Month: June 2019

e-Books

18వ సంస్థాపక దినోత్సవ ప్రత్యేకసంచిక అన్నమయ్య జయంతి ప్రత్యేకసంచిక వికారి ఉగాది ప్రత్యేక సంచిక

రామాయణ సంగ్రహం

ధారావాహికలు
యముడితో రావణుడి యుద్ధం ఇక అప్పుడు యముడు స్వయంగా రావణుడితో యుద్ధం చేశాడు. మృత్యుపాశం, కాలదండం ధరించి రావణుడిపైకి వచ్చాడు. ఇట్లా ఏడు రోజులు రాత్రింబవళ్ళు యముడికీ, రావణుడికీ జగద్భయంకరమైన యుద్ధం జరిగింది. ఎవరూ వెనక్కు తగ్గటం లేదు. అప్పుడు దేవతలు భయపడి బ్రహ్మదేవుడితో అక్కడకు చేరుకున్నారు. మృత్యుదేవత వీణ్ణి కబళిస్తానని ముందుకు రాగా, యముడు వారించి వీణ్ణి నా కాలదండంతో హతమారుస్తానన్నాడు. ఇంతలో బ్రహ్మ అక్కడకు వచ్చి యముడితో 'నా వరాలు వ్యర్థమైపోతాయి. వీణ్ణి ఇట్లా చంపవద్దు' అని జోక్యం చేసుకున్నాడు. అప్పుడు యముడు అసహనంతో అంతర్థానమైనాడు. ‘నేనే జయించాన'ని రావణుడు లోకం దద్దరిల్లే గర్జనలు చేస్తూ పుష్పకం ఎక్కి తన నివాసానికి వెళ్ళాడు. ఆ తరువాత రావణుడు పాతాళలోకం పైకి దండెత్తాడు. భోగవతి దాని రాజధాని. రావణుడు అక్కడకు చేరాడు. వాసుకిని వశపరచుకొన్నాడు. అక్కడ నుంచి నివాతకవచులనే క్రూరరాక్షసులు ఎవరికీ కనపడకుండా నివా

అష్టావక్రుడు

కథా భారతి
అర్చన ఆర్ట్స్‌ అకాడెమీ (హ్యూస్టన్‌), శ్రీ శారదా సత్యనారాయణ మెమోరియల్‌ ఛారిటబుల్‌ సొసైటీ, సంయుక్త కథల పోటీ 2019 -యర్రమిల్లి విజయలక్ష్మి ద్వితీయ బహుమతి పొందిన కథ హాల్లో నా ఎదురుగా గోడమీద ఎత్తున ఇనుప తీగకు బిగించిన మా తాతగారి నిలువెత్తు తైల చిత్రం వ్రేలాడుతోంది. పక్కనే మా మామ్మది. ఇంకా ఎవరెవరో పూర్వీకులు, కుటుంబ సభ్యుల ఫోటోలు, దేవుళ్ళ ఫోటోలు తగిలించి ఉన్నాయి. వాటిని చూస్తుంటే నేను పరిష్కరించవలసిన ఇంటి సమస్య గుర్తుకొచ్చింది. దాదాపు వంద సంవత్సరాల క్రితం మా తాతగారు కట్టించిన ఇల్లది. మా తాతగారికి ఇద్దరు మగ సంతానం. మా నాన్న, గోవిందు నాన్న. చిన్నతనంలోనే తల్లినీ, తండ్రినీ పోగొట్టుకున్నాడు గోవిందు. మా తాతగారు అయన తరువాత మా అమ్మ, నాన్న వాడ్ని మాతోనే పెంచారు. చాలా తింగరి తింగరిగా ఉండేవాడు. చదువు వంటపట్టలేదు. ఎప్పుడూ ఊరిమీద తిరుగుతూ ఎవరికే సాయం కావాల్సినా చేస్తుండేవాడు. కన్నవాళ్ళు లేకపోవటం వల్ల అ

జరుగుతున్న కథ

కథా భారతి
-కట్టా రాంబాబు ప్రథమ బహుమతి పొందిన కథ ఆరోజే కాలేజి 'రివోపెనింగ్‌ డే'. అందుకే అక్కడి వాతావరణమంతా ఉత్సాహంగాను, ఆహ్లాదకరంగాను వుంది. రంగు రంగుల సీతాకోక చిలుకల్లా అలంకరించుకున్న అమ్మాయిలు, అబ్బాయిలు చాలాకాలం తర్వాత కలుసుకొన్నారేమో ఆనందంగా కబుర్లు చెప్పుకుంటున్నారు. అక్కడంతా ''హాయ్‌'', ''హల్లో'' లతో గందరగోళంగావుంది. సమయం తొమ్మిదిన్నరే అయింది. క్లాసెస్‌ కమెన్స్‌ కావడానికింకా అరగంట టైముంది. చాలామంది అబ్బాయిలుకాంటిన్‌ ముందు నిలబడి క్రొత్తగా జాయినవ్వడానికి అప్లికేషన్లు తీసుకెళుతున్న అమ్మాయిలకు పోజులిస్తున్నారు. కాలేజిముందున్న గార్డెన్‌లో ఓ చెట్టు క్రింద నీడలో పదిమంది వరకు అమ్మాయిలు కూర్చొని తీరిగ్గా కబుర్లు చెప్పుకుంటున్నారు. వాళ్ళంతా ఫస్టియర్‌ పూర్తిచేసి సెకండియర్‌ డిగ్రీలో ప్రవేశిస్తున్నారు. సమయం కావడంతో ప్రిన్సిపాల్‌గారు తమ 'హోండా సిటీలో' వచ్చి ఆఫీసులో కూర్చున్నారు, లెక్చరర్లు కూడ ఒక్క

చెఱసాల

కథా భారతి
-నండూరి సుందరీ నాగమణి ద్వితీయ బహుమతి పొందిన కథ “పిల్లాడు ఫోన్ చేసాడండి, అక్కడ టార్చర్ తట్టుకోలేకపోతున్నాడట!” దీనంగా చెప్పింది రాజేశ్వరి భర్తకు కాఫీ కప్పు అందిస్తూ. “చూడు రాజీ, ఇది పోటీ ప్రపంచం… ఇక్కడ మనమూ పోటీ పడకపోతే తప్పదు… వాడికి ఇంటిమీద బెంగ ఉండటం సహజం. కానీ... నిజానికి వాళ్ళు చాలా బాగా చూసుకుంటారు. అసలలాంటి కార్పొరేట్ కాలేజీ అయితేనే వీడిలాంటి బద్దకిష్టులకి సరియైన చోటు… నువ్వేం బెంగపడకు, వాడలాగే అంటాడు.” తాపీగా టీవీ ఛానల్ మార్చుతూ, కాఫీ సిప్ చేయసాగాడు గరళకంఠం. “అయ్యో, మీకెలా చెప్పాలి? మొదట్లో టాప్ టెన్ లో ఉండేవాడు కనుక బాగానే ఉండేది. ఇప్పుడు వాడి రాంక్ తగ్గిపోవటంతో సెక్షన్ మార్చేసారట. వీడిని… వీడిననే కాదు వీడి క్లాసుమేట్స్  అందరినీ ఎంతో  హీనంగా చూస్తారట. ఎన్నో మాటలు, సాధింపులనట… ఛ! ఏం మాస్టర్లండీ? ఎగతాళిగా మాట్లాడుతూ, పిచ్చి పిచ్చి అడల్ట్ జోక్స్ కూడా వీడిమీద వేస్తారట! ముడుకుల

ఎన్నటికి చెడని వాగ్గేయం

సుజననీయం
మనం నిత్యజీవితంలో అగుపించే వస్తువులు కాలక్రమేణ క్షీణిస్తూ చివరకు అంతరించిపోతాయి. బంగారు ఆభరణాలకు కూడా 'తరుగు' ఉంటుంది. విశాల విశ్వంలో ఉన్న అతిపెద్ద నక్షత్రాలు చిట్టచివరి దశలో కాంతిని గుప్పిట బంధించే 'కృష్ణబిలాలు'గా మారుతాయని విజ్ఞానశాస్త్రం ఋజువు చేస్తున్నది. కాని, సర్వకాల సర్వావస్థలయందు అనుక్షణం, ప్రతి తలంపు శ్రీ వేంకటేశ్వరుడుపై మోపిన అన్నమాచార్యుడు 'శ్రీహరి పాదతీర్థమె చెడని మందు' అంటూ శుక్రవారం స్వామికి జరిగే తిరుమజ్జనోత్సవంలో కీర్తించాడు. 'చెడని మందు ' అతి తేలికైన తేటతెల్లని పదం. చిన్న పిల్లాడు కూడా అర్థం అలవోకగా చెప్పేస్తాడు. ఎల్లప్పుడు హితాన్ని కోరుతూ, తన పాండిత్యం ఎక్కడా ఆధిపత్యం చేయనీయకుండా, సంకీర్తనలు రచిస్తూ స్వరపరుస్తూ పాడుతూ నాట్యం చేస్తూ ప్రజల హృదయాలలో సుస్థిర స్థానం సంపాదించాడు అన్నమయ్య. మే 25, 26, 27 తేదీల్లో సిలికానాంధ్ర అన్నమయ్య జయంతి ఉత్సవాన్ని ఎంతో ఘనంగా నిర్వహించింది.