Month: December 2017

అష్టవిధ నాయికలు – కలహాంతరిత

సారస్వతం
- టేకుమళ్ళ వెంకటప్పయ్య కలహాంతరిత అనే నాయికకు నాట్యశాస్త్రంలో "ఈర్యాకలహనిష్క్రాన్తో యస్యా నాగచ్ఛతి ప్రియః|సామర్షవశసంప్రాప్తా కలహాన్తరితా భవేత్||” అని నిర్వచనం చెప్పబడినది. అనగా "కలహేన అంతరితా వ్యవహితా అర్థాత్ ప్రాణనాథతః" అంటే "కలహమువల్ల ప్రాణవల్లభునితో ఎడబాటుకు గురియైనది" అని కలహాంతరితా శబ్దమునకు వ్యుత్పత్తి ఉన్నది. ఈ కలహము అనేది రోషము లేక ఈర్ష్యాసహనములచేత కలుగవచ్చును. ఇట్టి మనఃస్థితి అన్యకాంతానురక్తుడైన నాయకుని విషయంలో సాధారణముగా సహజము. తనచే కోపించబడి, దూషించబడి, దూరమైన నాయకునిగూర్చి చింతించుచు, తన చర్యకు తాను పశ్చాత్తాపము నొందుచు ఉన్న నాయికను కలహాంతరిత అంటారు. "అమరుకశతకం" లోని శ్లోకము ఒకటి ‘కలహాంతరితకు చక్కని ఉదాహరణగా చెప్పబడినది: "చరణపతన ప్రత్యాఖ్యాన ప్రసాద పరాఙ్ముఖే/నిభృతకితవాచారేత్యుక్తే రుషాపరుషీకృతే|వ్రజతి రమణే నిఃశ్వస్యోచ్చైః స్తనార్పితహస్తయా/నయనసలిలచ్ఛన్నా దృష్టిస్సఖీషు నిపాతితా

జ్యోతిష సారము

సారస్వతం
- Murali Vadavalli ‘నువ్వు జ్యోతిషం నేర్చుకోవడం మొదలుపెట్టి ఎన్నేళ్ళయ్యింది?’ ‘పాతికేళ్ళు’. ‘ఈ పాతికేళ్ళలో ఏమి నేర్చుకున్నావో స్థూలంగా చెప్పగలవా?’ ‘తప్పకుండా. నేను తెలుసుకున్నవాటిలో నిజంగా పనికొచ్చేది ఒక్కటే ఉంది. అది తెలుసుకున్నాక ఇక జ్యోతిషంతో పనిలేదని కూడా తెలిసింది.’ ‘అలాగా, అదేమిటో కాస్త చెప్పుదూ.’ ‘అలాగే, విను. జ్యోతిషమంటే జనసామాన్యంలో ఉన్న అభిప్రాయమేమిటంటే, దాన్ని ఉపయోగించి మన జీవితంలోని కష్టనష్టాల్నీ, వాటికి పరిష్కారాలనీ, అలాగే సుఖపడే యోగాలనీ, అవి కలిగే సమయాన్నీ తెలుసుకోవచ్చని. ఈ వివరాలన్నీ చాలా ఖచ్చితంగా తెలుసుకోవచ్చని. నేను మొదటగా గ్రహించినదేమిటంటే, ఈ అభిప్రాయం కొంతమటుకు నిజమే కానీ, కేవలం శాస్త్రాన్ని అధ్యయనం చెయ్యడం వల్ల ఖచ్చితమైన వివరాలు తెలుసుకోవడం సాధ్యం కాదని. ఉదాహరణకి, ఒకాయన వచ్చి మా అబ్బాయికి పదో తరగతిలో లెక్కల్లో ఎన్ని మార్కులు వస్తాయో జాతకం చూసి చెప్పగలరా అ

వీక్షణం సాహితీ గవాక్షం -63

వీక్షణం
రచన : అన్నే లెనిన్ నవంబరు 12, 2017 న ఫ్రీమౌంట్ లోని శ్రీ పిల్లలమఱ్ఱి కృష్ణ కుమార్ గారింట్లో ఆద్యంతం రసవత్తరంగా జరిగింది. శ్రీ మృత్యుంజయుడు తాటిపామల అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమంలో ముందుగా శ్రీ పాడుగు శ్రీ చరణ్ "రఘువంశ ప్రశస్తి" లోని కొన్ని శ్లోకాలను టీకా తాత్పర్య సహితంగా ఉదహరిస్తూ అత్యంత రమణీయంగా ఉపన్యసించారు. 17 సర్గల రఘువంశ చరిత్రను సూక్ష్మంగా వివరించారు. దిలీపుడు, సగరుడు, భగీరధుడు, హరిశ్చంద్రుడు గొప్పవారైనా రఘువు పేరు మీదుగానే వంశం వర్థిల్లడానికి కారణాలు వివరించారు. మల్లినాథ సూరి గారి సంజీవని వ్యాఖ్యా విశేషాల్ని, కాళిదాసు, పోతన పద్య సారూప్యతలను వివరించారు. తరువాత శ్రీ క్రాంతి శ్రీనివాసరావు "ఆధునిక కవిత్వం" అనే అంశం మీద ఉపన్యసిస్తూ సాహితీ సభల లోని రకాలను హాస్యస్ఫోరకంగా వివరించారు. తాను ఇంతవరకు పాల్గొన్న సభలన్నిటిలో వీక్షణం ప్రత్యేకమైనదని అభిమానాన్ని వ్యక్తం చేసారు. నన్నయ్య చెప్ప

ఫ్రెంచ్ లీవు

కథా భారతి
- ఆర్ శర్మ దంతుర్తి డాక్టర్ ఆఫీసులోంచి బయటకొచ్చి గుమ్మం మెట్లు దిగేడు మూర్తి. మనసంతా చిరాగ్గా ఉంది. ఈ మెడికల్ రిప్రజెంటేటివ్ ఉద్యోగం వచ్చిన అయిదేళ్లలో తనని తన ఏరియా మేనేజరూ ఆ పైన రీజినల్ మేనేజరూ మాటిమాటికీ చంపుకు తినడం తనకి తెలుస్తూనే ఉంది. ఈ ఉద్యోగం అంతే. ఎంత కాళ్ళీడ్చుకు తిరిగినా ఎప్పుడూ అలా తనని దెప్పుతూ ఉంటారు ఇంకా బాగా చేయాలనీ, ఏదో చేయలేదనీ. రెణ్ణెళ్ల కోసారి అలా మీటింగ్ మిషతో ముంబయి లాంటి పెద్ద సిటీలకి తిప్పినా అక్కడ కాన్ఫరెన్స్ రూములో తమకి వేసే అక్షింతలు బయటకి కనపడవు కనక తమకి బాగానే ఉంది జీవితం అనుకుంటూ ఉంటారు మామూలు జనం, కుటుంబాలూను. వేరే ఉద్యోగం వస్తే ఈ దరిద్రం లోంచి తప్పుకోవడానికి ఎవరు సిద్ధంగా లేరు? అంతవరకూ ఎందుగ్గానీ ఇప్పుడే తాను మాట్లాడిన డాక్టర్ ఊర్లో పేరొందిన సర్జన్ గారు. తమ కంపెనీ మందు గురించి ఒక బ్రోషర్ చూపించి చెప్తూంటే ఆయన ప్రశ్న వేసాడు. సర్జన్ గారు ఏమడుగుతాడో ఎలాగరా అను