి బృందాలను ఆహ్వానినిచింది మనబడి. మిల్పీటస్ లోని సిలికానాంధ్ర విశ్వవిద్యాలయ డా. హనిమిరెడ్డి లకిరెడ్డి భవనంలోని వేదికపై వివిధ ప్రాంతాలనుంచి వచ్చిన మనబడి విద్యార్ధి బృందాలు చేసిన నాటక ప్రదర్శనలు అందరినీ అలరించాయి. ముద్దు ముద్దుగా వారు పలుక

సోమరిగుఱ్ఱం

బాలానందం
- అఖిలాశ చరణ్ గంట నుండి కార్టూన్స్ చూస్తున్నావు. హోం వర్క్ చేశావా? అని తల్లి అడగగానే..చరణ్ లేదుఅమ్మ మర్చిపోయాను. చేయి నొప్పిస్తూ ఉందిఅని తన సోమరితనాన్ని బయట పెడతాడు.తల్లి జ్యోతి త్వరగా హోం వర్క్ చేస్తే నీకు ఒక మంచి కథ చెప్తాను అంటుంది.హోం వర్క్ అయిపోగానే తల్లి కథ చెప్పడం మొదలు పెట్టింది. ఒక ఊరిలో సోము అని వ్యక్తిఉండేవాడు.ఆయన ఉప్పు వ్యాపారం చేసేవాడు. ఆయనకు ఒక గుర్రం ఉండేది.రోజూ ఉప్పు మూటలు కట్టి నది అటువైపుకు తీసుకెల్లి అమ్మడానికి గుర్రం వినియోగించేవాడు.ఒక రోజు ఉప్పు మూటలు గుర్రంకి కట్టి నది అటువైపు వేసిరా నేను మరో రెండు మూటలు కట్టి వెనకే వస్తాను అంటాడు.గుర్రం సరే అని రెండు ఉప్పు మూటలు తీసుకు వెళ్తూ కాలు జారి నదిలో పడుతుంది.మూటలలో ఉన్న ఉప్పు కరిగిపోతుంది.ఒడ్డుకు వచ్చిన గుర్రం బరువు తగ్గింది అని గమనించి రోజూ ఇలాగే చేస్తే నేను ఎక్కువ బరువు మోయ వలసిన అవసరం లేదు అని మనసులో అనుకుంటుంది.సోము ఉప

శ్రీరామాయణ సంగ్రహం – యుద్ధకాండ

ధారావాహికలు
లక్ష్మణమూర్ఛ తరువాత రావణుడి చేతిలో ఉన్న మహాధనుస్సును బాణప్రయోగంతో ముక్కలు చేశాడు లక్ష్మణుడు. మహావేగంతో రథం మీది నుంచి కిందికి దూకి శక్యాయుధాన్ని విభీషణుడి మీదికి విసరివేశాడు రావణుడు. ఆ శక్త్యాయుధం విభీషణుణ్ణి తాకే లోపునే లక్ష్మణుడు మూడుబాణాలతో ఆశక్త్యాయుధాన్ని నిర్వీర్యం చేశాడు. అది మూడుముకలైంది మరొక ప్రబలాతిప్రబలమైన శక్త్యాయుధాన్ని దేవేంద్రుడి వజ్రాయుధంలాంటిదాన్ని యమదండం వంటిదాన్ని విభీషణుడిపైకి విసరబోతున్నాడు రావణుడు. విభీషణుడి ప్రాణా పాయకారస్థితి చూసి లక్ష్మణుడు అడ్డుపడ్డాడు. రావణుడిపై సందులేకుండా లక్ష్మణుడు శరప్రయోగం చేస్తుంటే, రావణుడు శక్త్యాయుధాన్ని లక్ష్మణుడిపై ప్రయోగించాడు. అది లక్ష్మణుడు పైకి వచ్చి పైబడపోతుండగా రాముడు దానినీ కట్టడి చేయబోయే లోపలనే లక్ష్మణుడి వక్షస్థలాన్ని తీవ్రంగా తాకింది. ఆదెబ్బకు లక్ష్మణుడు కిందపడి మూర్చిల్లాడు. దగ్గరలోనే ఉన్న రాముడు లక్ష్మణుడి దుఃస్థితి చూశాడు