Month: July 2019

కుమార సంభవం

సారస్వతం
-శారదాప్రసాద్ కుమారస్వామి జననం గురించి పురాణాలలో పలు కధలు ఉన్నాయి.మహాకవి కాళిదాసు వ్రాసిన కుమార సంభవంలో కుమారస్వామి జననం వరకే ఉన్నది.మిగిలిన వృత్తాంతం శివపురాణం,స్కాంద మరియు ఇతర పురాణాల్లో ఉంది. పూర్వం తారకాసురుడు అనే రాక్షసుడు అహంకారపూరితుడై సకల సజ్జనులను హింసిస్తూ ఉంటాడు.అతని బాధలను భరించలేని దేవతలందరూ కలిసి బ్రహ్మదేవుడి వద్దకు వెళ్ళి మొరపెట్టుకున్నారు. అప్పుడు బ్రహ్మదేవుడు వారితో ఇలా చెప్పాడు -- శివుడు తపస్సు మానేసి పార్వతీదేవిని వివాహం చేసుకున్నట్లైతే,వారికి జన్మించే కుమారుడు తారకాసురుడిని అంతమొందిస్తాడు అని! దేవతలు వెంటనే శివుడి మీదకు మన్మధుడిని ప్రయోగిస్తారు. శివుడు మన్మథుడిని దహించి వేస్తాడు .తారకాసురుడిని అంత మొందించవలసిన అవసరాన్ని గుర్తించిన శివుడు తనకు పరిచర్యలు చేస్తూ ఉన్న పార్వతీదేవిని వివాహం చేసుకున్నాడు. వారిద్దరూ శృంగారంలో తేలియాడుతూ ఉన్న సమయంలో శివుడి రేతస్సు జారి భూమిపై

అబ్బూరి ఛాయాదేవి

సుజననీయం
ప్రముఖ రచయిత్రి అబ్బూరి ఛాయాదేవి ఎప్పుడూ చిరునవ్వు తొణికిసలాడే వదనం....ప్రశాంతత నిండిన చూపులు....సంభాషణల్లో అలవోకగా అమరి కురిసే చమత్కారాలు ....అమ్మలా ప్రతిఒక్కరితో అతిమృదువుగా పలకరింపులు.....అవును ఆవిడే అబ్బూరి ఛాయాదేవి. 1933 అక్టోబర్ 13న రాజమండ్రిలో సంప్రదాయ కుటుంబంలో జన్మించారు. ఆరోజుల్నిబట్టి ఆడపిల్లలకి పెద్ద చదువులు చెప్పించడం ముఖ్యం కాదు పెళ్ళి తొందరగా చేసెయ్యాలి అన్న పద్ధతి పాటించారు ఆమె తరఫు పెద్దలు. ప్రసిద్ధ సాహితీవేత్త అబ్బూరి రామకృష్ణరావుగారి కోడలిగా ప్రసిద్ధ రచయిత విమర్శకులు అయిన అబ్బూరి వరద రాజేశ్వరరావుగారి సతీమణిగా సంసారజీవితంలో అడుగు పెట్టారు ఛాయాదేవిగారు. రాజేశ్వరరావుగారితో సాహితీచర్చలు జరిపేందుకు ప్రముఖ కవులు రచయితలు వారి ఇంటికి వచ్చేవారుట. స్వతహాగా ఆమెకు కూడా సాహిత్యం పట్ల చాలా ఆసక్తి ఉండడం వలన ఆమెకూడా ఆచర్చల్లో పాల్గొనేవారుట. ఆవిధంగా ప్రముఖ కవులు రచయితలు తనకు పరిచయ