Month: May 2019

ఆధునిక కవిిత్వంలో అనుభూతివాదం

ధారావాహికలు
సూక్ష్మంలో మొక్షంలాగా చటుక్కున పాఠకుడికి అనుభూతిని అందించ కలిగేవి ఖండకావ్యాలు, మినీకవితలే. ఈనాటి ఈ ఆధునిక కవితకు జీవితం భావచిత్రమే. ఈ భావచిత్రమే మినీ కవితకి కానీ, ఖండకవితకి కానీ రూపాన్నిస్తున్నది, నియమిస్తున్నది, దానిని అనుభవంగా పర్యవసింపచేస్తున్నది. ఈ భావచిత్ర తరంగాలే ఖండకావ్యాలకు రూపాన్నీ, గుణాన్నీ కల్పిస్తున్నాయి. అనుభూతికవిత భావచిత్రాలతోనే రూపుకడుతుంది. వాటినే అనుభూతులుగా పరివర్తింపచేస్తుంది. అందువల్లనే అనుభూతివాదులు పెద్దపెద్ద ప్రక్రియలను చేపట్టటం లేదు. అనుభూతివాదులంతా తమ రచనలకు ఖండకావ్య ప్రక్రియనే వాడుకుంటున్నారు. ఖండకావ్యం కాల్పనిక కవిత్వోద్యమంలో ప్రభవించిన ప్రధాన ప్రక్రియ. అందువల్లనే అనుభూతివాద కవిత్వం, కాల్పనికోద్యమ కవిత్వం ఒకటిగానూ, దగ్గర సంబంధం కలవిగానూ విమర్శకులు చెప్తున్నారు. అంతేకాదు, కాల్పనికోద్యమ కవులు సంప్రదాయంగా వస్తున్న మహాకావ్యాలను నిరాకరించి, ఖండకావ్య ప్రక్రియను చేపట్ట

గజల్

కవితా స్రవంతి
- డాక్టర్ భీంపల్లి శ్రీకాంత్ దిగులు చెందవద్దు దిగంతాలు మనవెంటే ఆవేదన చెందవద్దు ఆనందాలు మనవెంటే ఓటములు ఎదురైతే గుండె ధైర్యంతో సాగిపో గెలుపును ముద్దాడే విజయాలెప్పుడూ మనవెంటే అడ్డంకులు ఎదురైతే అడుగు ముందుకు సాగిపో లక్ష్యానికి చేరువైతే గమ్యమెప్పుడూ మనవెంటే కష్టాలు ఎదురైతే కదలి ముందుకు సాగిపో ఉదయాలు వికసిస్తే విజయాలెప్పుడూ మనవెంటే నిరాశలు ఎదురైతే ఆశయాల పల్లకిలో సాగిపో ఆశలు నెరవేరితే గెలుపులెప్పుడూ మనవెంటే గాయాలు ఎదురైతే సంతోషసాగరమై సాగిపో కన్నీటిని చెరిపేస్తే వెలుగులెప్పుడూ మనవెంటే విషాదాలు ఎదురైతే విహంగమై సాగిపో భీంపల్లి ఆనందాలు వెదజల్లే జీవితమెప్పుడూ మనవెంటే

అన్నమయ్య శృంగార నీరాజనం

సారస్వతం
-టేకుమళ్ళ వెంకటప్పయ్య ఇంకా నీమనసెట్టో యెఱఁగఁ జుమ్మీ ఈ కీర్తనలో అన్నమయ్య తన్ను తాను నాయికగా భావించుకొని స్వామీ! నీ మనసునాకు తెలియరావడంలేదు. తమరిపై నాకు ఎంత కోరిక ఉన్నా వెనుకంజ వేస్తున్నాను. మీరంటే నాకు ప్రేమలేక కాదు సుమా! మీరు అన్యమనస్కంగాను, చీకాకుతోను ఉన్నారు అంటూ అన్నమయ్య స్వామితో తన శృంగార వ్యవహారాన్ని ఏకరువు పెడుతున్నాడు. ఆ విశేషాలు ఈ కీర్తనలో చూద్దాం. కీర్తన: పల్లవి: ఇంకా నీమనసెట్టో యెఱఁగఁ జుమ్మీ కొంకితి నింతే నేఁ గొసరఁ జుమ్మీ చ.1 చుక్కలు గాయఁగా నేఁజూడఁ దలెత్తితి నింతె ఇక్కడ నేముండుతా నే నెఱఁగఁజుమ్మీ చిక్కువడ్డముత్యములు చేతులఁ బట్టితి నింతే అక్కర నివేఁటివని యడుగఁజుమ్మీ ॥ఇంకా॥ చ.2 తుమ్మిదలు బెదరఁగాఁ దోడ నే నవ్వితి నింతే తమ్మిమోవి నిన్ను నేమీఁ దడవఁజుమ్మీ వుమ్మ గాలివిసరఁగా నొంటి నేఁ బండితి నింతే అమ్మరో నీతో నే నలుగఁజుమ్మీ ॥ఇంకా ॥ చ.3 చీకాకురేకులు చూచి చే గోరగీరితి నింతే

వీక్షణం-81

వీక్షణం
సమీక్ష - ఛాయాదేవి ఛాయాదేవి వీక్షణం-81 వ సమావేశం శానోజే లోని క్రాంతి మేకా గారింట్లో జరిగింది. ఈ సమావేశానికి శ్రీ వేమూరి వేంకటేశ్వర్రావు గారు అధ్యక్షత వహించారు. ముందుగా అందరికీ పరిచితమైన వీక్షణం సాహితీ గవాక్షం సాహితీ లోకానికే వీక్షణంగా పేరు గాంచాలని సభలోని వారందరూ ఆకాంక్ష వెలిబుచ్చారు. మొదటి అంశంగా డా||కె.గీత శ్రీ విశనాథ సత్యన్నారాయణ గారి "జీవుడి ఇష్టం" కథానికను సభకు చదివి వినిపించి కథా చర్చకు ఆహానం పలికారు. ఈ కథపై ఆసక్తికరంగా చర్చ జరిగింది. కథలో నాగరిక, అనారిక ప్రజల్ని భారతదేశంలోని ప్రజలు, బ్రిటీషు వారిగా ఊహించుకోవచ్చని, ఇందులో ప్రధాన పాత్రధారి అయిన స్త్రీ ధైర్యాన్ని కొనియాడవలసినదని, సీతా రావణుల కథకు ప్రతిరూపమని, స్త్రీ హృదయం ఎవరూ దొంగిలించలేరని, కథ పురుషుడు రాసినందు వల్ల స్త్రీ హృదయావిష్కరణ సరిగా జరగలేదని, ఒక స్త్రీ తన పిల్లల్ని తన కళ్ల ముందు నిర్జీవం కానివ్వదని... ఇలా అనేక రకాల ఆసక్తి

అమెరికా ఉద్యోగ విజయాలు – 6

ధారావాహికలు
సత్యం మందపాటి చెబుతున్న మనస్థత్వాలు బుధవారం రాత్రి. భోజనాలు పూర్తి చేసుకుని, వాకింగుకి వెళ్ళి వచ్చారు కృష్ణ, రుక్మిణి. ప్రతిరోజూ లాగానే అలవాటు ప్రకారం, కృష్ణ ఒక తెలుగు పుస్తకం, రుక్మిణి ఒక ఇంగ్లీష్ పుస్తకం తీసుకుని చదువుకుంటూ సోఫాలో కూర్చున్నారు. అప్పుడే ఫోన్ మ్రోగింది. అర్జున్. “బావా, భోజనాలయిపోయాయా? ఇప్పుడు ఆలస్యంగా పిలిచి మిమ్మల్ని డిస్ట్రబ్ చేస్తున్నానా?” అని అడిగాడు. “ఏం లేదులే చెప్పు. మనం మామూలుగా వారాంతాలే కదా మాట్లాడుకునేది. ఇప్పుడు వర్కింగ్ డే పిలిస్తే, ఏదన్నా ఎమర్జెన్సీ ఏమో అనుకున్నాను. బాగానే వున్నావా?” అడిగాడు కృష్ణ. “నాకేం? సుబ్భరంగా వున్నాను. కాకపోతే ఒక ప్రశ్న. నీ సలహా అడుగుదామని..” అర్జున్. “ఫరవాలేదు, చెప్పు” అన్నాడు కృష్ణ. “మా క్వాలిటీ డిపార్ట్మెంట్ మీటింగుకి వెళ్ళాను ఇవాళ. అక్కడ క్వాలిటీ మేనేజర్, నలుగురైదుగురు ఇంజనీర్లు వున్నారనకో. వాళ్ళల్లో మూడు రకాల మనుష్యుల్ని చ

వలస

కథా భారతి
-ఆర్ శర్మ దంతుర్తి ఆఫీసునుంచి సాయంత్రం ఇంటికొచ్చిన రమణ లోపలికి వస్తూ అరిచేడు, “ఈ రోజు కొత్త న్యూస్; శాన్ ఆంటానియోలో నాకో మంచి ఉద్యోగం వచ్చింది మనం టెక్సాస్ వెళ్ళిపోతున్నాం.” “అదేమిటి, మరి ఇక్కడ ఈశ్వరి చదువో? మధుని ఇప్పుడే డే-కేర్ లో చేర్పించాం. వాడు కుర్రాడు కనక ఎలాగోలా తట్టుకున్నా, అమ్మాయి అక్కడ కలవగలదా? టెక్సాస్ అంటే అక్కడ స్పానిష్ మాట్లాడే మెక్సికన్లు ఎక్కువగా ఉంటారంటారు కదా?” కల్పన అడిగింది రమణని అనుమానంగా చూస్తూ. ఈ లోపుల, నాలుగో తరగతి చదివే అమ్మాయి ఈశ్వరికి ఇది అర్ధం అయిందో లేదో కానీ వీళ్ళ మధ్యలోకి వచ్చి ఈ తతంగం ఏమిటో చూడబోయింది. “మొన్నామధ్య ఇంటర్వ్యూకి వెళ్ళాను కదా, మొదట్లో ఉత్తి ఫేమిలీ కేర్ డాక్టర్ లా పనిచేస్తావా అని అడిగారు. ఆలోచిస్తాను అని చెప్పాను. కానీ ఈ రోజు ఫోన్ చేసి చెప్పారు మళ్ళీ, ఫేమిలీ కేర్, డయాబెటిక్ కేర్ కి కలిపి ఓ క్లినిక్ ఓపెన్ చేస్తున్నారుట. వస్తావా అని అడిగారు. వె

కల్హణుడు

సారస్వతం
-శారదాప్రసాద్ రాజతరంగిణి (రాజుల నది) వాయువ్య భారత ఉపఖండం యొక్క చారిత్రిక సంచిక.మరీ ప్రత్యేకంగా కాశ్మీరు చరిత్రకు సంబంధించి ప్రామాణిక గ్రంథం. దీన్ని సంస్కృతంలో రచించారు. రాజతరంగిణిని కాశ్మీరీ బ్రాహ్మణుడు కల్హణుడు క్రీ.శ.12వ శతాబ్దంలో వ్రాశారు.ఈ రచన సాధారణంగా కాశ్మీరు సంస్కృతీ సంప్రదాయాలను నమోదు చేస్తుంది.కానీ రాజతరంగిణిలోని 120 శ్లోకాలు అనంత దేవరాజు కుమారుడైన కలాశ్ రాజు పరిపాలనాకాలంలో జరిగిన అక్రమాలు, ప్రజావ్యతిరేక విధానాల గురించి వివరించింది. రాజతరంగిణిలోని ప్రాచీన చారిత్రిక వివరాలు ప్రాచీన భారతీయ చరిత్ర రచనకు ప్రామాణికంగా వినియోగపడుతున్నాయి. రాజతరంగిణి సంస్కృతభాషలో కాశ్మీరీ బ్రాహ్మణుడైన కల్హణుడు రాసిన కావ్యం. చారిత్రిక పాఠ్యంగా కాశ్మీరు ప్రాంతాన్ని గురించి వ్రాసిన గ్రంథాల్లో ఇది అత్యంత ప్రాచీనమైనది. కాశ్మీరు ప్రాంతం విస్తారంగా హిమాలయాలు, పిర్ పంజల్ శ్రేణి మధ్యలో వ్యాపించిన ప్రాంతం. కల్

శ్రీ వారాహీ దేవి

సారస్వతం
-శారదాప్రసాద్ కృష్ణవర్ణా తు వారాహీ మహిషస్థా మహోదరీ వరదా దండినీ ఖడ్గం బిభ్రతీ దక్షిణే కరే!! ఖేట పాత్రాభయాన్ వామే సూకరాస్యా లసద్భుజా!! తా|| శ్రీవారాహీ దేవి నల్లని కాంతితో, వరాహముఖంతో, మహిష వాహనం గలదై పెద్దపొట్టతో ఎనిమిది చేతులు(అష్టభుజ) కలిగి ఉంటుంది. వారాహి దేవి అమ్మవారి శక్తి రూపాలలో ఒకటి. ఈమెను సప్త మాతృకలలో ఒకామెగా, దశమహావిద్యలలో ఒకామెగా కొలుస్తారు. ఈమె వరాహ(పంది) ముఖం కలిగి ఉంటుంది. ఈమెను లక్ష్మీ దేవి స్వరూపంగా కూడా కొందరు కొలుస్తారు. లక్ష్మీదేవి రూపంగా కొలిచేప్పుడు ఈమెను మనిషి రూపంలో పూజిస్తారు. ఈమె వరాహ స్వామి అర్ధాంగి. వారాహి దేవిని శైవులు, వైష్ణవులు, శాక్తేయులు పూజిస్తారు. దేవీ మాహాత్మ్యంలో శుంభ-నిశుంభ వధ కథ ప్రకారం దేవుళ్ళ శరీరాల నుండి వారి స్త్రీ రూప శక్తులు ఉద్భవిస్తాయి. శివుడి నుండి శివాని, విష్ణువు నుండి వైష్ణవి, బ్రహ్మ నుండి బ్రహ్మాణి, ఇలా వరాహ స్వామి నుండి వారాహి ఉ