Month: December 2018

ఆటవెలదిలో అమెరికా

కవితా స్రవంతి
- సబ్బని లక్ష్మీనారాయణ ఆట వెలది లోన అమెరికా కథరాసి తేట తెల్ల పరుతు తెలుగు లోన అగ్ర రాజ్య మదియు అన్ని రంగాలలో ఉజ్వలమ్ము చూడు ఉర్వి మీద ! చూడ చక్కదనము చూసిన మేరనూ అందమైన దేశ మదియ కనగ పచ్చదనము చూడు పరిశుభ్రతయు చూడు ముదము తోన మదియు మురిసి పోవ ! జాతులన్ని అచట రీతితో అలరారు మతము లన్ని యచట మసలి యుండు దేశ రక్షణమ్ము దీటైన పాలన క్రమము శిక్షణకదియు క్రతువు చూడు చెట్లు చేమ లవియు చేరి నిలకడగ పచ్చదనము చూడు పరిమళింపు అడుగు అడుగు లోన అంద మదియ చూడు ఎంచి చూడ బతుకు ఎదలు మురియ కుక్క పిల్ల కూడ కూడి బతుకు చుండు చెంత నుండె తోడు చెలిమి తీరు ముద్దు చేయ జనులు ముద్దార బతుకును చక్కనైన బతుకు కుక్క బతుకు ! అమెరికనెడు దేశ మందరి దదియును అద్భుతమ్ము లెన్నొ ఆలకింప సుందరమ్ము మనకు సుస్వాగతమనును అందమైన దేశ మదియ చూడు ! రోడ్ల మీద కార్లు రొప్పుకుంట జనులు దారులన్ని చూడు బారు తీరి కార్లు ఎక్కువచట దార్లు ప

రెండూ అవసరమే

కవితా స్రవంతి
- భమిడిపాటి స్వరాజ్య నాగరాజా రావు. జీవితానికి ఆటలు, చదువూ రెండూ అవసరమే. అమ్మ, ఆలి ఇద్దరూ అవసరమే. వయసు,మనసు రెండూ అవసరమే. శ్రమ, విశ్రాంతి రెండూ అవసరమే. నవ్వు, ఏడుపు రెండూ అవసరమే పగలు, రాత్రి రెండూ అవసరమే. ప్రేమ,ద్వేషం రెండూ అవసరమే. జ్ఞాపకం, మరపు రెండూ అవసరమే భక్తి, రక్తి రెండూ అవసరమే. సంసారం,సన్యాసం రెండూ అవసరమే. బంధం, మోక్షం రెండూ అవసరమే. ఆవేశం, ఆలోచన రెండూ అవసరమే ప్రేమ, ద్వేషం రెండూ అవసరమే ఆసక్తి, విరక్తి రెండూ అవసరమే పరవశం, పరితాపం రెండూ అవసరమే నమ్మకం, అనుమానం రెండూ అవసరమే శిక్ష, రక్ష రెండూ అవసరమే నిజం, అబద్ధం రెండూ అవసరమే గోప్యం, బహిరంగం రెండూ అవసరమే మౌనం, భాషణం రెండూ అవసరమే భోజనం, ఉపవాసం రెండూ అవసరమే కలిమి, లేమి రెండూ అవసరమే ఊహ,అనుభవం రెండూ అవసరమే! జననం, మరణం రెండూ అవసరమే. ****

అమెరికా ఉద్యోగ విజయాలు

ధారావాహికలు
శుభారంభం సత్యం మందపాటి చెబుతున్న అమెరికా ఉద్యోగ విజయాలు - 1 ఆదివారం ప్రొద్దున్నే ఫోను మ్రోగింది. అది తెలిసిన ఫోన్ నెంబరు కాదు. సేల్స్ వాళ్ళు పిలుస్తున్నారేమో వాళ్ళని నాలుగు చివాళ్ళు పెడదామని, వెంటనే ఫోన్ తీసుకుని “హలో” అన్నాడు కృష్ణ, కొంచెం కరుగ్గానే. “నేను బావా, అర్జున్ మాట్లాడుతున్నాను” “అర్జునా?.. ఏ అర్జున్?” “ఏ అర్జున్ కాదు బావా. బి. అర్జున్. బి అంటే భమిడిపాటి అర్జున్” అదెవరో తెలీక ముఖం ఇబ్బందిగా పెట్టాడు కృష్ణ. ఈలోగా అర్జున్ తనే అన్నాడు, “అవునులే. నువ్వు అమెరికాకి వచ్చి ముఫై ఏళ్ళ పైనే అయింది కదా. మర్చిపోయుంటావు. నేను మీ భమిడిపాటి పాండురంగారావు మామయ్య, సుబ్బలక్ష్మిగార్ల అబ్బాయిని. ఆమదాలవలస. అప్పుడు మా నాన్నా వాళ్ళ ఇంటికి దగ్గరలో వుండేవాళ్ళుట మీరు. నువ్వు అమెరికాకి వచ్చాకనే నేను పుట్టాను కదా. ఏదో ఒకటి రెండుసార్లు ఇండియాలో కలిశాం కానీ, పెద్దగా కలవలేదు. అదీకాక ఇప్పుడు మేమెక్కడో...

అన్నమయ్య శృంగార నీరాజనం

సారస్వతం
“వలపు నిలుపలేనివారము” -టేకుమళ్ళ వెంకటప్పయ్య అన్నమయ్య తానే నాయిక పాత్ర ధరించి "వలపు నిలుపలేనివారము" అంటూ స్వామి వారి ని పరిపరివిధముల బ్రతిమాలుతున్నాడు. ప్రశ్నలు వేస్తున్నాడు. ఓ శ్రీనివాసా! ఎన్నో మార్లు పట్టుకుని లాగుతుంటే ఏమి చెయ్యగలవారము “ అంటున్నాడు అన్నమయ్య. “అలాగే నీవు ఆగ్రహించినట్లైతే మేము ఉండగలమా ?” అంటూ స్వామిని బహువిధాల ప్రసన్నుడిని చేసుకోవాలని ప్రయత్నిస్తున్న నాయిక పాత్రధారిగా అన్నమయ్య రీతిని ఈ శృంగార కీర్తనలో గమనించండి. ఈ కీర్తన భక్తి భావాలతో ఉన్నప్పటికీ అన్నమయ్య భగవంతుని "రా" అని సంబోధిస్తూ...నాయిక శృంగారసమయంలో యిలాంటివి సాధారణం అనికూడా తెలియజేస్తున్నాడు అన్నమయ్య. వినండి. కీర్తన: పల్లవి: వలపు నిలుపలేనివారము నేమటుగాన పలుమారుఁ బట్టుకొన్నఁ బయికొనవేలరా ॥ వలపు ॥ చ.1. ఒత్తి నీవాడినమాటకోరువఁ జాలక నే- ముత్తరమిత్తము గాని ఊరకుండలేమురా బత్తి గొట్టానఁ బెట్టఁగఁ బనిలేదు వోరి నీ- చిత

సంపాదకుడు

కథా భారతి
ఆర్. శర్మ దంతుర్తి (విశ్వనాధ సత్యన్నారాయణ గారి ‘చిన్న కధలు’ పుస్తకంలో ‘రాజు’ అనే కధ చదివాక రాసినది ఇది. ఆయనని తల్చుకుంటూ, ఓ పాద నమస్కారంతో…) “మీరోజు” పత్రిక మొదటిసారిగా స్థాపించినప్పుడు సుధర్ముడనే ఆయన సంపాదకుడిగా ఉండేవాడు. ఆయన మహా కర్మిష్టి. పొద్దున కోడికూయడంతోనే లేచి ప్రక్షాణాదులయ్యేక కాస్త ఎంగిలిపడగానే నడుచుకుంటూ ఆఫీసుకొచ్చేవాడు దారిలో రాత్రి ప్రింటు చేసిన పత్రిక స్వంత డబ్బుల్తో కొని చంకలో పెట్టుకుని పట్టుకొస్తూ. ఆయనలా ఆఫీసుకి పోవడం పోవడం మళ్ళీ ఆయన ఇంటికొచ్చేసరికి చీకటి పడ్డాకే. ఈయన వెనక్కి వచ్చి పూజ గదిలో దీపం పెట్టుకుని ధ్యానం అయ్యేక భోజనానిక్కూచునే సరికి ఎనిమిదేళ్ళ పిల్లాడు హోమ్ వర్క్ చేసుకుంటూంటే వాడడిగిన దానికి సమాధానం చెప్పడం, పెళ్ళాం తో పిచ్చాపాటి మాట్లాడ్డం అయ్యేది. ఆ తర్వాత మళ్ళీ కూడా తెచ్చుకున్న ఆఫీసు కాయితాల మీద పడి కధలూ కాకరకాయలూ అన్నీ దిద్దుకుని జామురాత్రి మంచం ఎక్కేవాడు.

చేదు కూడా రుచే!

కథా భారతి
ఆచార్య పి.కె. జయలక్ష్మి M.A.,Ph.D., సోఫియా విశ్వవిద్యాలయం, సోఫియా, బల్గేరియా(EU) సంజె వాలుతోంటే ఆనందవల్లి మొక్కల దగ్గర్నించి నెమ్మదిగా లేచి బియ్యం ఏరుతూ ఆలోచనలో పడింది. భర్త అనంతశయనం చదువుతున్న పుస్తకం బల్ల మీద పడేసి “ ఆనందం! రాత్రికి ఏం వండుతున్నావేంటీ?” అని ఆసక్తిగా అడిగాడు. “ ఆ! మధ్యాహ్నం ముక్కల పులుసు, దోసకాయ పచ్చడి ఉన్నాయిగా,అప్పడాలు వేయిస్తా లెండి.” అంది చిరాగ్గా. “ నాల్గు బంగాళాదుంపలు వేయిద్దూ,కరకరలాడుతూ కమ్మగా “ ఆశగా అడిగాడు వంటింటి గుమ్మం దగ్గర నిలబడి. ‘” అబ్బ! కోరికలకేమీ తక్కువ లేదు. అలాగే చేస్తా గాని మీరోసారి డాబా మీదకెళ్లి మల్లె తీగ పక్కకి వాలిపోతోంది సరిచేసి రండి” అంటూ కుక్కర్ పెట్టి, దుంపలు తరగడం మొదలు పెట్టింది ఆనందవల్లి. “ఇదిగో ఇప్పుడే వెళ్తా ,కాసేపు నడిచి కూడా వస్తా .వంట పూర్తవగానే పిలు.” అంటూ డాబా మీదకి వెళ్ళాడు అనంతశయనం. ముక్కలు తరుగుతూ ఆలోచిస్తోంది ఆనందవల్లి.”’ ఏంటీ

అవగాహనతోనే “అహాన్ని” కాపాడుకుందాం!

కథా భారతి
(మన ఆత్మగౌరవం మన చేతుల్లోనే) -అమరనాథ్. జగర్లపూడి కౌన్సిలింగ్ సైకాలజిస్ట్ 9849545257 సమాజంలో నిత్యం మనం విభిన్న మనస్తత్వాలు, ఆలోచనలు కలిగిన వ్యక్తులతో సంబంధ బాంధవ్యాలు కలిగి ఉంటాము. సహజంగా వ్యక్తికి వ్యక్తికి మధ్య ఆలోచనా సరళిలో అనేక వ్యత్యాసాలు ఉండవచ్చు. ఇటువంటి సందర్భాలలో మనం ఇతరులతో మెలిగేటప్పుడు అత్యంత జాగురూకతతో వ్యవహరించవలసి ఉంటుంది.దీనికి మన మీద మనకు అవగాహన ఎంత ముఖ్యమో ఇతరుల పట్ల కూడా మనకు అవగాహన ఉంటూ మన పరిధి మేరకు మెలగాల్సి ఉంటుంది. అప్పుడు మన ఆత్మగౌరవం (ఈగో) మనం కాపాడుకోవటమే కాదు ఇతరుల ఆత్మగౌరవం కూడా (ఈగో) కాపాడినట్లవుతుంది. సహజంగా ప్రతి వ్యక్తి సమాజంలో తనదైన ఆలోచనా సరళితో ఇతరులతో మెలగటం మనం చూస్తూనే ఉంటాం! ఏ వ్యక్తి ఆలోచనా అయినా ప్రజామోదం, సామాజిక ఆమోదం, నీతి, నియమాలకు అనుకూలంగా (Positive) ఉండవచ్చు లేదా ప్రతికూలంగా (Negative) గా ఉండవచ్చు. ఇందులో వరుస ఏదైనా ఏ వ్యక్తి అయినా తన

ఆధునిక కవిిత్వంలో అనుభూతివాదం

ధారావాహికలు
-సునీత పావులూరి తిలక్ కవిత్వంలో భావ, అభ్యుదయ కవిత్వాలతో పాటుగా, రాబోయే అనుభూతివాద కవితా పరిణామం కన్పిస్తుందనీ, దానికి తిలక్ కవిత్వమే ఆరంభ సూచకమనీ టి.ఎల్. కాంతారావుగారు పేర్కొన్నారు. 1981లో ఇంద్రగంటి శ్రీకాంతశర్మగారు ఆలోచన అనే గ్రంథంలో ప్రత్యేకంగా 'అనుభూతివాదం' అనే వ్యాసాన్ని రాశారు. ఈ వాదం 'ఏ ఇజానికీ కట్టుబడి ఉందనీ’. ‘ఆత్మాశ్రయ కవిత్వానికి ప్రాణప్రదమైనదనీ’, అంతేకాక ‘అనుభూతికి అగ్రప్రాదాన్యం ఇస్తుంద’నీ వీరు చెప్పి సాహిత్యంలో దీనికి ఒక ప్రత్యేక స్థానాన్ని కల్పించారు. కడియాల రామమోహనరాయ్ గారు 1982లో "తెలుగు కవితా వికాసం" అనే గ్రంథంలో 'అనుభూతివాదం', ‘అనుభూతి కవిత్వం' అని పేర్లు పెట్టి ప్రత్యేకంగా రాయటం జరగలేదు. కానీ నూతన కవితారీతులను పరిచయం చేసేటప్పుడు మాత్రం 'అనుభూతివాదం', ‘అనుభూతి కవిత్వం', అనుభూతి కవుల' గురించి వీరు పేర్కోవటం జరిగింది. వీరు అనుభూతివాదాన్ని 'భావ కవితా సంబంధి'గానే చూసినా, ఈ