Month: March 2018

అన్నమయ్య శృంగార నీరాజనం

సారస్వతం
శృంగార దూతికలు -టేకుమళ్ళ వెంకటప్పయ్య దూతికలు అనగా రాయబారులు. నాయకుని తరఫున నాయికతో, నాయిక తరఫున నాయకునితో శృంగార దూతకార్యం నెరపడానికి నియోగించే వారు. అన్నమయ్య వీరిని రాయబారపు పడతి, చెలికత్తె అంటాడు. అలంకార శాస్త్రాలలో దాసి, సకియ, దాది, నటి, పొరుగమ్మ, యోగిని, చాకలి, చిత్రకర్మ చేయు స్త్రీలు దూతికలుగా వ్యవహరిస్తారని ఉన్నది. ఇంకా తాంబూలమమ్మే స్త్రీలు, వంటకత్తెలు, గానము మరియూ నాట్యము నేర్పే స్త్రీలు దూతికలుగా వ్యవహరించిన సందర్భాలు ఉన్నాయి. శ్రీకృష్ణుడు రుక్మిణీదేవి కి పారిజాత పుష్పం ఇచ్చిన సందర్భంలో అలాంటి దూతికయే సత్యభామకు విషయం చేరవేసింది. ఆ దూతిక చెప్పిన మాటలవలన కోపించిన సత్యభామను శ్రీకృష్ణుడు ఎంతో బ్రతిమాలవలసి వచ్చింది. చివరకు స్వర్గలోకంపై యుద్ధం ప్రకటించవలసి వచ్చింది. శ్రీ వేంకటేశ్వరస్వామి పద్మావతీ అమ్మవారితో సంధాన సందర్భంలో స్వామి ఎరుక వేషాన్ని ధరించడం తెలిసిందే గదా! ఆమెకూడా ఒక దూతికయే.

నేను

కవితా స్రవంతి
- కారుణ్య కాట్రగడ్డ పెదవుల నవ్వుల వెనుక భారమైన హృదయాన్ని మోస్తున్న రెండు పాదాల గాయాలను అనుభవాలుగా మార్చుకుని కొన్ని క్షణాలైన విశ్రమించాలని అలసిన దేహం మనసులోకి జారిపోయి నవ్వుకుంటూనే ఉంది వేదనగా కలల కాన్వాసు పై గీసిన చిత్రం నిశ్శబ్దం ఆలపిస్తున్న సరిగమలు చీకట్లోకి జారిపోతున్న జీవితం వెంటాడుతున్న ఒంటరితనం అంతరంగంలో ఆగని అంతర్యుద్ధం! బాధతో జారుతున్న కన్నీళ్లు బంధంతో ముడి వేసిన సంకెళ్లు అంతర్ముఖంగా ఆగిన పాదాలకు జీవం పోసుకుంటూ నిన్నటి నిస్పృహ నుండి వెలుగును వెతుక్కుంటూ జీవితాన్ని నిర్మించుకోవడంలో ఓటమి గాయాన్ని గుండెలో దాచుకుని గెలుపు దారుల్లోకి ఆశ నిరాశల గాలిపటంలా గమ్యం తెలియని ఒంటరి ప్రయాణం తీరాల మధ్య నిశ్శబ్దం ఘనీభవించినట్టు ఒక్కోసారి మనసు సముద్ర తరంగమౌతుంది పొగిలి పొగిలి ఏడ్చినా పొంత నిండని మనసు అలసిన దేహాన్ని కుట్టుకుంటూ అతికించుకుంటూ ఆశల తీరం వైపు అడుగేస్తూ ప్రతి

మనబడి బాలానందం

బాలానందం, మనబడి
విళంబి నామసంవత్సర ఉగాది సందర్భంగా, మీ అందరికీ శుభవార్త! "మనబడి బాలానందం", రేడియో కార్యక్రమాన్ని, ప్రతి శని-ఆదివారాలు తెలుగువన్ రేడియో (టొరీ) లో మనబడి విద్యార్ధులు అందిస్తున్న సంగతి మీకందరికీ తెలిసిందే. ఈ ఉగాది నుంచి మనబడి బాలానందం, ఒక సరికొత్త ఇంటర్నెట్ రేడియో చానెల్ Telugu NRI Radio లో కూడా మొదలౌతోంది ! http://telugunriradio.com/ లేదా "Telugu NRI Radio APP" ద్వారా, ప్రతి శని-ఆదివారాల్లో, మధ్యాహ్నం 1 నుంచి 2 వరకు. (1 PM EST, Every Sat and Sunday). మీరూ, మీ పిల్లలూ కలిసి తప్పక వినండి! ఈ విషయాన్ని మీరు తెలుగు వారందరితోనూ పంచుకోండి !! ఈ ఉగాది నుంచి నెలకు 16 కార్యక్రమాలు!! పదహారణాల తెలుగు కార్యక్రమం నెలకు 16 సార్లు!! ఆనందం, బాలానందం కేరింతలు - ఇక నుంచి రెండింతలు! మరి దానికి తగినట్టు, పిల్లలచే రేడియో కార్యక్రమం నిర్వహించే మావయ్యలు, అత్తయ్యలు కూడా మరి రెండింతలు కావాలి కదా! మీకు

చెన్నబోయిన కమలమ్మ

కబుర్లు
- రమా సుందరి చెన్నబోయిన కమలమ్మ మరణ వార్త పొద్దునే కలవరపెట్టింది. తెలంగాణ సాయుధ పోరాటదళాలలో ఉంటూ పోలీసుల నిర్బంధానికి తనకు పుట్టిన బిడ్డను కూడ అడవి బయట వదిలేసి వచ్చిన ఆమె చరిత్ర అజరామరం. 2015 సెప్టెంబర్ లో ఆమెను కలిసి పీవోడబ్ల్యూ బృందం ఇంటర్వ్యూ చేసింది. అప్పుడు ఆమె పాడిన పాట ఇంకా చెవుల్లో మార్మోగుతుంది. కొండల్లో కోయిల కమలమ్మ కాటమా రాజు కధ కాదురన్న పెద్ది రాజుల వారి సుద్దులు ఇవి కావు రన్నో వీర తెలుగోళ్ల పోరాట కధరన్నా సిరికొండ బేతవోల్ వీరుడా యాదగిరి వెంకటేశ్వరులా మరిచావా తెలంగాణ వీరా కోయ వీరుడు విల్లునంబుల శత్రువ కూల్చినా ముచ్చటా మరిచావా ఓ తెలుగు వీరుడా తెలంగాణ యోధుడా లేవయ్య, లేచి రావయ్యా తొంబ్బై రెండేళ్ల చెన్నుబోయిన కమలమ్మ కళ్ళు మూసుకొని గొంతెత్తి గొల్ల సుద్దులు పాడుతోంది. డెబ్భై ఏళ్ళ క్రిందటి జ్ఞాపకం పాటలాగా ఆమెను ఆవహించింది. ఆమె చుట్టూ ఉన్న శ్రోతలం నిశ్శబ్ధంగా వింటున్నామ

ఆధునిక కవిిత్వంలో అనుభూతివాదం

సారస్వతం
పొలాలనన్నీ, హలాల దున్నీ, ఇలాతలంలో హేమం పిండగ- జగానికంతా సౌఖ్యం నిండగ- విరామ మెరుగక పరిశ్రమించే, బలం ధరిత్రికి బలికావించే, కర్షక వీరులకాయం నిండా కాలువకట్టే ఘర్మ జాలానికి, ఘర్మ జాలానికి, ధర్మ జాలానికి, ఘర్మజలానికి ఖరీదు లేదోయ్! నరాల బిగువూ, కరాల సత్తువ వారాల వర్షం కురిపించాలని, ప్రపంచభాగ్యం వర్థిల్లాలని- గనిలో, పనిలో, కార్ఖానాలో పరిక్లమిస్తూ, వరివ్లవిస్తూ, ధనిక స్వామికి దాన్యం చేసే, యంత్రభూతముల కోరలు తోమే, కార్మికధీరుల కన్నులనిండా కణకణమండే, గలగల తొణకే విలాపాగ్నులకు, విషాదాశ్రులకు ఖరీదు కట్టే షరాబు లేడోయ్! లోకపుటన్యాయాలూ, కాల్చే ఆకలి, కూల్చేవేదన, దారిద్ర్యాలూ, దౌర్జన్యాలూ పరిష్కరించే, బహిష్కరించే బాటలుతీస్తూ, పాటలు వ్రాస్తూ, నాలో కదలే నవ్యకవిత్వం కార్మికలోకపు కల్యాణానికి, శ్రామికలోకపు సౌభాగ్యానికి, సమర్పణంగా, సమర్చనంగా వాస్తవ జగత్తుని మనోజ్ఞంగా చిత్రించటంలో

జీవిత కహానీ

కవితా స్రవంతి
- కారుణ్య కాట్రగడ్డ జీవితంలో ఓ భావమేదో మేఘమైనపుడు గొంతు మధ్యలో ఇరుక్కున్న వెక్కిళ్ళలా కనురెప్పల మాటున దాగిన ఆవేదనల్ని నిశ్శబ్దం లోపల తవ్వుకుంటున్నపుడు.. చిరునామాగా శూన్యాన్నే తీసుకుని నా ప్రస్థానంలో మరో మజిలీ మరో అతిధేయత్వం.... అర్థమే అవసరం లేని బంధంలా మనసులు స్ఖలించుకోవడం మొదలయ్యాక... చీకటి రాత్రుల్లోనూ,పగటి మేఘాల్లోనూ మోసాడు!నా మాటల బరువంతా... మిణుగురు పురుగుల వెలుగుల్లోనూ, రెప్పల కింద చీకటి లోను గుండెలో చేరిన చెమ్మని బరువెక్కిన మనసుతో ఎప్పుడో ఈదేశాడు! మనసు పొగిలినపుడల్లా జీవిత కహానికి కంటిరెప్ప అసూయ పడిందేమో ఆనందమో,ఆర్ద్రమో అర్థం తెలీక! నిన్ను కప్పుకున్న క్షణం నా మనసుకి,నీ ప్రేమకి మధ్య ఇరుక్కున్న క్షణాలన్నీ అసూయ పడాల్సిందే! 'నేన'నే అద్దంలో కూడా నీకు లొంగిపోని క్షణమేది నాకక్కర్లేదన్నప్పుడు... జీవితంలో ఈ క్షణమే శాశ్వతమన్న నీ కళ్ళలోని ఆనందమూ, నాకు దూరంగా వుండలేనన్

ఉగాది గీతం!

- డా. యడమండ్ర శ్రీనివాసశర్మ పై గీతాన్ని వినడానికి క్రింది లంకెని నొక్కండి https://www.facebook.com/sharma.ys/videos/1363690473735154/

మార్చి- 2018

నిర్వహణ : పుల్లెల శ్యామసుందర్ ఈ క్రింది "ప్రశ్న"కు పద్యరూపములో జవాబు పంపాలి. మీ జవాబులు విద్యుల్లేఖ ద్వారా (e-mail : padyam_hrdyam@yahoo.com) మాకు 20వ తారీఖు లోపల పంపించండి. ఉత్తమ పూరణలను తరువాయి సంచికలో ప్రచురిస్తాము. ఈ శీర్షికలో ప్రచురించడానికి పాఠకుల నుండి పూరణలు మాత్రమే కాకుండా ప్రశ్నలను కూడా ఆహ్వానిస్తున్నాము. ప్రశ్నలు వీలున్నంతలో తేట తెలుగులో ఉండి, సమకాలీనములైతే బాగుంటుందని మా అభిప్రాయము. ఈ మాసం ప్రశ్న: చైనాలో తెలుగుఁ నేర్చి చక్కగ బ్రదికెన్ గతమాసం ప్రశ్న: చిట్టెలుకకు బెదిరి పిల్లి ఛెంగున దాగెన్ ఈ ప్రశ్నకు మాకు అందిన క్రమములో పూరణలు ఇలా వున్నాయి. టేకుమళ్ళ వెంకటప్పయ్య, విజయవాడ పట్టణ శుషిరము కాళ్ళకు పట్టీలు కులుకు నడుమున బతివెంటన్ దా మెట్టిన గీమును జేరన్ చిట్టెలుకకు బెదిరి పిల్లి ఛెంగున దాగెన్ (పట్నమాసపు ఎలుక కాళ్ళకు పట్టీలు ధరించి ఠీవిగా అత్తవారింట్లో అడుగిడగా, ఆ పట్టీల