Month: March 2019

ఏదీ.?

కవితా స్రవంతి
-భమిడిపాటి స్వరాజ్య నాగరాజా రావు ప్రేమించటమే తప్ప ద్వేషించటం తెలియని వానికి ప్రారబ్ధమేది? దీవించటమే తప్ప దూషించటం తెలియని వానికి ధైన్యమేది? ప్రార్ధించటమే తప్ప అర్ధించటం తెలియని వానికి పరితాపమేది? జీవించటమే తప్ప మరణించటం తెలియని వానికి దేభ్యమేది?(దేభ్యం=పనికిమాలినది) ధ్యానించటమే తప్ప దేవులాడటం తెలియని వానికి దాసోహమేది? మోక్షాన్నే తప్ప స్వర్గాన్ని కాంక్షించని వానికి మోహమేది? వైరాగ్యమే తప్ప వైముఖ్యం లేనివానికి(వైముఖ్యం=వ్యతిరేకత) విహ్వలత ఏది?(విహ్వలత=బాధ వలన తపన) కర్తవ్యమే తప్ప కఠినత్వం ఎరుగని వానికి కర్మబంధనమేది?

వికారి ఉగాది

కవితా స్రవంతి
- రూపారాణి బుస్సా యుగానికి ఆదిగా యుగాదికి శ్రీకారంచుట్టుదాం ద్వికాలాలకు ప్రథమంగా ఉత్తరాయణ,దక్షిణాయనముల ప్రాముఖ్యతలు తెలుసుకుందాం దేవతల నవోదయంగా దైవ కాలజ్ఞానాన్ని అర్థంచేసుకుందాం భూలోకానికి పర్వదినంగా నూతన సంవత్సర వేడుకలు జరుపుకుందాం మామిడి చింతల పంటలకాలంగా తాజా పండ్లకు నోరూరిద్దాం వసంతపు పచ్చదనంగా ఆకుల నాట్యాలను ఆనందిద్దాం నక్షత్ర గమనాలకు ఆయుష్షుగా ఉగస్య ఆదిని గమనిద్దాం వేపపూవుల ఆలాపనలగా వేసవి ఆరంభాన్ని అనునయిద్దాం సూర్యుని భ్రమణములో తొలి దినముగా కాలం యొక్క ఉషస్సుతో ప్రయాణం చేద్దాం చైత్ర శుద్ధ పాడ్యమి ఉగాదిగా సాంప్రదాయపు నినాదాలను చాటి చెబుదాం వేదాలను రక్షించిన నాడుగా విష్ణుమూర్తికి నమనాలను అర్పించుకుందాం కొత్త చైతన్యంతో హృష్టిని ప్రచరించు సమయంగా వేడుకల స్పూర్తిలో చమత్కారం చూపిద్దాం మామిడి తోరణాల పచ్చని స్వాగతంగా ఇంటి గుమ్మాలను అలంకరిద్దాం సరికొత్త దుస్తుల ధారణతో

సెల్లోపాఖ్యానం

కథా భారతి
తమిరిశ జానకి హైదరాబాద్ డ్రయివింగ్ లో ఉన్నాడు సుందరం. జేబులో సెల్ మోగుతోంది. కాదుకాదు పాడుతోంది నిను వీడని నీడను నేనే అంటూ. కాస్తంత దూరంలోనే ట్రాపిక్ పోలీస్ కనిపించాడు. జేబుదాకా వెళ్ళిన చెయ్యి వెనక్కి వచ్చేసింది. ఆ ట్రాఫిక్ పోలీస్ అక్కడ లేకపోతే బండి నడుపుతూ మాట్లాడదామనే......బండి పక్కకి పెట్ట్టే ఉద్దేశం లేదు. అంత రద్దీలో పక్కకి పెట్టి కూచుంటే ఇల్లు ఎప్పటికి చేరాలి..... పైగా సి సి కెమేరాలు వచ్చి పడ్డాయిగా ప్రాణానికి అన్న కోపం . తన ప్రాణానికే ముప్పు అన్న ఆలోచన లేదు. ఇల్లుచేరాక ఇంటి గుమ్మంలో స్కూటర్ స్ట్టాండ్ వేసి వెంటనే సెల్ తీశాడు. స్నేహితుడు ప్రసాద్ కాల్. అతనితో మాట్లాడుతూనే ఇంటి తలుపు కొట్ట్టాడు. నీకసలు పిచ్చెక్కింది అంటూ పకపకా నవ్వుతూ తలుపు తీసిన భార్య కవిత మాటలకి జుట్టు పీక్కునేవాడే గానీ చెవికీ భుజానికీ మధ్య కనిపించింది సెల్. ఆమెగారి ఆత్మీయ స్నేహితురాలని అర్ధమయింది. ప్రసాద్ చెప్తున్నది

ప్రశ్న

ధారావాహికలు
ప్రశ్నల ప్రయాణంలో ప్రగతికి మార్గాలు అమరనాథ్ . జగర్లపూడి కౌన్సిలింగ్ సైకాలజిస్ట్ 9849545257 మనం ఏదైనా పని చేస్తున్నా, చూస్తున్నా, వింటున్నా వాటి తాలూకా కలిగే ప్రేరణల వలన మన మదిలో ఎన్నో ఆలోచలను ప్రశ్నల రూపంలో ఉత్పన్నమై వాటికి సంభందించిన సమాధానల కోసం మనసు తహ తహ లాడుతూ వుంటుంది. నిజంగా ప్రతి ఒక్కరికి ఇది ఆహ్వానించ తగ్గ పరిణామమే. ఎందుకంటె సమాధానం దొరకని ప్రశ్న మనసును వేధిస్తూ చికాకు పరుస్తూనే వుంటుంది. సమాధానం దొరికిన ప్రశ్న వలన అవగాహన పెరగటమే కాదు మనసు ఏంతో ఆనందంగా ఆత్మవిశ్వాసంతో తొణికిసలాడుతూ వుంటుంది నిజమే కదా ! ఆదిమానవ సమాజం నుండి ఆధునిక మానవుడి వరకు రాతి యుగాల నాటి రాతి పనిముట్ల నుండి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వరకు సాగిన, సాగుతున్న పురోగమనం వెనుక వున్న పునాదులు మానవుని మెదడులో అనుక్షణం మెదిలే ప్రశ్నలే అంటే అతిశయోక్తి కాదు. మెరిసే మెరుపులు,ఉరిమే ఉరుములు,వర్షించే మేఘాలు,భయంకర ధ్వనులతో

పద్యం – హృద్యం

నిర్వహణ : పుల్లెల శ్యామసుందర్ ఈ క్రింది "ప్రశ్న"కు పద్యరూపములో జవాబు పంపాలి. మీ జవాబులు విద్యుల్లేఖ ద్వారా (e-mail : padyam_hrdyam@yahoo.com) మాకు 20వ తారీఖు లోపల పంపించండి. ఉత్తమ పూరణలను తరువాయి సంచికలో ప్రచురిస్తాము. ఈ శీర్షికలో ప్రచురించడానికి పాఠకులనుండి పూరణలు మాత్రమే కాకుండా ప్రశ్నలను కూడా ఆహ్వానిస్తున్నాము. ప్రశ్నలు వీలున్నంతలో తేట తెలుగులో ఉండి, సమకాలీనములైతే బాగుంటుందని మా అభిప్రాయము. ఈ మాసం ప్రశ్న: నాస్తికులకు దైవమన్న నయమున్ భయమున్ (శ్రీ దువ్వూరి వి.ఎన్. సుబ్బారావు గారు పంపిన సమస్య) గతమాసం ప్రశ్న: శివరాత్రిన నిదురఁ బోవ చింతలు దీరున్ ఈ ప్రశ్నకు మాకు అందిన క్రమములో పూరణలు ఇలా వున్నాయి. నేదునూరి . రాజేశ్వరి, న్యూజెర్సీ దేవికి ప్రియమట పూజలు నవరాత్రులు విభవ మొంద నవదుర్గ లుగా శివునికి నీటను ముంచిన శివరాత్రిన నిదురఁ బోవ చింతలు దీరున్ సూర్యకుమారి వారణాశి, నార్త

గీతా సారం

సారస్వతం
-శారదాప్రసాద్ హిందూధర్మ సాహిత్యంలో ఎంతో ఉన్నతమైనది భగవద్గీత.వేదాలు,ఉపనిషత్తులు, శాస్త్రాలు, పురాణాలు, ఇతిహాసాలు, సిద్ధాంతాలు!-'వీటిలో దేన్ని అనుసరించాల’ ని చాలామంది అడుగుతుంటారు.దానికి సమాధానం--'సర్వ శాస్త్రమయీ గీతా..’. అన్ని శాస్త్రాల సారమే గీత అని శ్రీకృష్ణుడే చెప్పాడు.భగవద్గీత ఒక్కటి చదివితే చాలు, చాలా ధర్మ సూక్ష్మాలు తెలుస్తాయి! శాశ్వతమైన దానిని ,అశాశ్వతమైన దానిని గురించి చెప్పింది. పాప పుణ్యాలను విశదీకరించింది . ఆత్మస్వరూపాన్ని గురించి చెప్పింది. పరుల సుఖం కోసం జీవించమని చెప్పింది. పండితుడికి , స్థితప్రజ్ఞుడుకి గల తేడాను చెప్పింది. ప్రతిఫలాపేక్ష లేకుండా కర్మ చేయడంలో ఉండే ఆనందాన్ని గురించి చెప్పింది.ఎలా జీవించాలో,ఎలా జీవించకూడదో కూడా చెప్పింది.పరమాత్ముడికి ఇష్టమైన వారు ఎవరో చెప్పింది .ఆయనలో ఐక్యమయ్యే మార్గాన్నిచూపించింది .ఈ జన్మలో చేసుకున్న కర్మలను బట్టి,మరుజన్మ ఆధారపడి ఉ