Month: August 2019

నమామి భగవత్పాదం

సారస్వతం
-శారదాప్రసాద్ హిందూమత ఆలోచనా సరళిపై అత్యంత ప్రభావం కలిగిన సిద్ధాంతవేత్త ఆది శంకరాచార్యులు . ఆది శంకరులు, శంకర భగవత్పాదులు అని కూడా పిలువబడి హిందూమతాన్ని ఉద్ధరించిన త్రిమతాచార్యులలో ప్రధములు. గురువు, మహాకవి. శంకరులు ప్రతిపాదించిన సిద్ధాంతాన్ని అద్వైతం అంటారు. క్రీ.శ. 788 – 820 మధ్య కాలంలో శంకరులు జీవించారని ఒక అంచనా కానీ ఈ విషయమై ఇతర అభిప్రాయాలున్నాయి. శృంగేరి శంకరమఠం ప్రకారం శంకరులు క్రీ.శ. 788 లో జన్మించారు.శంకరులు సాక్షాత్తు శివుని అవతారమనే నమ్మకం ఉంది. దుష్టాచారములను నశింపచేయటానికి కైవల్య నాయకుడైన శంకరుడే ఆది శంకరుని రూపంలో అవతరించాడని ఆస్తికుల నమ్మకం. బౌద్ధమతం ప్రభావం వల్ల క్షీణించిన హిందూ ధర్మాన్ని పునరుద్ధరించాడు. అయితే ఈ ప్రక్రియలో (భౌతికంగా) ఏ విధమైన బల ప్రయోగం చేయలేదు. దేశదేశాలలో పండితులతో వాదనలు సాగించి, వారిని ఒప్పించి, నెగ్గి, శంకరులు తన సిద్ధాంతాన్ని వారిచే ఒప్పించాడు. శంకర

నీ సన్నిధి

కవితా స్రవంతి
-వెన్నెల సత్యం అనుక్షణమూ చకోరమై తపిస్తాను నీకోసం!! నా విరహమె గజళ్ళుగా రచిస్తాను నీకోసం!! నీ సన్నిధి లేనప్పుడు ఈస్వర్గం నాకెందుకు నవ్వుతూనె నరకాన్ని వరిస్తాను నీకోసం!! నీతో నేను గడిపినదీ ఓ గుప్పెడు క్షణాలే జ్ఞాపకాల సంద్రాన్నే మధిస్తాను నీకోసం!! ఊపిరివై నావెంటే నిలిచావా ఓ చెలియా ఏడేడూ లోకాలను జయిస్తాను నీకోసం!! ఎదగుడిలో దేవతవై నీవున్నది ఓ 'సత్యం' నా ప్రాణం తృణప్రాయం త్యజిస్తాను నీకోసం!!

అమెరికా ఉద్యోగ విజయాలు – 9

ధారావాహికలు
సత్యం మందపాటి చెబుతున్న గణాధిపత్యం! “మన ఈనాటి ప్రహసనం, ఒక జోకుతో మొదలుపెడతాను. ఇది నువ్వు వినే వుంటావు. జోకంటే నా జోకు కాదు. తెలుగు హాస్య ప్రియునందరికీ గురువుగారు ముళ్ళపూడి వెంకటరమణ గారిది” అన్నాడు కృష్ణ. అర్జున్ సర్దుకు కూర్చుని, “చెప్పు బావా, నాకు ముళ్ళపూడిగారి జోకులంటే ప్రాణం” అన్నాడు. “ఒక పల్లెలో రెడ్డిగారి పార్టీకీ, నాయుడుగారి పార్టీకీ పెద్ద పోట్లాట జరుగుతున్నదిట. పోట్లాట అంటే నోటి దురద తీర్చుకునే నోట్లాట కాదు. రెండు పార్టీల వాళ్ళూ ఆవకాయ పెట్టుకునే కత్తులతో, చకచకా ఒకళ్ళనొకళ్ళు నరికేసుకుంటుంటే, వాళ్ళ తలకాయలు నరికిన పుచ్చకాయ ముక్కల్లాగా ఎగిరి పడుతున్నాయిట. ఆడవాళ్ళూ, పిల్లలూ భయంతో ఇంట్లోనించీ బయటికి రావటం లేదు. కానీ అక్కడ రచ్చబండ దగ్గర ఒకాయన మాత్రం, తాపీగా చుట్ట త్రాగుతూ, ఆకాశంలోకి చూస్తూ, కాలు మీద కాలు వేసుకుని పడుకుని వున్నాడుట. వాళ్ళు ఎంత కొట్టుకుంటున్నా, ఆయన దగ్గరికి వచ్చేసరికీ

రామాయణ సంగ్రహం

ధారావాహికలు
సంభ్రాంతులై మెచ్చుకున్నారు అగస్త్యముని కథనాన్ని. ‘ఇప్పుడు నాకంతా జ్ఞాపకం వస్తున్నది. రాక్షసుల వృత్తాంతం నాకిదివరకు తెలిసిందే కదా!’ అని విభీషణుడు విస్మయం ప్రకటించాడు. అగస్త్య మహర్షి 'రఘురామా! అట్లా రాక్షసులు ఒకనాడు వీరవిహారం చేశారు' అని రావణాదులను గూర్చి ప్రస్తావించాడు. శ్రీరాముడు ఆశ్చర్యపడి 'భూలోకంలో ఎవరూ రావణుని పరాభవించ లేదా?’ అని అడిగాడు. ‘అది కూడా చెపుతాను విను' అని అగస్త్యమహాముని చిరునవ్వు చిందించాడు. రావణుడు ఒకసారి కార్తవీర్యార్జునుడు పరిపాలించే మాహిష్మతీపురానికి వెళ్ళాడు తన జయశీలతను నిరూపించుకోవడానికి. అప్పుడు కార్తవీర్యార్జునుడు సుదతులతో జలవిహారేచ్చతో నర్మదా నదికి వెళ్ళాడు. నగరంలో లేడు. అప్పుడు రావణుడు ప్రగల్భంగా 'నేను మీ రాజుతో యుద్ధం చేయటానికి వచ్చాను. పోయి నా యుద్ధ ఆహ్వానాన్ని తెలపండి' అని మంత్రులను సమీపించి కోరాడు. వాళ్ళు 'మా రాజు నగరంలో లేడు' అని చెప్పారు. మాహిష్మతీ నగరంలో ప

ఆధునిక కవిత్వంలో అనుభూతివాదం

ధారావాహికలు
అరవింద ఆధ్యాత్మిక మానవతావాదం అధర్మమార్గం నుండి ధర్మమార్గం వైపుకు, లౌకికస్థితి నుండి అలౌకికస్థితికి మళ్ళిస్తుంది. ఈ స్థితిలో మానవుడు పరిపూర్ణ జ్ఞానాన్ని పొందుతాడు. ఈ సమగ్ర పరిపూర్ణతకి మానవుడే ఆధారం. భౌతిక పదార్థాలతో ఆధ్యాత్మిక సత్తను సందర్శించి, లౌకిక జీవితంలో ఆముష్మిక చింతనకు స్థానమేర్పరచి, పారమార్థిక సత్తలో భౌతిక అంశాలను ప్రతిష్టించి భౌతికతకు - ఆధి భౌతికతకు మధ్య, లౌకిక - ఆముష్మిక జీవితాలకు మధ్య అఘాధాన్ని పూరించిన ఘనత అరవిందునిదే. ఆధ్యాత్మిక చింతన ద్వారా మానవత్వపు విలువలను నేడు పరిరక్షిస్తున్న విశ్వవ్యక్తి సత్యసాయి. మానవుడిలో ఉన్న పశుత్వం నశిస్తేనే మానవత్వం వృద్ధి పొందుతుంది. మానవుడు నిరహంకారిగా ఉండాలి. మనిషిలోని సహజ గుణమైన మానవత్వం పోషింపబడటమే కాదు దాన్ని వికసింప చేయమంటారు సత్యసాయి. మానవత్వాన్ని పవిత్రమైన విద్యగా, పవిత్రమైన దివ్యత్వంగా, పవిత్రమైన తపస్సుగా భావించారు, భావించమంటారు. లౌకిక జ

*తెలుగు వెలుగు*

కవితా స్రవంతి
-అభిరామ్ పరాయి భాషలన్ని నేలపై తారలైతే ఆ తారలకే వెన్నెలనిచ్చే నేల చంద్రుడే తెలుగు పరాయి భాషలన్ని ప్రవాహించే నదులైతే ఆ నదులన్నింటికి పవిత్రతనిచ్చే గంగతీర్థమే తెలుగు పరాయి భాషలన్ని గొప్పగా కనిపించే చెట్లు అయితే ఆ చెట్లన్నిటికి ప్రాణం పోస్తూ తన ఘనతను త్యాగం చేసే వేరు రూపమే తెలుగు పరాయి భాషలన్ని మాటలైతే ఆ మాటలకే మమకారం పంచే మాధూర్య స్వభావం తెలుగు పరాయి భాషలన్ని పోటాపోటి తత్వాలైతే ఆ పోటికే దీటుగా నిలిచిన ద్రవిడ భాష తెలుగు

వీక్షణం సాహితీ గవాక్షం – 84

వీక్షణం
-ఛాయాదేవి వీక్షణం 84 వ సమావేశం లాస్ ఆల్టోస్ లోని ఉదయలక్ష్మి గారింట్లో ఆద్యంతం అసక్తిదాయకంగా జరిగింది. ఈ సమావేశానికి శ్రీ పెద్దు సుభాష్ అధ్యక్షత వహించారు. డా||కె.గీత శ్రీమతి చాగంటి తులసి గారి కథ "యాష్ ట్రే" చదివి వినిపించి కథా పరిచయం చేశారు. తరువాత జరిగిన కథా చర్చలో భాగంగా కథలో స్త్రీ వాదం, విశ్వప్రేమ, మాతృహృదయం, స్వార్థ నిస్వార్థాలు, స్త్రీ, పురుషుల మధ్య సున్నితాంశాలు, కథ నేరేషన్ మొ.న అంశాలను గురించి సుదీర్ఘ చర్చ జరిగింది. రచయిత్రి, కథా వివరాలు అందజేస్తూ "డాక్టర్ చాగంటి తులసి గారు తెలుగు పాఠకులకి పరిచయం చెయ్యవసరం లేని పేరు. చాసో కుమార్తె గానే కాక రచయిత్రి గా, అనువాదకురాలిగా, సాహిత్య కార్యకర్తగా ఆమె ప్రఖ్యాతిని పొందిన విశిష్టమైన , తెలుగు సాహిత్యం గర్వించదగ్గ సాహితీ మూర్తి. హిందీ, ఒడియా , తెలుగు నడుమ భాషా వారధి గా ఆమె ఎన్నో అనువాదాలు చేశారు. రాహుల్ సాంకృత్యాన్ ‘ఓల్గా నుండి గంగకు’ హిందీ ను

తెలుగు వైభవము

కవితా స్రవంతి
-రచన: ఆచార్య రాణి సదాశివ మూర్తి సంస్కృతమ్ము నుండి సంస్కారములనొందె తమిళ కన్నడాలతళుకులొందె మలయసింహళములమక్కువన్ మన్నించె మధ్యదేశభాష మదిని నిల్పె. ఒరియ నుడిని గూడి ఒరవడి గుడికట్టె తెల్ల వాని భాష తెగువ జూచె. పారసీకపుర్దు భాషల యాసల తనవి చేసుకొనియె తనివి దీర. తెలుగు పాత్రలోన తేనెలూరగ నిండి భాషలన్నికలిసి బాస జేసె మధురసమ్ములేము మధుపాత్ర తెలుగేను దేశభాషలందు తెలుగు లెస్స భాష తెలుగు జూడ భావమ్ము తెలుగేను బలము మేమె వెనుక ఫలము తెలుగు. పలికె నిట్లు తాము పలుకుబడుల పెంచె తెలుగు జగతిలోన తేజరిల్ల. రాజసభలలోన రాణించె రసరమ్య కవులకావ్యవాటి కన్య తాను. పద్యగద్యకృతుల పరిపాటి తానాయె తెలుగు నింగి తనకు తెన్ను యనుచు. -:-