Month: November 2018

పాపం! పిల్లల పాపం

కవితా స్రవంతి
- పారనంది శాంతకుమారి పుట్టకముందు దేవుడి దయ. పుట్టిన తరువాత ఆయా దయ. రెండు సంవత్సరాలోచ్చేసరికి బేబీకేర్ సెంటర్ దయ. చదువులకొచ్చేసరికి హాస్టల్ దయ. ఉద్యోగమొచ్చేక విదేశాల దయ. అలా పెరిగిన పిల్లలకు తెలియని పదం దయ. మరి వాళ్ళకెలా తెలుస్తుంది దయ? ఇక వాళ్ళెలా చూపుతారు దయ? ఐనా తాము పొందని దయను వాళ్ళెలా చూపగలరు? వాళ్ళ అమ్మానాన్నల ఆవేదనను వాళ్ళెలా బాపగలరు? అందుకే, అలాంటి పిల్లలు తల్లితండ్రులకు దూరమౌతున్నారు, వారికి అమ్మానాన్నలు భారమౌతున్నారు. అందుకే వారిని వృద్ధాశ్రమాలలో చేరుస్తున్నారు. ***

నిజమైన ప్రేమ

కవితా స్రవంతి
- భమిడిపాటి స్వరాజ్య నాగరాజా రావు. నిజమైన ప్రేమెప్పుడూ నిదర్శనాన్నికోరదు, పదిమందిలో ప్రదర్శనాన్ని కోరదు. మెప్పును ఆశించదు, ముప్పు తలపెట్టదు. విశ్వాసంతోనే విస్తరిస్తుంది,విశ్వాసంలోనే వికసిస్తుంది. మల్లెపూలు,మంచిముత్యాలు ప్రేమకు వీక్షణానికి,ఆక్షణానికి నేస్తాలు. కానీ మంచిమనసు,మంచిమాటలు ప్రేమకు శాశ్వతంగా ప్రశస్తాలు. నిజమైన ప్రేమ పరితాపాన్నిఒర్చుకుంటుంది, ప్రతికులాలనుండి పాఠాలను నేర్చుకుంటుంది. ఒరిమినే తన కూరిమిగా,చెలిమినే తన బలిమిగా, మౌనాన్నే మేలిమిగా భావిస్తుంది. ఇచ్చినమాటనే బాటగా చేర్చుకుంటుంది. తను కొలువున్న మనసునే మధురమైన భావాల తోటగా మార్చుకుంటుంది. ****

నివాళులు

సుజననీయం
నవంబర్ ఒకటి 2018 వతేదీన డా.మంగళగిరి ప్రమీలాదేవి గారు దివంగతులయ్యారు. ఆవిడ వయసు 75 సంవత్సరాలు. మచిలీపట్నంలో హిందూకాలేజ్ లో తెలుగులెక్చరర్ గా ఉద్యోగబాధ్యతలు నిర్వహించారు.చిన్నవయసులోనే సంగీతం లో డిగ్రీ పొందడమేకాక సాహిత్యంలో కూడా పేరుప్రఖ్యాతులు సంపాదించుకున్నారు.నలభైగ్రంధాలు రచించారు.తెలుగు, హిందీ, సంస్కృతం భాషలలో పాండిత్యంఉన్నవ్యక్తి. పదసాహిత్యంలో పరిశోధనలు చేసి పి.హెచ్.డి.పట్టా పొందారు.పదసాహిత్యపరిషత్ అనే సంస్థ స్థాపించి అనేక సాహిత్య సభలు మచిలీపట్నం లోనూ, హైదరాబాద్ లోనూ ఘనంగా నిర్వహించారు. ఆవిడ రాసిన పద్యగేయనాటికలకు 1971లో ఆంధ్రప్రదేశ్సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది. ఈమధ్య మధ్యప్రదేశ్ ప్రభుత్వం వారు ఆవిడకు సరస్వతీ సమ్మాన్ పురస్కారం ఇచ్చి సత్కరించారు.ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంఉగాది పురస్కారం ఇచ్చి గౌరవించింది. సుమారు నలభై సంవత్సరాలుగా ఆవిడ నాకు మంచి స్నేహితురాలు.సుజనిరంజనిలో కూడా మంచి వ్యా