Month: March 2018

పుస్తక సమీక్ష

శీర్షికలు
సత్యమేవ జయతే సమీక్షకుడు - తాటిపాముల మృత్యుంజయుడు; రచయిత - సత్యం మందపాటి మంచి రచన చేయడం అంత సులభమేమి కాదు. మెప్పించే రచనలు చేస్తూ ఒక మంచి రచయితగా పేరొందడమంటే ఆషామాషి వ్యవహారం అసలే కాదు. మందపాటి సత్యంగారు మంచి రచయితల కోవలోకి వస్తారు. నేను అమెరికాలో అడుగుపెట్టి సమయం దొరికించుకొని తెలుగు సాహిత్యంపై మక్కువ పెంచుకొన్న పాతికేళ్ళ నుండి వారి సాహిత్యంతో నాకు పరిచయం ఉంది. వైవిధ్యమైన రచనలు చేయడంలో వారిది అందె వేసిన చెయ్యి. పాఠకులను ఆకట్టుకొనే రచనలు చేయాలంటే రచయిత అందరి మనుసుల్లాగే జీవిస్తూ సమాజాన్ని 'ఓరకంట (Special Eye)' నిరంతరం పరికిస్తూ ఉండాలి. అలా చేస్తే, కథ వస్తువులకు సరిపడే ముడిసరుకు లభ్యమవుతూనే వుంటుంది. ఈ పుస్తకం 'సత్యమేవ జయతే' ముందు మాటలో రచయిత ఉటంకించినట్టు, నిత్యసత్యమైన అనేక విషయాలపై కాసిన్ని హాస్య రచనలు చేయడం జరిగింది. వ్యంగ్యాస్త్రాలను సంధించడం జరిగింది. అప్పుడప్పుడు ఆవేదన వెలిబుచ్చ

వీక్షణం సాహితీ గవాక్షం – 66

వీక్షణం
- విద్యార్థి వీక్షణం 66వ సమావేశం మిల్పిటాసు (కాలిఫోర్నియా) లోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రతినిధి కార్యాలయమందు, ఫిబ్రవరి 12, 2018 నాడు జరిగినది. ఈ సభకు శ్రీ చెన్నకేశవ రెడ్డిగారు అధ్యక్షత వహించినారు. సాహిత్యంలో తత్త్వ దర్శనం గురించి అధ్యక్షులవారు ప్రసంగిస్తూ చెప్పిన విశేషములు - "అష్టాక్షరీ మంత్రము "ఓం నమోనారాయణ" లోని రా శబ్దమునకు పంచాక్షరీ మంత్రము "ఓం నమశ్శివాయ" లోని మ అక్షరం కల్పితే వచ్చేది రామ శబ్దము. ఆ రామ అయనము అనగా రాముని ప్రయాణము యొక్క తత్త్వాన్ని వివరించేదే రామాయణము. సాహిత్యములో కబీర్, తుకారాం, వేమన, బసవడు మొదలగు వారి రచనలలో తత్త్వ దర్శనం ఉంటుంది. అలాగే తెలుగు సాహిత్యములో బహు రచనలు తత్త్వ బోధనతో కూడి ఉన్నాయి". మొదటి ప్రసంగకర్త, శ్రీ అన్నే లెనిన్ గారిది. వారి ప్రసంగ విశేషములు - "నవీనాంధ్ర కవిత్వములో ఆత్మ, తత్త్వము పలువురి రచనలలో కనబడుతుంది. సముద్రాల, సిరివెన్నెల మొదలగు సినీ రచయితల

ఆ క్షణమొక్కటీ తప్ప

కవితా స్రవంతి
- కారుణ్య కాట్రగడ్డ ఎప్పుడైనా చేతుల్లోకి కాసిని కన్నీళ్లు తీసుకుని చూస్కుంటుంటాను సముద్రమూ నువ్వూ అలలు అలలుగా కనపడుతుంటారు నీ తడిసిన చూపుల్ని ఆకాశంలో ఆరబెట్టుకుంటున్న ఆ క్షణాలే మా కంటి మొనల్లో నిలిచుంటాయి అలసిన ఆకాశం చీకటి ముసుగేసుకుంటున్నట్టు నీ లోపలికి లోపలికి నువ్వు నడవకుండానే జీవితమనే ఆఖరి పేజీల అధ్యాయం రానే వచ్చింది.... కళ్లలోని భారమంత దిళ్ళకెత్తుకున్నాక ఎరుపెక్కిన మనసు పుటలో అర్థం ఆ పసి వయసులో మాకేం ఎరుకని మనసును చదవడమనే మహా ప్రస్థానం నీ నుండే మా ఊపిరి కొసల్లోకి చేరాక కూడా నిన్ను చదవడం మాకో కాల జ్ఞానమే... గడప దాటని నీ మనసు మాటలన్నీ మా రెప్పలకి తగిలినపుడల్లా మా మనసెంత కురిసిందో కనులకేం తెలుసని కష్టాల పాన్పుపై పూల మాలవై మాలో పరిమళాలు నింపిన నీ ఆత్మాభిమానం ముందు మోకరిల్లిన ఆడతనానికే తెలుసు నిండుకుండా నీవు ఒక్కటేనని... కడుపులో దాచుకున్న సముద్రాలను జ్ఞప్తికి తెచ్చుకు

శ్రీరామాయణ సంగ్రహం – యుద్ధకాండ

ధారావాహికలు
విభీషణా! నా మాట కాదని ఈ వానరుల్ని ఎందుకు బాధిస్తున్నావు? వారిని తొలగించవద్దు. వాళ్ళంతా నావాళ్ళు. న గృహాణి న వస్త్రాణి న ప్రాకారా స్తిరస్క్రియాః నేదృశా రాజసత్కారాః వృత్త మావరణం స్త్రియాః (యుద్ధ. 117.27) స్త్రీని మరుగుపరచి కాపాడేవి ఇళ్ళు కావు, వస్త్రాలు కావు, ప్రాకారాలు కావు, తెరలు కావు, రాజసత్కారాలు కావు, మంచి నడవడియే ఆమెకు ఆభరణం. వ్యసనేషు న క్రుచ్చేషు న యుద్ధేషు స్వయంవరే, న క్రతౌ న వివాహే చ దర్శనం దుష్యతి స్త్రియాః    (యుద్ధ. 117.28) తనకు ఇష్టమైన వారితో ఎడబాటు వంటి కష్టాలు వచ్చినప్పుడూ, రాజ్యంలో కల్లోలాల వంటి సందర్భాల్లోనూ, యుద్ధాల్లో, స్వయంవరాల్లో, యజ్ఞప్రదేశాలల్లో, వివాహాల్లో స్త్రీలు ఇతరులకు కనపడటం దోషం కాదు. కాబట్టి సీతాదేవి పల్లకీ విడిచిపెట్టి కాలినడకనే నావద్దకు రావచ్చు. ఈ వానరులంతా ఆమెను చూస్తారు. నా సమీపంలో ఉండగా మిత్రులతోకూడిన నన్ను ఆమె కూడా చూస్తుంది" అన్నాడు. అప్పుడు సీతా

సెకండ్ పెన్ష్జన్!

కథా భారతి
-కుంతి (కౌండిన్య తిలక్ ) సెల్ మ్రోగింది. "హలో! ఆనంద్ బిజీగా ఉన్నావా" స్టేట్ బ్యాంక్ అశోక్ నగర్ లో పనిచేస్తున్న ముకుందరావు నుండి ఫోన్. "లేదు చెప్పు" మారెడ్ పల్లి బ్రాంచ్ లో పని చేస్తున్నఆనందరావు ఫోన్ రిసీవ్ చేస్తూ అన్నాడు. "ఒక న్యూస్.మన రామానుజము సార్ కు వారము రోకుల క్రిందట పెద్ద యాక్శిడెంట్ అయిందట్. సికింద్రాబాద్ లోని ఆత్మీయ హాస్పిటల్ లో ఉన్నాడట .సాయంత్రము ఆరు గంటలకు వెళదామనుకుంటున్నాను.నీవు వస్తావా?" "అరెరె! ఎలా జరిగింది" "ఒక వికలాంగుడినిరోడ్డుదాటించబోయాడట. ఇంతలో ఒక కార్ ర్యాష్ గా వచ్చి సారును బలంగా ఢీకొట్టిందట. ఆ వికలాంగుడికి పెద్దగా దెబ్బలు తగల్లేదట.కానీపాపము సార్ కే బాగా గాయాలయ్యాయట. చాలా రక్తము పోయిందట" "తప్పకుండా వస్తాను" ,ఫోన్ పెట్టేసి,రామానుజముగారితో అతడికున్న అనుబంధము గుర్తుకు రాగా ,అతడికి వచ్చిన ఆపద తలుచుకొని మరింత బాధపడుతూ కూర్చుండిపోయాడు ఆనందరావు. శ్రీ రామానుజము స్టేట్

అజామిళుడు

సారస్వతం
-శారదాప్రసాద్​ ఇది శ్రీ మహాభాగవతంలోని కధ.భగవద్గీతలో శ్రీ కృష్ణుడు చెప్పిన ఒక శ్లోకం యొక్క అంతరార్ధం ఈ కధలో ఇమిడి ఉంది.ఆ శ్లోకం ఏమిటంటే--"యం యం వాపి స్మరన్బావం త్యజత్యంతే కళేబరం,తం తమే వైతి కౌంతేయ సదా తద్భావ భావితః,"అంటే ,జీవుడు దేనిని గూర్చి స్మ‌రించుచు శ‌రీర‌మును చాలించునో అద్దానిని గూర్చియే పున‌ర్జ‌న్మ‌మును పొందుచున్నాడ‌ని అర్ధం! ఈశ్వర స్మరణతో దేహాన్ని వదిలినట్లయితే ఈశ్వర స్వరూపంలో ఐక్యమవుతాము.జడభరతుని కధ దీనికి చక్కని ఉదాహరణ. జ‌డ‌భ‌ర‌తుడు యోగియైన‌ప్ప‌టికిని మ‌ర‌ణ స‌మ‌య‌మున ప్ర‌గాఢ‌ముగ‌నున్న మ‌మ‌కార‌ము వ‌ల‌న జింక‌నుగూర్చి యోచించుచు ప్రాణ‌ముల‌ను చాలించినందువ‌ల‌న మ‌రుజ‌న్మ‌మున జింక‌యై జ‌న్మించెను. దాదాపుగా అటువంటిదే ఈ అజామిళుడి కధ కూడా! కేవలం మరణ సమయంలో మాత్రమే నారాయణ నామ స్మరణ చేయటంవలన అజామిళుడు మోక్షాన్ని పొందాడు.ఇక అజామిళుడి కథను గురించి తెలుసుకుందాం! ​కన్యాకుబ్జం అనే పట్టణంలో అజా

పాకీ వాడు

కథా భారతి
-ఆర్ శర్మ దంతుర్తి ఓహైయో, కేస్ వెస్టర్న్ యూనివర్సిటీ కేంపస్ నుంచి దాదాపు రాత్రి ఎనిమిదిన్నరకి చలిలో వెనక్కి నడుచుకుంటూ వచ్చి బూట్లు కూడా విప్పకుండా అపార్ట్ మెంట్ వంటింట్లోకి దూరిన మనోజ్ కి వంట వండుతోన్న అప్పారావు కనిపించేడు. “ఏంటి గురూ డిన్నర్, కడుపులో ఎలకలు పరుగెడుతున్నాయ్, వంట చేయడం అయిపోయిందా?” “ఇదిగో అవుతోంది, బట్టలు మార్చుకురండి, తినేద్దాం.” చెప్పేడు అప్పారావు. అన్నం తింటూంటే కబుర్ల మధ్యలో మనోజ్ చెప్పేడు, “వచ్చే నెలలో నాకు థీసిస్ చేయాలా, లేకపోతే నాన్ థీసిస్ ఆప్షన్ చేయాలా అనేది తేల్చుకోమని చెప్పేడు ఇవాళ గురుడు.” “ఏం చేద్దామనుకుంటున్నారు?” “నాన్ థీసీస్ అయితే ఓ ఐదారుసార్లు రాసిందే రాసి దిద్దించుకోవచ్చు. తర్వాత అది ఎక్కడ పారేసినా ఎవడికీ పట్టదు. థీసిస్ అయితే దాన్ని సమర్ధించుకోవాలి, ముగ్గురు ప్రొఫెసర్లకి కాళ్ళు కడగాలి, ఆ తర్వాత ఎవడికి నచ్చకపోయినా మరోసారి దిద్దడం, మరోసారి కాళ్ళు కడగడం అ