Month: December 2019

అన్నమయ్య శృంగార నీరాజనం జనవరి 2020

సారస్వతం
-టేకుమళ్ళ వెంకటప్పయ్య పూవుటమ్ములు మరుఁడు అన్నమయ్య శ్రీ వేంకటనాధుని విరహవేదనను వివరిస్తున్నాడు. ఆ మన్మధుడు నా మదిలో మరులు రేపుతున్నాడు. చిలిపి కయ్యాలెందుకు? నేను శ్రీవేంకటేశ్వరుడను. నీ పతిని అంటూ శ్రీనివాసుడు అమ్మ పద్మావతిని కోరుతున్నాడు. శ్రీకృష్ణావతార రీతిలో వేడుకుంటున్నాడు. అన్నమయ్య ఊహ మరియూ భావనా ప్రపంచ విహారానికి ఈ కీర్తన అద్దం పడుతున్నది. ఆ విశేషాలు చూద్దాం. కీర్తన: పల్లవి: పూవుటమ్ములు మరుఁడు పూఁచినాఁ డేమరఁడు రావే నామాఁట విని రవ్వపడనేఁటికే ॥పల్లవి॥ చ.1 వద్దు నీచలము వలపించఁగలము! నీ కొద్ది దెలిసిన దాఁకా గొంకే మింతే అద్దొ యిటువలె నలిగేవా నెంతలేదు చద్దికి వేఁడికి నవి సాగ వింతేకాక ॥పూవు॥ చ.2 యింతేలే నీకోపము యిందు కెల్లా నోపము! నీ- పంతము చూచినదాఁకా పాటించే నింతే యెంతో బిగువుతోడ యెలయించే దెంతలేదు సంతతము పతి వద్ద జరగదుగాక ॥పూవు॥ చ.3 మానవే నీబిరుదు మాకు నివి యరుదు నానఁబెట్టి క

వీక్షణం – 88

వీక్షణం
- రూపారాణి బుస్సా గొల్లపూడి మారుతీరావు గారికి నివాళులర్పిస్తూ రెండు నిముషాల పాటు మౌనం పాటించి 88 వ వీక్షణ సభ ప్రారంభించబడినది. తరువాతి కార్యక్రమంగావెంకట రమణ రావు గారు తాము వ్రాసిన కథ చదివారు. ఈ కథ పుట్టిల్లు అన్న శీర్షికతో 2008లో నవ్యలోప్రచురింపబడినది.ఈఛ్Fఆఈ సంస్థ వాళ్ళు పెట్టిన పోటీలో మొదటి బహుమతి పొందింది. కథ నేపథ్యం అనంతపురంలోజరిగినట్టు చెప్పబడినది. కొన్ని సంభాషణలలోప్రాంతీయ భాషా శైలి కనబడుతుంది. కథ ఇలా కొనసాగుతుంది:- పార్వతి తన కూతురి ఇంటికివెళ్ళినప్పుడు తన ఊరి స్నేహితురాలు అలిమేలును కలిసి సొంత ఊరి వాళ్ళ గురించి తెలుసుకునిఏదో స్వగతాలలో మునుగుతుంది. స్నేహితురాళ్ళంతా కలిసినపుడు తోట, స్నేహం ఉన్నంత వరకు ఇదేమన పుట్టిల్లు అని అనుకున్నారు. ఊరులో ఒంటరిగా ఉంటున్న పార్వతమ్మకు కొడుకు, కోడలు వచ్చిఎంత పిలిచినా తన అవసరం ఉన్న వారి దగ్గర ఉండడమే న్యాయం మరియు ఈ ఇంట్లో చివరి కాలం గడపడమేసమంజసం అ

రంగ్ దే బసంతి

కథా భారతి
-ఆర్ శర్మ దంతుర్తి ఒకానొక రాజ్యంలో రాజు తెలుపు, ప్రథానమంత్రి తెలుపు, అనుయూయులూ తెలుపే. ప్రజలందరూ తెలుపు. అన్నీ సజావుగా సగిపోతున్న రోజుల్లో ఓ తెల్లవాడు అడవుల్లో వేటకెళ్ళాడు. అక్కడో చిన్న తండా అందులో కొంతమంది మనుషులూ ఉంటే, దాహం కోసం వాళ్ళదగ్గిరకెళ్ళిన ఈ తెల్లవాణ్ణి ఆ తండా మనుషులు వింతగా చూడ్డం మొదలుపెట్టారు. కారణం ఏవిటంటే తండాలో మనుషులందరూ నల్లవాళ్ళు. బావిలో కప్పల్లా బతుకుతున్న వాళ్ళకి మనుషులు తెల్లగా ఉంటారని తెలీదు ఈ తెల్లవాణ్ణి చూసేవరకూ. తెల్లవాడిక్కూడా అదే పరిస్థితి. వీడూ తెల్లబావిలో కప్పే కానీ ఆ నల్లవాళ్లలా ‘నాకూ ఇలా నల్లవాళ్ళు ఉంటారని తెలియదు’ అనే మాట బయటకి చెప్పలేదు. వీడు దాహం తీర్చుకున్నాక వేట చాలించి తన రాజ్యానికికొచ్చి తను చూసిన విషయం తెల్ల రాజ్యంలో చెప్పేసేడు ఇలా తాను నల్ల మనుషులని చూసినట్టు. కొంతమంది నమ్మితే, కొంతమంది నమ్మలేదు. నమ్మనివాళ్లని కొంతమందిని పోగు చేసి తెల్లరాజు ఓ తెల్ల

*ఎండ పద్యం*

కవితా స్రవంతి
~ తగుళ్ళ గోపాల్ ఈ ఎండలకు వాగుల గొంతెండి మనిషి ముందు నోరు జాపినయి. మేఘాల రెక్కలు తెగి గాలిలో ఈకల్లా తిరుగుతున్నయి. భూతల్లి కాళ్ళు కాలి అరికాళ్ళు పగుళ్ళొచ్చినయి. కొండతల రెండు ముక్కలై రక్తమంతా గాలిలో ఆవిరైతుంది. పిట్టలు పిట్టల్లాగే రాలిపోతున్నయి పచ్చికట్టెల నడుములన్ని పటపట ఇరిగిపడుతున్నవి. చావే మేలని పాములన్ని తాగడానికి ఇంత విషాన్ని అడుగుతున్నవి ఎండ తగ్గె మార్గం చెప్పమని కుక్క ఒక్కటే ఒగిరిస్తుంది. నిలబడటానికి నీడలేని మేకలు, గొర్లు మిట్ట మధ్యాహ్నం కాలుతున్న రాళ్ళైనయి. ఆదివాసి తల్లి తోలుసంచి పట్టుకొని నగరం నడిమధ్యన స్థూపమైంది. చెట్లమెడ కోసిన మనిషి మాత్రం ఏమీ తెల్వనట్టు కిలకిల నవ్వుకుంట ఏసీలో కూర్చోని ‘డిస్కవరీ ఛానల్ చూస్తుండు’

*ఏక్ తార!*

కవితా స్రవంతి
~వెన్నెల సత్యం గాయపడిన రాత్రి వేకువను లేపనంగా రాసుకుంటోంది. అమరవీరుల ఆత్మలు స్థూపంలోనే వణికిపోతున్నాయి రణరంగంలా మారిన ట్యాంక్ బండ్ మీద తథాగతుడికి మరోసారి జ్ఞానోదయమయ్యింది. ఉద్యమకారుల రక్తంతో తడిసిన ఇనుపకంచెలు కార్మికుల రుధిరాన్ని నాలుకతో జుర్రుకుంటున్నాయి. దేహాలపై నాట్యమాడటానికి అలవాటు పడ్డ లాఠీలు నిరసన కారుల ఎముకల్ని పెఠీల్మని విరిచేస్తున్నాయి. హక్కుల పిడికిళ్ళు ఆత్మహత్యలు చేసుకుంటుంటే ప్రశ్నలెపుడో ఈ నేల మీదనించి పరారయ్యాయి. మాటల తూటాలు పేల్చిన గొంతుల్లో తుపాకి తూటాలు దిగుతున్నాయి. రుధిరంతో ఎరుపెక్కిన తంగేడు పూలన్నీ తలలు దించుకున్నాయి ఉద్యమ కవిత్వమై ఉసిగొల్పిన కలాలు ఉడుకు రక్తాన్ని ధారపోయించిన గళాలు గంపకింది కోడిపెట్టలై పాలకుల పంచలో గుడ్లు పెడుతున్నాయి. ఉద్యమాల పురిటిగడ్డ ఊపిరి తీసుకోడానిక