Month: May 2018

అమ్మకి వందనం

కవితా స్రవంతి
- అన్నసముద్రం శ్రీదేవి దక్షిణ కోరని గురువుకి శాపం తెలియని దేవతకు ఆగ్రహమెరుగని నిగ్రహమూర్తి కి మాతృవందనం లోకం బిడ్డ కు చూపటానికి యుద్ధం చేసిన యోధురాలి కి ఎల్లలు ఎరుగని తల్లి ప్రేమ కి తొలి వందనం మమతను పంచి నడతను నేర్పి తడబడుతుంటే తప్పు ను దిద్దిన తొలి బడి ఐన తల్లి ఒడికిదే అభివందనం వేనవేల వందనాలు కోట్ల ల్లో కృతజ్ఞతలు చంద్రృనికో నూలుపోగు అమ్మా అను పిలుపొకటే అమ్మకి నచ్చిన పలుకు అమ్మ మెచ్చేలా పలుకు

చదువు మొగ్గలు

కవితా స్రవంతి
- - డాక్టర్ భీంపల్లి శ్రీకాంత్ పదిమందికి విద్యాగంధాన్ని పంచితేనే కదా నిరక్షరాస్యత నిర్మూలన సతతం జరిగేది చదువు ఎప్పటికీ వాడని వసంతపరిమళం జ్ఞానకుసుమాలను సదా ఆస్వాదిస్తేనే కదా మనలోని అజ్ఞానాంధకారం తొలిగిపోయేది చదువు మానవవికాసానికి విజయసోపానం మేధోమధనం నిత్యం మదిలో రగిలితేనే కదా ఆనంతమైన విజ్ఞాన అంచులను చుంబించేది చదువు పరిశోధనపూలు పూచే గంధంచెట్టు విద్యార్థులు విద్యావంతులై వికసిస్తేనే కదా అక్షరపూలు మహిలో విద్యాగంధాన్ని వెదజల్లేది చదువు భావితరానికి మార్గం చూపే చుక్కాని ఆనందాలను నిరంతరం అనుభూతిస్తేనే కదా ఉపదేశపు సంస్కారబీజాలు నాటుకుపోయేది చదువు భవిష్యత్తుకు బాటవేసే రహదారి

పద్యం-హృద్యం

నిర్వహణ : పుల్లెల శ్యామసుందర్ ఈ క్రింది "ప్రశ్న"కు పద్యరూపములో జవాబు పంపాలి. మీ జవాబులు విద్యుల్లేఖ ద్వారా (e-mail : padyam_hrdyam@yahoo.com) మాకు 20వ తారీఖు లోపల పంపించండి. ఉత్తమ పూరణలను తరువాయి సంచికలో ప్రచురిస్తాము. ఈ శీర్షికలో ప్రచురించడానికి పాఠకులనుండి పూరణలు మాత్రమే కాకుండా ప్రశ్నలను కూడా ఆహ్వానిస్తున్నాము. ప్రశ్నలు వీలున్నంతలో తేట తెలుగులో ఉండి, సమకాలీనములైతే బాగుంటుందని మా అభిప్రాయము. ఈ మాసం ప్రశ్న: పందినిఁ కౌగిలించుకొని పంకజలోచన సంతసించెరో గతమాసం ప్రశ్న: వంకాయన చెఱుకు రసము వడివడిఁ యుబికెన్ ఈ ప్రశ్నకు మాకు అందిన క్రమములో పూరణలు ఇలా వున్నాయి. నేదునూరి రాజేశ్వరి, న్యూజెర్సీ ఇంకేమి వింతలుం డునొ సంకర జాతులు పుట్టు సంబర మందున్ వంకర టింకర యుగమిది వంకాయన చెఱకు రసము వడివడిఁ యుబికెన్ సూర్యకుమారి.  వారణాసి  .మచిలీపట్నం టెంకాయ  నీరు  త్రాగియు ఇంకా  దాహమనిపిం చి  ఇ

అన్నమాచార్య 610వ జయంతి ఉత్సవం

ఈ మాసం సిలికానాంధ్ర
610వ అన్నమయ్య జయంత్యుత్సవం - అమెరికా ప్రాంతీయ పోటీలు సిలికానాంధ్ర మే నెల 25, 26, 27 తేదీలలో కాలిఫోర్నియాలోని మిల్పీటస్ నగరంలొ 610వ అన్నమయ్య జయంత్యుత్సవాన్ని బారీగా చేయటానికి తలపెట్టింది. ఈ కార్యక్రమంలో జరుగనున్న సంగీతం, నాట్యం తుదిపోటీల్లో పాల్గొనటానికి అభ్యర్థులను అమెరికాలోని నాలుగు నగరాల్లో ప్రాంతీయ పోటీలను నిర్వహించి ఎంపిక చేసింది. ఆ నగరాల్లోని ఫోటోలు కొన్ని అందిస్తున్నాము. కాలిఫోర్నియా న్యూ జెర్సీ వర్జీనియా డాల్లస్

ఋతు గీతం

కవితా స్రవంతి
-వెన్నెల సత్యం రాత్రి నిద్ర పట్టని మహానగరం రోడ్లన్నీ ఆవలింతలతో జోగుతున్నాయి! బయటికి అడుగు పెడ్తున్న మనుషులంతా టోపీల్తో మంకీ లై పోతున్నారు!! కిటికీ పక్షులు రెక్కలు విదిల్చడానికి ప్రయత్నిస్తూ వణుకుతున్నాయి! చెట్ల ఆకులు లోలోపల భయపడుతూ మంచు ముత్యాలు రాలుస్తున్నాయి!! బకెట్లో నీళ్ళు కరచాలనం చేయబోతే కస్సుమంటూ కరుస్తున్నాయి! చలితో పోరాడలేక దేహంలో రక్త కణాలు గడ్డకడ్టుకు పోతున్నాయి!! ఏ తోడూ లేని ఒంటరి జీవులు పంజా విసిరే చలిపులి మీద తిట్లదండకం వల్లిస్తున్నారు! తోడు దొరికిన అదృష్టవంతులు రాగాల దుప్పట్లో చేరి యుగళ గీతాలు పాడుతున్నారు!! పాల బుగ్గల పాపాయిలు ఋతువుల దోబూచులాటని పసి పాదం తో తన్నేసి వెచ్చని అమ్మ ఒడిలో ఆదమరిచి నిద్రిస్తున్నారు!!! ****