Month: June 2018

పద్యం – హృద్యం

నిర్వహణ : పుల్లెల శ్యామసుందర్ ఈ క్రింది "ప్రశ్న"కు పద్యరూపములో జవాబు పంపాలి. మీ జవాబులు విద్యుల్లేఖ ద్వారా (e-mail : padyam_hrdyam@yahoo.com) మాకు 20వ తారీఖు లోపల పంపించండి. ఉత్తమ పూరణలను తరువాయి సంచికలో ప్రచురిస్తాము. ఈ శీర్షికలో ప్రచురించడానికి పాఠకులనుండి పూరణలు మాత్రమే కాకుండా ప్రశ్నలను కూడా ఆహ్వానిస్తున్నాము. ప్రశ్నలు వీలున్నంతలో తేట తెలుగులో ఉండి, సమకాలీనములైతే బాగుంటుందని మా అభిప్రాయము. ఈ మాసం ప్రశ్న: నిషిద్ధాక్షరి: క, చ, ట, త, ప లు లేకుండా వేసవి సెలవలను వర్ణిస్తూ ఛందోబద్ధముగా పద్యము వ్రాయవలెను గతమాసం ప్రశ్న: పందినిఁ కౌగిలించుకొని పంకజలోచన సంతసించెరో ఈ ప్రశ్నకు మాకు అందిన క్రమములో పూరణలు ఇలా వున్నాయి. నేదునూరి రాజేశ్వరి, న్యూజెర్సీ నందిని పూజజేసి శివ నామము త్రాణగ భక్తిమీ రగన్ సందియ మేమిలేక మది చల్లని భావము పొంగు చుండగా వందనమో యటంచు తలవంచి మహామహితాత్ముడే యనన్ పందిని కౌ

విశ్వామిత్ర 2015 – నవల ( 22 వ భాగము )

ధారావాహికలు
-ఎస్ ఎస్ వి రమణారావు విశాఖపట్టణం ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్,వచ్చీపోయే ప్రయాణీకులతో రద్దీగానే ఉంది.ఎయిర్ ట్రావెలర్స్, ఇండియా మొత్తంలో ఏపిలోనే అధికంగా ఉన్నారని వచ్చిన న్యూస్ సర్వే నిజమే అని ధృవీకరిస్తున్నాట్టున్నారు జనం. సమయం ఉదయం పదకొండు గంటలైంది. ఎయిర్ పోర్ట్ కారిడార్ ని ఆనుకుని ఉన్న ఇన్నర్ రోడ్ ఒకటుంది.విఐపి కార్లు, అంటే ముఖ్యంగా గవర్నమెంట్ కారులు మాత్రమే అక్కడ పార్క్ చేసుకునే అవకాశం ఉంది.ఆరోడ్డులోకి పొలీస్ రక్షక్ వేన్ లు నాలుగు, ఫ్యాక్షనిష్ట్ సినిమాల్లో సుమోల్లాగా దూసుకు వచ్చాయి.అందులోంచి చక చక క్రమబద్ధమైన బూట్ల చప్పుడుతో దిగారు పోలీసులు.సరిగ్గా ఏడు నిమిషాల్లోఎయిర్ పోర్ట్ అంతా సరౌండ్ చేసేశారు.అన్నివేన్ లకి ముందున్న కారులోంచి ఫ్యాక్షన్ లీడర్ లాగా దిగాడు జగదీష్.అతడి మొహం వెలిగిపోతోంది.అందుకు కారణం ఉంది.అమెరికానుంచి వయా ఢిల్లీనుంచి వస్తున్న విశ్వామిత్రని అరెస్ట్ చేసి దారిలోనే కాల్చి చంపేయమని

యత్నం

కథా భారతి
- శ్రీమతి మోచర్ల రామలక్ష్మి సద్గురువులు, సాధకులు, యోగులు, త్యాగులు, పండితులు, కవులు ఎందఱో మహానుభావులు. చతుర్వేదాల సారాన్ని ఉపనిషత్తులు, పురాణాలు, కావ్యాలు, సుభాషితాలు, నీతి శతకాలు, సూక్తులు, చాటువులు, సామెతలతో నిబిడీకృతం చేసి మానవాళి అభ్యున్నతికి అందించారు. దేవభాష అయిన సంస్కృత భాషలోని సూక్తులను, సుభాషితాలను, నేటితరం పిల్లలతో, గౌరవనీయులయిన పెద్దలతో, హితులతో, సన్నిహితులతో ముచ్చటించు కావాలనేది నా అభిలాష. సరస్వతీదేవి కృపతో కథావాటికలో సూక్తులు, సుభాషితాలు పొందుపరిచి, చిన్న కథలుగా రూపొందించి పుస్తక పాణి పద పల్లవములకు సమర్పిస్తున్నాను. సంస్కృత అధ్యాపకులు మా గురువర్యులు శ్రీమాన్ మోహనరావుగారి పాదాలకు నమస్కరిస్తూ కథ ఆరంభిస్తున్నాను. సుందరం చక్కనివాడు. చురుకు, తెలివి కలవాడు, బాగా చదువుకుని ఉత్తమశ్రేణిలో పట్టభద్రుడయ్యాడు. తను ఎంతో మేధావినని, ఉద్యోగం తనని వెదుక్కుంటూ వస్తుందని అతనిని కించిత్ గర్వం ఆ

పనికత్తి

కవితా స్రవంతి
- తమిరిశ జానకి గ్యాస్ మీద వంటేనా ఇరవైనాలుగ్గంటలూ నీళ్ళొస్తాయా విమ్ సోపేనా తోమేందుకు బట్టలుతికే మిషనుందా ఆరేసేందుకు నువ్వు నాకు సాయంచేస్తావా ఒకపూటే ఇల్లూడుస్తా వారానికోసారే పోఛా చేస్తా రోజూ చాయ్ నాస్తా ఇస్తావా పండగ పండగకీ కొత్తచీరిస్తావా రెండునెల్లకోసారి పాతచీరిస్తావా ఆదివారాలు సెలవిస్తావా అదికాక నెలకి నాలుగైదురోజులు మానేస్తే నాగాలు కట్టకుండా ఉంటావా పెద్ద టీ.వీ.ఉందా పనికీ పనికీ మధ్య నాకిష్టమైన సీరియలే పెడతావా ఏరోజు ఏసీరియల్లో ఎక్కువ ఏడుపు నాకొచ్చినా ఆరోజు పని పూర్తిగా చెయ్యలేను నువ్వే చేసుకోవాలి మరో చాయ్ ఎగస్ట్రా ఇవ్వాలి ఓ.కే.నా ఆన్నింటికీ ఊ అంటే చెప్పు ఇప్పుడే పన్లోకి ఉరుకుతా కత్తిలా దూసుకుపోతా నీ పని చూసుకుంటా ! ****

చిత్ర రంజని జూన్ 2018

చిత్ర రంజని
మిల్పీటస్ పట్టణంలోని రాంచో మిడిల్ స్కూల్ (ఋఅంచొ ంఇద్ద్లె శ్చూల్) విద్యార్థులు ఆర్ట్ క్లాసులో (ఆర్త్ ఛ్లస్స్) గీసి, గ్రంథాలయంలో ప్రదర్శించిన చిత్రాల్లోని నలుపు-తెలుపు (భ్లచ్క్ అంద్ వ్హితె) చిత్రాలు కొన్ని. (ఛ్రెదిత్ తొ స్తుదెంత్స్ అంద్ థైర్ తేచెర్ ఝమెస్ ఛౌల్సొన్)

ఒత్తిడిని జయిద్దాం విజయం సాధిద్దాం

శీర్షికలు
ఒత్తిడి దీన్నే మనం Stress అని కూడా అంటుంటాం. వేగంగా మారుతున్న నేటి సామాజిక ప్రభావం వలన ఈ ఒత్తిడి లేని వారు రాని వారు లేరంటే అతిశయోక్తి లేదు. అ ఆ లు చదివే (క్షమించాలి ABCD) పిల్లలనుండి ఆఫీసుకు పరుగులెత్తె పెద్దలు మరియు జీవన సమరంలో అలసి సొలసిన వృద్ధుల వరకు ఈ ఒత్తిడి నుండి మినహాయింపు లేకపోగా, నేటి సమాజంలో ఇది ఒక మానసిక రుగ్మతగా మారి మనిషి మానసిక శారీరక ఆరోగ్యాలపై సవాలు చేస్తోంది! మానవ జీవనశైలిలోనే అనేకానేక మార్పులు చోటు చేసుకుంటున్నాయి! దాని ఫలితమే దినదినాభి వృధ్ధిగా పెరుగుతున్నాయి ఈ ఒత్తిళ్లు.వృత్తిగా చేసే పనులకు వ్యక్తిగా చేసే పనులు మధ్య సామరస్యం లేకపోవటం ఒకటైతే, వ్యక్తిగా పెంచుకున్న, పెరుగుతున్న అవసరాలు కూడా ఈ ఒత్తిడికి దోహద పడుతున్నాయి. ప్రతిదినం చేయవలసిన పనుల పరుగులో అందుకోవాల్సిన బస్సు మొదలు ట్రాఫిక్ జాములతో చేరవలసిన చోటుకు చేరేవరకు సాగే ఈ ఉద్వేగంలో మనసు ఒత్తిడికి గురి అవుతూ మనిషి శారీ

ఉపమన్యు ,ధౌమ్య మహర్షులు

సారస్వతం
-శారదాప్రసాద్  (​పాము పాదము పతంజలి మరియు పులి పాదముల వ్యాఘ్రపాద మహర్షి కలసి నటరాజస్వామి రూపములో ఉన్న శివునికి నమస్కరిస్తున్న దృశ్యం) వ్యాఘ్రపాద లేదా వ్యాఘ్రపాద మహర్షి లేదా వ్యాఘ్రపాదుడు అనగా వ్యాఘ్రము వలె చరించువాడు అని అర్ధము. పాదములు వ్యాఘ్రము యొక్క పాదములు వలె ఉండును కాన వ్యాఘ్రపాదుడు అని, వ్యాఘ్రము వలె చరించువాడు అని అర్ధము చెబుతారు .కృతయుగము నందు ధర్మ ప్రవచన దక్షుడు, వేద వేదంగ విదుడు, జంతువుల యెడల భయంకరముగా చరించు వాడు, అయిన ఒక మహా ముని పేరు వ్యాఘ్రపాద లేదా వ్యాఘ్రపాదుడు.పురాణాలలో వ్యాఘ్రపాదుడు అనే ఒక ఋషి ఉన్నట్లు చెప్పబడింది. వ్యాఘ్రపాదునకు ,భారతదేశం యొక్క తమిళనాడు నందలి చిదంబరంలో ఆలయ ప్రాంగణంలో నటరాజుగా ఉన్న శివుడు యొక్క నిత్య పూజ అందించటం కోసం, తేనెటీగచే తాకబడని తాజా పుష్పాలు సేకరించే యొక్క పని అప్పగించబడుతుంది. అయితే, పువ్వులు కోసి సేకరించే సమయములో వ్యాఘ్రపాదుడు ముళ్ళు మరియు

కవితా మొగ్గలు

కవితా స్రవంతి
- డాక్టర్ భీంపల్లి శ్రీకాంత్ కవిత్వం మనసును పులకింపచేస్తేనే కదా అక్షరలతలు నలుదిశలా పరిమళించేది కవిత్వం సాహితీ కుసుమాల సౌరభం కవిత్వం తరంగమై ప్రవహిస్తేనే కదా కొత్తదారులను లోకానికి పరిచయం చేసేది కవిత్వం నవరాగాల నవరససమ్మేళనం కవిత్వం సాగరమై పోటెత్తితేనే కదా గుండెలోని బాధల దుఃఖాన్ని ఒంపుకునేది కవిత్వం కనిపించని రహస్యనేత్రం కవిత్వం నదీప్రవాహమై పారితేనే కదా కవితావింజామరలు వికసించి నాట్యమాడేది కవిత్వం నవపల్లవుల మృదంగనాదం కవిత్వం అక్షరసౌరభాలను వెదజల్లితేనే కదా తెలుగు సాహిత్యం కలకాలం నిలిచిపోయేది కవిత్వం వెలుగుపంచే సహస్ర రవికిరణం

శ్రీరామాయణ సంగ్రహం

ధారావాహికలు
ఉత్తరాకాండ శ్రీరామచంద్రుడు రావణసంహారం చేసి అయోధ్యలో పట్టాభిషిక్తుడై సకల సంవత్సమృద్ధంగా జనరంజకంగా పరిపాలిస్తుండడం చూసి ఇలలోని నాలుగు దిక్కుల నుంచి పరమఋషులు ఎంతో సంతోషంతో ఆ శ్రీరామప్రభువును అభినందించటానికీ, తమ అభిమానం తెలియజేయటానికీ అయోధ్యకు వచ్చారు. తూర్పుదిక్కు నుంచి వచ్చిన వారిలో కౌశికుడు, యవక్రీతుడు, గార్గ్యుడు, మేధాతిథి కుమారుడు కణ్వుడు మొదలైన వారున్నారు. దక్షిణం నుంచి వచ్చిన వారిలో ఆత్రేయుడు, నముచి, ప్రముచి, ఋషులందరిలోనూ సర్వశ్రేష్టుడూ, మహాప్రభావసంపన్నుడూ అయిన అగస్త్యుడూ ఉన్నారు. పడమటి నుంచి కవషుడు, ధౌమ్యుడు, రౌద్రేయుడు అనే వారు తమ శిష్యులతో కూడా వచ్చారు. ఉత్తరదిక్కు నుంచి వశిష్ఠుడు, కశ్యపుడు, అత్రి, విశ్వామిత్రుడు, గౌతముడు, జమదగ్ని, భరద్వాజుడు అను సప్తర్షులు వచ్చారు. ఇట్లా వీళ్ళంతా రాచనగరు సింహద్వారం సమీపించి అక్కడి ద్వారపాలకుడితో తమ రాక శ్రీరామచంద్రుడికి తెలియజేయవలసిందిగా అగస్త్యుడ