Month: October 2018

నీతి లేని…మానవ జాతి

కవితా స్రవంతి
🌷నీతి లేని...మానవ జాతి🌷 - కొప్పోలు యాదయ్య ముక్కు పచ్ఛలారని పక్షుల నిష్కల్మష ప్రేమకు కుల బురద అంటింది ఆ బురద ఎవరికి కనిపించదు ఆ బురద చూసే కళ్ళ దురదకు తప్ప.. ఆ బురద ఎన్ని రకాలుగా శుద్దిచేసుకున్నా, మూలాలు ఎదుటి వాడి మెదడులో దూలాలై దూరినవి జీవుల్లో మనిషి ఓ జంతువే మరి ఏ జంతువుకు లేని కుల వర్గాలు ఈ మనషికే ఎందుకో.. ఒక రకం చెట్టు ఒకే రకమైన పళ్ళనిస్తవి. ఒక జాతి పక్షులు ఒకే పద్ధతి న జీవిస్తాయి. సృష్టిలో ప్రతి జీవి తమ జీవన ధర్మాలను పాటిస్తూ మనుగడ సాగిస్తున్నాయి కానీ... తెలివైన , మానవతా, నాగరిక జీవిగా చెలామని అవుతున్న మనిషికే ఏ జీవన విధానం లేదు.. లేని కులాల మూఢత్వంలో ప్రకృతికి విరుద్ధంగా మనిషి కొత్త మృగమై రాక్షస క్రీఢలో మానవతా విలువలను మంటగలుపుతున్నాడు ఎవడో అంటించిన ఈ రంగుల రావణకాష్ట మనిషి రక్తం మాంసాలతో మండుతూనే ఉంది. ఇది మానవ అనాగరిక రాక్షసత్వనికి పరాకాష్ట ****

శ్రీ రామ సంగ్రహం

ధారావాహికలు
రావణుడి తాతతండ్రులు -అక్కిరాజు రామాపతి రావు సుకేశుడు ధర్మమార్గావలంబి అయినాడే కాని రాక్షస ప్రవృత్తినిస్వీస్వేకరించలేదు. గ్రామణి అనే గంధర్వుడు సుకేశుణ్ణి చూసి ఎంతో ముచ్చటపడి తన కూతురు దేవవతినిచ్చి అతడికి పెళ్ళి చేశాడు. సుకేశుడు దేవవతితో అభీష్టసుఖాలు పొందుతూ ఆనందంగా కాలం గడుపుతుండగా ఆ దంపతులకు క్రమంగా ముగ్గురు కొడుకులు పుట్టారు. వాళ్ళు ఆ సంతానానికి మాల్యవంతుడు, సుమాలి, మాలి అని పేర్లు పెట్టుకున్నారు. వాళ్ళు మహాదేవుడి వరప్రభావం వల్ల జన్మించారని ఆ తండ్రి ఎంతో మురిసిపోయినాడు. అయితే వీళ్ళకి తండ్రి తాతల సత్త్వగుణసంపద అబ్బలేదు. తమ తండ్రికి, శివానుగ్రహం ఉన్నదని తెలుసుకొని తాము కూడా అత్యంత బలపరాక్రమాలతో, లోకాలన్నిటినీ శాసించే శక్తిసామర్థ్యాలతో విలసిల్లాలని బ్రహ్మదేవుణ్ణి గూర్చి వాళ్ళు ముగ్గురూ ఘోరతపస్సు చేశారు. బ్రహ్మ ప్రత్యక్షమై వాళ్ళకు వారు కోరిన వరాలిచ్చాడు. ఇక వాళ్ళు అహంకరించి, తమకు ఎవరూ ఎదురు