Month: October 2018

వీక్షణం 74వ సమావేశం- సమీక్ష

వీక్షణం
- విద్యార్థి వీక్షణం 74వ సమావేశం శా.శ. ౧౯౪0 ఆశ్వీయుజ పంచమి నాడు, ( అక్టోబరు 14, 2018) నాడు, శ్రీ పెద్దిభొట్ల ఇందు శేఖర్, లావణ్య గార్ల గృహము నందు జరిగినది. ఈ సభకు అధ్యక్షత వహించిన ఆచార్య గంగిశెట్టి లక్ష్మీనారాయణ గారు ప్రసంగిస్తూ Myth అనే మాటకు తెలుగులో మిథ్య అనే మాటకు సరి పోలికలున్నవి. హిందీలో మిథిక అనే వాడుక ఉంది. ప్రపంచములోని ఎక్కడి మిథాలజీ కథలు అయినా, మనిషి ఎక్కడ ఉన్నా ఆలోచనలు ఒక్కటే అనేటట్లు ఋజువు చేస్తాయి. గ్రీకు మిథాలజీ కథలు కూడా అటువంటివే" అని చెప్పి, ప్రాచీన గ్రీకు కావ్యాలను సభకు పరిచయం చేయటానికి ఆసూరి వేణు గారిని ఆహ్వానించారు. వేణు గారి ప్రసంగ విశేషాలు - "ప్రాచీన గ్రీకు కావ్యాలు ఇలియడ్, ఒడిస్సేలు మన రామాయణ మహాభారతాలని పోలి ఉంటాయి. వీటి రచయిత హోమర్. షుమారు సామాన్య శక పూర్వం 6వ శతాబ్ది కి చెందినవాడు. హోమర్ అనాథ, పైగా అంధుడు. వాల్మీకిలాగా ఆనాటి కుల వ్యవస్థలో ఉన్న కష్టాలును అధిగమించి,

ఆత్మవిశ్వాసం

ధారావాహికలు
అమరనాథ్. జగర్లపూడి కౌన్సిలింగ్ సైకాలజిస్ట్ 9849545257 ఆత్మన్యూనత వద్దు ఆత్మవిశ్వాసమే ముద్దు (Inferiority to Self Confidence) మానవ జీవన అభివృద్ధి సోపానాలకు ఆత్మవిశ్వాసమే పునాది. ఆత్మవిశ్వాసం కొరవడిన జీవితం సంక్లిష్టంగా, బరువుగా నడుస్తుంది. ఇది కేవలం విద్యార్థులకో యువతకో పరిమితమైనది కాదు సమస్త మానవాళికి ఇది ఆవశ్యకమైనది.మనపై మనకున్న నమ్మకమే మనల్ని జీవిత వైకుంఠపాళి లో పరమపద సోఫానాన్ని అధిరోహింప చేస్తోంది. వైకుంఠపాళి లో క్రిందకు లాగే పాములే కాదు పైకి చేర్చే నిచ్చెనలు కూడా వుంటాయని అవగాహన మనలో ఉన్నంత వరకు ఆత్మన్యూనతా (Inferiority) తో కాదు ఆత్మవిశ్వాసం (Self Confidence) తో మన అభివృద్ధికి విఘాతం కలిగించే ఏ విషయాన్నైనా ధైర్యంతో ఎదుర్కోగలం! జీవన గమనంలో సామాజికంగా,సాంఘికంగా,సాంకేతికంగా జరిగే మార్పులు అనుక్షణం మన ముందు అనేకానేక కొత్త కొత్త సవాళ్ళను తెస్తుంటాయి. దాదాపు రెండు దశాబ్దాలుగా జరుగ

అహంకారం

సారస్వతం
-శారదాప్రసాద్ నిఘంటువు అర్థం ప్రకారం “అహం” అంటే “నేను”, “నా” అనే స్వంత సామర్థ్యానికి సంబంధించిన భావన. “నేను”, “నా”, అని సూచించేంతవరకు “అహం” అనేది ఒక పదం మాత్రమే. ఆత్మగౌరవానికి, అహంకారాకి తేడా ఏమిటంటే, “ఈ సామర్థ్యం నాకుంది” అనడం ఆత్మగౌరవం. “ఈ సామర్థ్యం నాకొక్కడికే ఉంది” అనడం అహంకారం . విద్య, ఐశ్వర్యం, అందం, అన్నిటిలో ఉన్నతులైన వారు రాణించాలంటే ముఖ్యంగా వారిలో ఉండవలసినది తగినంత అణకువ, వినయం . అహంకారానికి వయస్సు, ధన, కుల, మత ప్రాంత, భాష- ఇవేమీ సంబంధం లేదు. కొంతమంది (అతి)తెలివిగా తమ అహంకారాన్ని ఆత్మాభిమానం అని చెప్పుకుంటారు. అదే ఇతరుల గురించి చెప్పేటప్పుడు వారిది (అహంకారానికి) ‘గర్వం’ అని అంటారు. అహంకారం పెరిగితే ఈర్ష్య,అసూయ లాంటి మిగిలిన దుర్లక్షణాలు దాన్ని అనుసరిస్తాయి!పాండవుల కన్నా అన్నిటా నేనే గొప్పవాడిగా ఉండాలనే సుయోధనుడు దురాలోచనే కౌరవ వంశాన్ని నాశనం చేసింది. “మనోబుధ్ధి రహంకార చిత్తం

గుప్పిట్లో ఛందస్సు

సారస్వతం
-పెయ్యేటి రంగారావు లఘువుః పొట్టి అక్షరాలు. ఉదాః క, ల, ప, క్త, ప్ప, క్ర మొదలైనవి. ఋ త్వంతో కూడినవి. ఉదాః కృతి లో కృ. కాని కృష్ణుడు లో కృ గురువు అవుతుంది. ఎందుకంటే కృ తరువాత ద్విత్వాక్షరమైన ష్ణు వచ్చింది కనుక. తేల్చి పలికే రేఫకు ముందున్న అక్షరాలు. ఉదాః కద్రువ, అద్రి మొదలైనవి. లఘువుకు గుర్తుః I గురువుః దీర్ఘమైన (పొడుగు) అక్షరాలు. ఉదాః కా, లా, పా. మరిన్నీ, ఒత్తున్న అక్షరాలకు ముందు వచ్చే అక్షరాలు. ఉదాః రక్తి లో ర గురువు అవుతుంది. అభ్యాసము లో అ మరియు భ్యా గురువులు. పూర్ణానుస్వారంతో కూడిన అక్షరాలు. ఉదాః రం, యం, తం మొదలైనవి. పొల్లులతో కూడిన అక్షరాలు. ఉదాః నిన్, గల్, రన్ మొదలైనవి. విసర్గలతో కూడినవి. ఉదాః అంతఃపురము లో అం, తః గురువులు. ఐత్వంతోను, ఔత్వం తోను వున్న అక్షరాలు. ఉదాః కౌపీనము, కైలాసము లలో కౌ మరియు కై గురువులు. గురువుకు గుర్తుః Uగణములుః కొన్ని అక్షరములు కలిసి గణములు అవుతాయి. గణాలకు పేర్లు ఉ

హయగ్రీవ స్వామి

సారస్వతం
-శారదాప్రసాద్ హయగ్రీవ స్వామి చదువుల యొక్క దేవుడు.హయగ్రీవ స్వామిని కూడా విష్ణు అవతారముగా భావిస్తారు.హయగ్రీవుణ్ణి జ్ఞానమునకు, వివేకమునకు, వాక్కుకు, బుద్ధికి మరియు అన్ని విద్యలకు దేవుడుగా భావిస్తారు. హయగ్రీవ స్వామిని చదువుల యొక్క దేవుడుగా పూజిస్తారు.హయగ్రీవుడు, హయశీర్షగా కూడా పిలవబడుతున్నాడు. హయము అనగా గుర్రము. హయశీర్షుడు అనగా గుర్రపు తల కలవాడు. తెల్లని తెలుపు మానవ శరీరం, గుర్రం (అశ్వము) యొక్క తల, నాలుగు చేతులు. శంఖము మరియు చక్రము పై రెండు చేతులలో కలిగి యుండును. క్రింది కుడి వ్రేళ్ళు జ్ఞాన ముద్రలో అక్షరమాలను కలిగి యుంటాయి.ఎడమ చేతిలో పుస్తకము ఉంటుంది.హయగ్రీవ సతీమణి మరిచి (మరిచి బహుశా ఒక అవతారము), మరియు లేదా లక్ష్మి. శ్రావణ పూర్ణిమ హయగ్రీవ స్వామి అవతరించిన రోజు. హయగ్రీవ స్వామి వైష్ణవ సంప్రదాయంలో ప్రముఖ దేవత. ఉన్నత చదువు మరియు లౌకిక విషయాలను అధ్యయనం ప్రారంభించినపుడు హయగ్రీవ స్వామిని తప్పక ప

కథల కవితల పోటీ

జగమంత కుటుంబం
​​ TAGS ఆధ్వరంలో “శ్రీ UAN మూర్తి మెమోరియల్ రచనల పోటీ” విదేశాల్లో నివసిస్తున్న ప్రవాస తెలుగువారి రచనలకు TAGS ఆహ్వానం (మీ రచనలు మాకు అందవలసిన ఆఖరి తేదీ: డిసెంబర్ 15, 2018) రాబోయే సంక్రాంతి 2019 సందర్భంగా అమెరికా లో కాలిఫొర్నియా రాష్ట్ర రాజధాని నగరం అయినటువంటి శాక్రమెంటో లో నెలకొనిఉన్న శాక్రమెంటో తెలుగు సంఘం (TAGS)  “శ్రీ UAN మూర్తి మెమోరియల్ రచనల పోటీ “ నిర్వహిస్థుంది. భారత దేశం మినహా విదేశాలలో నివసిస్తున్న తెలుగు రచయితలందరినీ (ప్రవాస తెలుగు వారు) ఈ పోటీలో ఉత్సాహంగా పాల్గొని విజయవంతం చెయ్యమని సవినయంగా కోరుతున్నాం. మూడు వేలమందికి పైగా స్థానిక సభ్యులను కలిగి ఉన్న శాక్రమెంటో తెలుగు సంఘం తెలుగు భాష, తెలుగు సంస్కృతి వ్యాప్తి కి 2003 సంవత్సరం నుండి శాక్రమెంటో లో విశేష కృషి చేస్తుంది. అమెరికా, కెనడా, యూరోప్ మరియూ ఇతర విదేశాలల్లొ నివసిస్థున్న తెలుగు రచయితలకు ఇదే మా ఆహ్వానం. స్నేహపూర్వకమైన ఈ రచన

వీక్షణం ఆరవ వార్షికోత్సవం

వీక్షణం
-జయమాల & దమయంతి వీక్షణం ఆరవ వార్షికోత్సవం సెప్టెంబరు 16, 2018 న మిల్పిటాస్ లోని స్వాగత్ రెస్టారెంట్ లో ఘనంగా జరిగింది. సభను ప్రారంభిస్తూ వీక్షణం సంస్థాపకురాలు డా||కె.గీత ఆరేళ్ల ప్రస్థానాన్ని తల్చుకుంటూ ఇప్పుడు వీక్షణం ఇక్కడి వారి జీవితంలో భాగస్వామ్యమైపోయిందనీ, ఆపాలనుకున్నా ఆగని నిరంతర సాహితీ వాహిని గా అందరినీ అలరిస్తూందని, ఈ సంవత్సరం శేక్రమెంటో లో మరో శాఖతో విస్తరిస్తూ సాహితీ సేవలో మరో అడుగు ముందుకేసిందనీ అంటూ అందరికీ ఆహ్వానం పలికారు. ఉదయం సెషన్ కు శ్రీ చుక్కా శ్రీనివాస్ అధ్యక్షత వహించారు. ఇన్ని సంవత్సరాలుగా ఇక్కడ ఎడతెరిపి లేకుండా సాహిత్య సమావేశాలు జరుపుకుంటున్నామంటే మనందరిలో సాహిత్యాభిరుచి, సాహిత్యం పట్ల ఉన్న ఆసక్తి కారణమని అందరినీ అభినందిస్తూ సభను ప్రారంభించారు. ముందుగా శ్రీ తాటిపామల మృత్యుంజయుడు "భగవద్గీత ను ఎలా చదవాలి, ఎందుకు చదవాలి?" అనే అంశం పై ప్రసంగిస్తూ, తాను చెప్పదలుచుకున్నద