Month: June 2019

ఆధునిక కవిిత్వంలో అనుభూతివాదం

ధారావాహికలు
తొలిమెట్టు అని భావిస్తోంది. వ్యక్తి వ్యక్తిని వ్యక్తిగా గుర్తించటం నేర్చుకోవాలి. మానవ అంతర్వికాసం భౌతిక దృక్పథం వల్ల కలగదు. ఆధ్యాత్మికంగా మనిషి పురోభివృద్ధి చెందినప్పుడే మానవుడు పరిపూర్ణ వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటాడు. మానవుడు పరిపూర్ణ వ్యక్తిత్వాన్ని సాధించాలనే విషయం ఇప్పుడిప్పుడే అన్ని దేశాలవారూ గ్రహిస్తున్నారు. భారతదేశం ఆధ్యాత్మింగా సుసంపన్నదేశం. ప్రాచీన కాలంలోనే ఆధ్యాత్మిక దృష్టిని అలవరచుకొని ప్రతి మనిషి అంతర్వికాసాన్నీ, వ్యక్తి విలువలను కలిగి ఉన్నాడు. రాను రానూ పాశ్చాత్య ప్రభావం వల్ల దేశంలో అన్ని వేదమాతను వీడిపరప్రదేశం పట్ల ఆకర్షితుడయ్యాడు. పాశ్చాత్యులు మనిషిని బాహ్యంగానే వికసింప చేయగలిగారు కానీ అంతరంగికమైన వికాసానికి ఏమాత్రం కృషి చేయలేదు. వారు మనిషిని కేవలం సాంఘిక జంతువు (Social being)గానో, రాజకీయ జంతువు (Political being)గానో, ఆర్ధికజీవి (Economic being)గానో చూశారు. అంతేకాని వారి పరి

రామాయణ సంగ్రహం జులై 2019

ధారావాహికలు
రావణుడు మహోదగ్రంగా మధుపురం మీద పోయి పడ్డాడు. అన్న రాక విన్న కంభీనసి వల వల ఏడుస్తూ వచ్చి అన్నపాదాల మీద వాలిపోయింది. ‘అభయం' ఇస్తే గాని లేవనన్నది. మన్న్ననగా అభయం ఇచ్చాడు రావణుడు. ‘నన్ను అనాథను చేయవద్దు. నా పసుపు కుంకుమ నిలబెట్టు' అని వేడుకుంది. ‘సరే! మంచిది! ఏడీ నీ భర్త. నేను ఇంద్రుడిపై దండయాత్ర చేయడానికి వెళుతున్నాను. నీ భర్తను కూడా నాకు సహాయంగా రమ్మను' అన్నాడు రావణుడు. ఆ రాత్రి చెల్లెలింట సత్కారం పొంది మర్నాడు మధురాక్షసుణ్ణి కూడా వెంటబెట్టుకుని సకల సేనా పరివారంతో పయనించి కైలాస పర్వతప్రాంతంలో కుబేరుడి అలక పట్టణం సమీపంలో సేనతో విడిది ఏర్పాటు చేసుకున్నాడు రావణుడు. అది వెన్నెల రాత్రి. వసంత ఋతువు కూడా నేమో! ప్రకృతి రమణీయంగా ఉంది. దూరం నుంచి అచ్చరాల ఆటలూ, గందర్వుల పాటలూ వినవస్తున్నాయి. మలయా పవనమూ, వివిధ పుష్పసుగంధమూ రావణుణ్ణి మదన బాణ వివశుణ్ణి చేస్తున్నాయి. ఇంతలో ఒక దివ్యంగాన సర్వాలంకారభూషితురాల

వీక్షణం-82

వీక్షణం
వీక్షణం 82వ సమావేశం కాలిఫోర్నియాలోని మోర్గాన్ హిల్ లో డా||కె.గీత గారింట్లో ఆద్యంతం అత్యంత ఆసక్తిదాయకంగా జరిగింది. సంప్రదాయం ప్రకారం డా||కె.గీత, భర్త శ్రీ సత్యన్నారాయణ గారితో బాటూ కలిసి సభకు ఆహ్వానం పలికారు. ఈ సభకు శ్రీ వేమూరి వేంకటేశ్వరరావు అధ్యక్షత వహించారు. ముందుగా "తెలుగురచయిత.ఆర్గ్" నుండి శ్రీ పాలగుమ్మి పద్మరాజు గారి "ఉద్వేగాలు" కథను సభకు శ్రీ కిరణ్ ప్రభ చదివి వినిపించారు. రాజు, శేషి అన్నా చెల్లెళ్లు. కథా ప్రారంభంలో "ఉద్వేగాలు అంటే నాకు చాలా అసహ్యం. ఏమీ కారణం లేకపోయినా ఏడవగలగడం ఒక గొప్పతనమేమోగాని, సంఘమర్యాదకీ, నాగరికతకీ తగినదిమాత్రంకాదు. పెద్దవాళ్లెవరేనా కంటనీరు పెట్టుకొని ఏడిచారంటే నాకు రోత. నాకేగాదు, నాగరికత అంటే తెలిసిన ప్రతివాడికీని. హరిశ్చంద్రనాటకంలో కూర్చుంటేవేషాలు వేసేవాళ్లు సరిగా ఏడవలేకపోయినా, మనకి అటూ ఇటూ కూర్చున్నవాళ్లు ముక్కులు చీదుకుంటూ, గొంతులు సవరించుకొంటూ కళ్లనీళ్ల

కవిత్వం

కవితా స్రవంతి
- పారనంది శాంతకుమారి రాసేవారు ఎక్కువ,చదివేవారు తక్కువ ఇదీ నేటి కవితల పరిస్థితి. రాశి ఎక్కువ,వాసి తక్కువ ఇదే ఇప్పటి కవిత్వపు దుస్థితి. పదం పక్కన పదం పేరిస్తే దానినే కవిత్వమనుకోవటం పైత్యం. పదం హృదయాని స్పందిస్తే అది కవిత్వమౌతుందనేది సత్యం. మదిలో అలజడి కలిగితే కవితకు తొలినుడి చుట్టబడుతుంది. భావావేశపు సుడిలో మునిగితే కవితకు గుడి కట్టబడుతుంది. నిశ్శబ్ధంతో నువ్వు చేసే యుద్ధంలో నిర్వేదంతో నిన్నునువ్వు చూసుకొనే నిబద్ధంలో కవిత్వం జాలువారుతుంది. నిగూఢంలో నీతో నీవు చేసే సాహచర్యంలో నిర్భేధ్యంగా నీపై నీవు జరిపే గూఢచర్యంలో కవిత్వం నిన్ను చేరుతుంది.   ***

రెండవ వైపు

కవితా స్రవంతి
- భమిడిపాటి స్వరాజ్య నాగరాజా రావు అట్టుకు రెండవ వైపు ఉంటుందని తెలుసుకోలేని అజ్ఞానులం మనం. మన ………మనదీపమై వెలుగుతోందని గర్విస్తామే తప్ప, అదే దీపం మనం చేసుకున్న పాపమై, భవిష్యత్తులో మననే కాలుస్తుందని తెలుసుకొనలేము. కన్నూమిన్నూ కానని ఆవేశంలో, మిడిసిపాటుతో కూడిన యవ్వనంలో, మనం ఆడిందే ఆట, పాడిందే పాట అవుతూ ఉంటే, అదే శాశ్వతం అనుకుంటూ గడుపుతాము నేడు ఇటుకాలిన అట్టు రేపు అటుకూడా అలానే కాలుతుందని, గుర్తించలేము,తెలుసుకోలేము నేటి మన దుష్ప్రవర్తనలే రేపటి యమ పాశాలై మనని దుఃఖానికి గురిచేస్తాయని ఊహించలేము తీరా తెలిశాక చేయటానికి ఏమీ మిగిలి ఉండదు అనుభవించటమే తప్ప ఆలోచనకు తావుండదు ఆక్రోశించటమే తప్ప ఆచరణకు అవకాశం ఉండదు   ***

అన్నమయ్య శృంగార నీరాజనం

సారస్వతం
-టేకుమళ్ళ వెంకటప్పయ్య ఇద్దరూ నిద్దరే మనమేమి చెప్పేదే ఈ కీర్తనలో అన్నమయ్య తన్ను తాను చెలికత్తెగా భావించుకొని తోడి చెలికత్తెలతో అంటున్నాడు. ఏమి చెప్పమందువే చెలీ! నాయికా నాయికలు ఇద్దరూ ఇద్దరే ఒకరి మరొకరు తీసిపోరు ఏవిషయంలోను. అహోబల నారసింహుడైనా, ఆ యమ్మ శ్రీమహాలక్ష్మి అయినా అంటూ అన్నమయ్య శృంగార వ్యవహారాలను ఏకరువు పెడుతున్నాడు. ఆ విశేషాలు ఈ కీర్తనలో చూద్దాం. కీర్తన: పల్లవి: ఇద్దరూ నిద్దరే మనమేమి చెప్పేదే బద్దుగా దాపెను మెచ్చెఁ బ్రహ్లాదవరదుఁడు ॥ ఇద్ద ॥ చ.1. చక్కని మొకముచూసి సారెసారె మాటలాడి చిక్కించెనాపె తొలుత చేరియాతని మిక్కిలి మేలుదియై మేను చెమరించఁగాను పక్కన నాపెను నవ్వేఁ బ్రహ్లాదవరదుఁడు ॥ఇద్ద॥ చ.2. పీఁటమీఁదఁ గూచుండి ప్రియములు చెప్పి చెప్పి దూఁటి చన్నులనొ త్తెను తొలుతాతని పాటించి యాతని మోవిపండు చూచి నోరూరఁగా బాటగానాపెను నవ్వెఁ బ్రహ్లాదవరదుఁడు ॥ఇద్ద॥ చ.3. కాఁగిలించుక యిందిర కన్న

అమెరికా ఉద్యోగ విజయాలు – 7

ధారావాహికలు
సత్యం మందపాటి చెబుతున్న అమెరికా ఉద్యోగ విజయాలు – 7 రంగుటద్దాలు ఆ శనివారం ఉగాది. కృష్ణ ఇంట్లో పండగ భోజనం అయాక, వాతావరణం చాల బాగుంది కనుక, అర్జున్ బయటికి డ్రైవేలోకి వచ్చి నుంచున్నాడు. ఎదురింటి ఆయన, తల మీద తెల్లటి హాట్ పెట్టుకుని లాన్ మోవింగ్ చేస్తున్నాడు. అర్జున్ని చూసి ఒక చిరునవ్వు ఇచ్చి, చేయి వూపి మళ్ళీ తన పని తను చేసుకుంటున్నాడు. అతని వెనకనే వచ్చిన కృష్ణతో నెమ్మదిగా అన్నాడు అర్జున్, “ఏమిటి! మీ ఇంటి దగ్గర అందరూ అమెరికన్లు కాదా? నల్లవాళ్ళు కూడా వున్నారా?” అని. ఆ మాటలకు కృష్ణకు కొంచెం కోపం వచ్చినా, నెమ్మదిగా అన్నాడు, “ఆయన ఇక్కడే పుట్టి పెరిగిన అమెరికన్. కొన్ని తరాలుగా వాళ్ళు అమెరికన్సే! నేను ఇక్కడ నాలుగు దశాబ్దాలుగా వున్నా, ఆయన నాకన్నా ఎక్కువ అమెరికన్! అంతేకాదు, నీలాగా విదేశస్థుడు కాదు” అర్జున్ కొంచెం ఖంగుతిని, “అదికాదు బావా. మీరు వున్న కాలనీలో అన్నీ ఖరీదైన ఇళ్ళు కదా, మరి ఇక్కడ నల్లవా