Month: July 2018

ఆధునిక కవిిత్వంలో అనుభూతివాదం

ధారావాహికలు
-సునీత పావులూరి కవిత ఎంత హృదయాన్ని కదిలించింది అన్నది కాదు ప్రధానం; సామాజికునికి మానసిక చైతన్యం కార్యరూపంగా ఎంత ప్రవహించింది అన్నదే ప్రమాణం. ఆచరణ వెనుక అనుభూతి లేదని చెప్పడం అసంబద్ధం. మానసికంగా ఉత్తేజం పొందనివాడు శారీరికంగా కార్యశీలి కాలేడు. కవి ఉత్తేజితుడై కలమాడితే చాలు. కాని మార్క్సిస్టు కవిత కలంతో సంతృప్తి పడేదికాదు. హలంగానో, గన్ గానో మారాలి. వాటిని పట్టినవాడే విప్లవ కవిత్వానుభూతిని కార్యరూపంగా సాధిస్తున్నవాడు. ఒకవిధంగా మార్క్సిస్టు సాహిత్యంలో కలానికున్న ఈ గౌణమైన గౌరవాన్ని బట్టి కవి ప్రచారకుడనీ, కవిత్వం నినాదమని, అనుభవం కవిత్వం వ్రాసే కవిది కాదు, దాన్ని కార్యరూపంలో పెట్టే సమాజానిదేనని సాధారణంగా భావింపబడుతోంది. అందువలన ఈ పద్ధతిలో- కవితా సామాగ్రికి కనీస గౌరవం - కార్యాచరణ సూత్రాలకు కనకాభిషేకం.” “ఈ మాట అనుశీలన కోసం ఏర్పరచుకుంటున్నదే. అభ్యుదయ కవులు, విప్లవకవులు సమాజ వాస్తవికతను కవిత్వంలో ప

అన్నమయ్య శృంగార నీరాజనం

సారస్వతం
శృంగార వియోగ నాయిక -టేకుమళ్ళ వెంకటప్పయ్య అలమేలు మంగమ్మ శృంగార తాపాన్ని అద్భుతంగా వర్ణిస్తున్నాడు అన్నమయ్య. స్వామి రాలేదని మదన తాపంతో ఉన్నది. చల్లదనం కలిగించే వస్తువులు కూడా మంట మండిస్తున్నాయి. అన్ని కీర్తనల్లో వాడే "శ్రీవేంకటేశ్వర" అనే మకుటం కాకుండా ఈ కీర్తనలో "శేషాద్రి వల్లభుడు" అని క్రొత్తరకంగా సంబోధించడం వింతగానే ఉంది. చిత్తగించండి. కీర్తన: పల్లవి: చలిగాలి వేడేల చల్లీనె కప్పురపు మలయజము తానేల మండినే చ.1.పాపంపు మనసేల పారీనే నలుగడల చూపేల నలువంజజూచీనే తాపంపు మేనేల తడవీనె పూవింటి తూపేల చిత్తంబు దూరీనే || చలిగాలి|| చ.2.వాయెత్తి చిలుకేల వదరీనె పలుమారు కోయిలలు దామేల గొణగీనే రాయడికి నలులేల రాసీనే మాతోను కాయజుడు తానేల కసరీనే|| చలిగాలి|| చ.3.ఏకాంతమున నేల యెదురైతినే తనకు లోకాధిపతికేల లోనైతినే చేకొనిదె మన్నించె శేషాద్రివల్లభుడు పైకొనిదె మమ్మేల పాలించెనే || చలిగాలి|| (రాగం: శ్

వీసా

కథా భారతి
-ఆర్. శర్మ దంతుర్తి “ఈ సారైనా ఎలాగోలా వీసా సంపాదించవల్సిందే“ “అదంత సులభం అయితే ఇంకేం? వీసా ఆఫీసర్ మూడ్ బట్టి మన అదృష్టం బట్టీను. పోనీ, అది ఎలాగా మన చేతిలో లేదు కానీ, అమ్మని అడుగు ఏం చేయాలో. మనం కాయితాలు సరిగ్గా ఉన్నాయో లేదో చూసుకుందాం. అమ్మ ఏదైనా దేవుడికి మొక్కమంటుందేమో చూడు.” “అమ్మా నువ్వేమంటావ్?” “వస్తున్నా, కాస్త చేయి ఊరుకోలేదిప్పుడు. కాసేపాగు.” “…” “ఇప్పుడు చెప్పు ఏంటి కధ?” “వీసా కి నాలుగోసారి వెళ్తున్నా. మూడు సార్లూ ఏదో వంక పెట్టి వెనక్కి పంపించేసాడు. ఈ సారైనా ఎలాగోలా సంపాదించాలి. ఏం చేద్దాం?” “క్రితం సారి నేను చెప్పినట్టు చేయమంటే పోజు కొట్టారు కదా తండ్రీ కొడుకులు? ఇప్పుడు నా దగ్గిరకొచ్చారా?” “ఏదో తప్పు అయిపోయింది అప్పుడు. ఇప్పుడు ఎలాగైనా వీసా రావాలి. ఏం చేయమంటావ్?” “హైద్రాబాద్ లోనే కదా వీసా ఇచ్చేది?” “ఔను. నువ్వూ వస్తావా వెళ్ళడానికి?” “కాదు కానీ, హైద్రాబాద్ లో వీస

వీక్షణం సాహితీ గవాక్షం -71

వీక్షణం
-సాయికృష్ణ మైలవరపు వీక్షణం 71 వ సమావేశం కాలిఫోర్నియా రాజధాని శాక్రమెంటో నగరంలో జూలై 14వ తేదీన లక్ష్మీనారాయణ మందిరములో దిగ్విజయంగా జరిగింది. ఈ నెల సమావేశ అంశం "సంస్కృతాంధ్ర అవధానం". అవధానులు శ్రీయుతులు పాలడుగు శ్రీచరణు గారు అసమాన ప్రతిభతో తెలుగులో ఎనిమిది అంశాలు, సంస్కృతం లో మూడు అంశాలతో పృచ్ఛకులు అడిగిన కష్టతరమైన ప్రశ్నలకు చక్కటి సమాధానాలనిస్తూ ఆద్యంతం ఆసక్తిదాయకంగా పూర్తి చేసేరు. బ్రహ్మశ్రీ మారేపల్లి నాగవేంకట శాస్త్రి గారు సంచాలకత్వం చేసిన ఈ సభకు సుమారు నూరు మంది వీక్షకులు వేంచేసి రసరమ్యంగా వీక్షించారు. తెలుగు పురాణ పఠనము శ్రీ అక్కిరాజు సుందర రామకృష్ణ గారి తెలుగు పురాణ పఠనము అందరినీ ఉఱ్ఱూతలూగించినది. తెనాలి రామలింగ పాండురంగ మహాత్మ్యము, నంది తిమ్మన పారిజాతాపహరణము మున్నగు పురాణములనుండి మృదుమధురముగా అక్కిరాజువారు ఆలపించిన పద్యాలకు అవధాని వారు చక్కటి వ్యాఖ్యానమునొసగినారు. నిషిద్ధాక్ష

నీకు నీవే పోటీ!

శీర్షికలు
అమరనాథ్. జగర్లపూడి కౌన్సిలింగ్ సైకాలజిస్ట్ 9849545257 సామాజిక వాతావరణంలో పోటీతత్వం రోజు రోజుకు పెరిగిపోతొంది. చదువుల్లో, పోటీ పరీక్షల్లో, ఉద్యోగ ఇంటర్వ్యూల్లో, ఉద్యోగ పదోన్నతుల్లో ఈ పోటీ సర్వసాధారణంగా మారిపోయి అనేకానేక మానసిక ఉద్వేగాలకు తెరలులేపుతోంది! ఆరోగ్యకరమైన పోటీ తత్వం అవసరమైన విషయమే కానీ అనవసర పోటీతత్వంతో మనల్ని ఇతరులతో పోల్చుకుంటూ మనల్ని మనం తక్కువ చేసికోవటంలోనే అసలు సమస్యలనేవి ప్రారంభం అవుతాయి. మనలో చాలామందికి వుండే అలవాటు మనల్ని ఇతరులతో పోల్చుకుని మనల్ని తక్కువ చేసుకోవటం. పరీక్షల్లో అనుకున్న రాంక్ సాధించగలనా? ఉద్యోగ ప్రయత్నంలో అనుకూల ఫలితం లభిస్తుందా? ఇలా అనేక విషయాలకి సంబంధించి మనమే కాదు మనతో పాటు అదే స్థాయిలో ఈ పోటీ పరీక్షలకి, ఉద్యోగ ఇంటర్వూస్ కు వచ్చే వారిలో కూడా ఇటువంటి ఆందోళనే ఉంటుంది. కారణం మన కంటే ఇతరులలో ఎక్కువ జ్ఞానం ఉందనో, మన కంటే ఎక్కువ చదువుందనో, మనకంటే బాగా మ

పద్యం – హృద్యం

నిర్వహణ: పుల్లెల శ్యామసుందర్ ఈ క్రింది "ప్రశ్న"కు పద్యరూపములో జవాబు పంపాలి. మీ జవాబులు విద్యుల్లేఖ ద్వారా (e-mail : padyam_hrdyam@yahoo.com) మాకు 20వ తారీఖు లోపల పంపించండి. ఉత్తమ పూరణలను తరువాయి సంచికలో ప్రచురిస్తాము. ఈ శీర్షికలో ప్రచురించడానికి పాఠకులనుండి పూరణలు మాత్రమే కాకుండా ప్రశ్నలను కూడా ఆహ్వానిస్తున్నాము. ప్రశ్నలు వీలున్నంతలో తేట తెలుగులో ఉండి, సమకాలీనములైతే బాగుంటుందని మా అభిప్రాయము. ఈ మాసం ప్రశ్న: రెండును రెండును గలుపగ రెండే యగురా! గతమాసం ప్రశ్న: నిషిద్ధాక్షరి: క, చ, ట, త, ప లు లేకుండా వేసవి సెలవలను వర్ణిస్తూ ఛందోబద్ధముగా పద్యము వ్రాయవలెను ఈ ప్రశ్నకు మాకు అందిన క్రమములో పూరణలు ఇలా వున్నాయి. నేదునూరి రాజేశ్వరి, న్యూజెర్సీ వేసవి సెలవల యందము రాసులు పోసిన సొగసులు రంజిల్లు మదిన్ హాసము వెన్నెల వెలుగులు మోసము లేదట  విందు మోహము లన్నన్ సూర్యకుమారి  వారణాసి, మచిలీపట్నం సీ 

సంజీవని – జీవనప్రదాత

సుజననీయం
- తాటిపాముల మృత్యుంజయుడు సిలికానాంధ్ర తను దత్తత తీసుకొన్న కూచిపూడి గ్రామాభివృద్ధిలో బాగంగా నిర్మిస్తున్న 'సంజీవని ' ఆసుపత్రి కోసం TV9 భాగస్వామ్యంతో నిధుల విరాళల కోసం ఒక విన్నూత్న కార్యక్రమం నిర్వహించింది. ఆ ప్రోగ్రాం పేరు 'sanjivanithon. వివరాలకోసం ఈ క్రింది వీడియో చూడండి. https://www.youtube.com/watch?v=hyaUIaq_SfI అలాగే మార్చి నెలలో విళంబి ఉగాది ఉత్సవంలో నిర్వహించిన 'అచ్చ తెలుగు అవధానం' ఈ నెలలో పుస్తక రూపంలో అచ్చు అవుతున్నది. Softcopy కూడా వెబ్ లో ఉంచబడుతుంది. తెలుగు సాహిత్యం, సంప్రదాయం, సంస్కృతి ప్రధానంగా వివిధ శీర్షికలతో వెలువడుతున్న సుజనరంజని ని ప్రోత్సాహించండి.

వీక్షణం- 70

వీక్షణం
వీక్షణం 70 వ సమావేశం కాలిఫోర్నియాలోని మిల్ పిటాస్ లోని స్వాగత్ హోటల్ లో జరిగింది. ఈ సమావేశాన్ని డా||కె.గీత కన్నడంలో నుంచి తనే అనువాదం చేసిన స్వాగత గీతంతో ప్రారంభించేరు. శ్రీ లెనిన్ అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమం ముందుగా "వేదం" గురించి శ్రీ శ్రీచరణ్ గారి ఉపన్యాసంతో ప్రారంభించబడింది. ముందుగా వేదం అంతే ఏవిటో వివరిస్తూ, వేదం ఆని చోట్లా ఉందని, అనుభవమే వేదమనీ అన్నారు. వేదాలు ముఖ్యంగా నాలుగు. ఋగ్వేదం, సామ వేదం, యజుర్వేదం, అధర్వ వేదం. మత్స్య పురాణంలో వేదాల గురించిన ప్రస్తావన ఉంది. వేదాలు అపౌరుషేయాలు. విభజన చేసినంత మాత్రాన వ్యాసుడు వేదకర్త కాదు. ఈశ్వరుడి చేత బ్రహ్మకు వేదాలు ఇవ్వబడ్డాయి. వేదంలో అన్నీ ఉత్తమ పురుషలో ఉంటాయి. ప్రతీ వేదం మళ్లీ నాలుగు విభాగాలు. సంహితము, బ్రాహ్మణకము, ఆరణ్యకము, ఉపనిషత్తులు. వీటిలో చెప్పిన సారాన్ని చివరగా చెప్పేది వేదాంతము. ఇలా వేదాల గురించి వివరంగా విశదీకరిస్తూ ఉపన్యాసం